నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది. స్టార్ హీ రోలందరూ ఆమెతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక ఇటీవల ‘పుష్ప 2’ మూవీతో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ అందుకుంది ఈ బ్యూటీ. గత ఏడాది ‘యానిమల్’ మూవీలో రణ్‌బీర్ కపూర్ సరసన హీరోయిన్‌గా రష్మిక నటించగా, ఆ మూవీ కూడా బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది.
ఇలా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర బ్యాక్ టు బ్యాక్ రెండు బ్లాక్‌బస్టర్స్ అందుకున్న రష్మిక, ఇప్పుడు హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ హీరోగా తెరకెక్కిన హిస్టారికల్ చిత్రం ‘ఛావా’ ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో విక్కీ కౌశల్ ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రలో నటిస్తుండగా, రష్మిక మహారాణి యేసు భాయి పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాపై బాలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి. దీంతో ఈ సినిమాతో రష్మిక ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.