Monday, December 23, 2024

‘డి51’లో రష్మిక మందన్న

- Advertisement -
- Advertisement -

నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్ తన 51వ సినిమా కోసం టాలీవుడ్ మోస్ట్ సెన్సిబుల్ డైరెక్టర్, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్‌మేకర్ శేఖర్ కమ్ములతో చేతులు కలిపారు. నారాయణ్ దాస్ కె.నారంగ్ ఆశీస్సులతో, సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ క్రేజీ ప్రాజెక్ట్ ‘డి51’ని తమ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి (ఏషియన్ గ్రూప్)లో అమిగోస్ క్రియేషన్స్ ప్రై.లి.తో కలసి నిర్మిస్తున్నారు.

సోనాలి నారంగ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటించనున్నారు. ధనుష్, శేఖర్ కమ్ముల, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పితో రష్మికకు ఇదే ఫస్ట్ అసోషియేషన్. ఈ సందర్భంగా రష్మిక మందన్న తన ఆనందాన్ని పంచుకుంటూ “చాలా ఆసక్తికరంగా వుంది. ఈ ఆనందాన్ని మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను” అని ‘డి51’ ఫోటో ఫ్రేంని చూపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News