Thursday, January 23, 2025

ఇయర్ ఎండింగ్.. మళ్లీ చిక్కుల్లో రష్మిక

- Advertisement -
- Advertisement -

ఈ మధ్య కాలంలో రష్మిక మండన్న వరుస వివాదాలను ఎదుర్కొంటుంది. అనుకోకుండా నోరు జారిన మాటల కారణంగా నెటిజన్లు ఆమె పై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. సౌత్ సినీ ఇండస్ట్రీ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పుష్ప మూవీలో నటించిన తరువాత ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్‌లో నటించిన మిషన్ మజ్ను మూవీ ప్రమోషన్‌లో భాగంగా సాంగ్ రిలీజ్ కార్యక్రమంలో రష్మిక పాల్గొని మాట్లాడుతూ రొమాంటిక్ సాంగ్స్‌ను తెరకెక్కించడంలో బాలీవుడ్ ది బెస్ట్ , సౌత్‌లో ఎక్కువగా మాస్ మసాలా, కమర్షియల్ హంగులు ఉంటాయని అంటూ బాలీవుడ్ పై ప్రశంసలు కురిపించింది.

Rashmika Mandanna Controversial Comments

ఇటీవల రష్మిక కన్నడ చిత్ర పరిశ్రమ నుండి నిషేధించబడింది. ఎందుకంటే ప్రతి ఇతర ప్రముఖులు కాంతారావు చిత్రం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె కాంతారావు గురించి ఏమీ ట్వీట్ చేయలేదు. ఇప్పుడు సౌత్ సినిమాలపై షాకింగ్ కామెంట్స్ చేస్తోంది. దీంతో నెటిజన్స్ హార్డ్ వర్క్, డెడికేషన్‌తో స్టార్‌గా ఎదిగింది, అయితే సౌత్ సినిమాలు ఆమెకు చాలా సంవత్సరాలు గుర్తుండిపోయే జీవితాన్ని ఇచ్చాయని, నీకు గుర్తింపు వచ్చిందే సౌత్‌ఇండస్ట్రీ వల్ల ఆ సంగతి మరిచిపోకు అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News