Wednesday, January 22, 2025

రణబీర్ ప్రియురాలు గీతాంజలిగా రష్మిక.. ఫస్ట్ లుక్ అదిరింది

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టు ‘యానిమల్’. T-సిరీస్, మురాద్ ఖేతాని సినీ1 స్టూడియోస్, ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మూవీలో రణబీర్ కపూర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మంధాన నటిస్తోంది. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రణబీర్ కపూర్ లుక్ తోపాటు గ్లింప్స్ కు సినీ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. ఇందులో బల్బీర్ సింగ్ గా అనిల్ కపూర్ నటిస్తున్నారు. రీసెంట్ గా విడుదల చేసిన అనిల్ కపూర్ ఫస్ట్ లుక్ టెర్రిఫిక్ గా వుంది. ఫస్ట్ లుక్ పోస్టర్, యానిమల్ లో అనిల్ కపూర్ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా వుంటుందో తెలియజేస్తోంది.

Also Read: బోయపాటి శ్రీను-సూర్య కాంబినేషన్ లో మూవీ?

తాజాగా రష్మిక మంధనా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. సంప్రదాయమైన చీరకట్టులో కుందనపు బొమ్మ లాగా ఉన్న రష్మిక లుక్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ ప్రియురాలు గీతాంజలిగా రష్మిక నటిస్తోంది.ఇక, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఎక్సయిటింగ్ టీజర్ సెప్టెంబరు 28న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News