Tuesday, April 29, 2025

రష్మిక పెద్ద మనసు.. రూ.10 లక్షల విరాళం

- Advertisement -
- Advertisement -

బ్లాక్ బస్టర్ మూవీస్‌తో పాన్ ఇండియా క్వీన్‌గా పేరు తెచ్చుకుంది రష్మిక మందన్న. ఆమె మరోసారి తన మంచి మనసు చాటుకుంది. కేరళ వయనాడ్‌లో ఇటీవల కొండచరియలు విరిగిపడి సృష్టించిన విషాదం పట్ల రష్మిక మందన్న తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.

బాధితులను ఆదుకునేందుకు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం 10 లక్షల రూపాయల విరాళం ప్రకటించింది. ఈ కష్ట సమయంలో కేరళ ప్రజలంతా ధైర్యంగా ఉండాలని ఆమె పేర్కొంది. రష్మిక మందన్న ప్రస్తుతం ‘పుష్ప 2’ ది రూల్ సినిమాతో పాటు బాలీవుడ్ మూవీ ‘సికిందర్‘ లో నటిస్తోంది. ఆమె ఖాతాలో ‘ది గర్ల్ ఫ్రెండ్’ అనే ఆసక్తికరమైన మూవీ కూడా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News