Friday, December 20, 2024

సైబర్ నేరాలపై నేషనల్ బ్రాండ్ అంబాసిడర్‌గా రష్మిక మందన్న

- Advertisement -
- Advertisement -

నటి రష్మిక మందన్న ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (14సి)నేషనల్ బ్రాండ్ అంబాసిడర్‌గా మంగళవారం కేంద్ర ప్రభుత్వం నియమించింది. దేశంలో సైబర్‌క్రైమ్ నేరాలపై అవగాహన కల్పించే చొరవలో భాగంగా కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈ ఏర్పాటు చేసింది. పుష్ప: ది రైజ్, డియర్ కామ్రేడ్, యానిమల్ తదితర సినిమాల ద్వారా అత్యంత ప్రజాదరణ పొందిన రష్మిక మందన్న ఆమెపై డీప్‌ఫేక్ వీడియా బాగా వైరల్ కావడం సంచలనం కలిగించింది. సైబర్ క్రైమ్ ప్రభావానికి బాధితురాలైన ఆమె మన ఆన్‌లైన్ వరల్డ్‌ను రక్షించుకోడానికి కఠినమైన చర్యలు అమలు చేయాల్సిన సమయం ఇదే అని పేర్కొంది.

“ సైబర్‌స్పేస్‌ను మనకు మనం మన భవిష్యత్ తరాల కోసం సురక్షితం నిర్మించుకుందాం. సైబర్ నేరాలపై అవగాహన కల్పించడానికి , రక్షణ కల్పించడానికి బ్రాండ్ అంబాసిడర్ పాత్ర వహించే బాధ్యత తీసుకున్నాను. ప్రభుత్వంతోపాటు నన్ను కూడా మీకు సహకరించేలా తోడ్పడండి ” అని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో వివరించారు. ఇన్‌ష్టాగ్రామ్‌లో రష్మికకు 44.2 మిలియన్ అభిమానులున్నారు. ఎక్స్ ఖాతాలో 4.9 మిలియన్ మంది ఫాలోయర్లు ఉన్నారు. ఈమేరకు ఆమె 1930 నంబరుకు సైబర్ నేరాలపై కాల్ చేయాలని కోరారు. లేదా సైబర్‌క్రైమ్ . గవ్.ఐన్. వెబ్‌సైట్ ద్వారా నైనా తెలియజేయాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News