Monday, December 30, 2024

రష్మికపై మరో ఫేక్ వీడియో

- Advertisement -
- Advertisement -

రష్మికపై మరో ఫేక్ వీడియో వెలుగులోకి వచ్చింది. ఇందులో ఆమె జిమ్ సూట్ ధరించి నాట్యం చేస్తున్నట్లు ఉంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోపై రష్మిక అభిమానులు, సాటి సినీ నటీనటులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మధ్యనే రష్మికపై వచ్చిన ఒక డీప్ ఫేక్ వీడియో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. జారా పటేల్ అనే ఒక సోషల్ మీడియా స్టార్ వీడియోను మార్ఫింగ్ చేసి రష్మిక మొహాన్ని అతికించి చేసిన ఈ వీడియోపై అమితాబ్ తో సహా అనేకమంది సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ఐటి శాఖ కూడా స్పందించింది. ఇలా డీప్ ఫేక్ వీడియోలు సృష్టించిన వారిపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించింది. అయితే ఈ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ రష్మికపై మరో ఫేక్ వీడియోను సృష్టించడం ఆందోళన కలిగిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News