Sunday, December 22, 2024

లవ్‌లో ఫెయిల్ అయ్యా

- Advertisement -
- Advertisement -

Rashmika Mandanna opens up about her breakups

రష్మిక మందాన ఇప్పుడు బాలీవుడ్‌లో సెటిల్ అయ్యే ఆలోచనలో ఉంది. అక్కడ రెమ్యునరేషన్ ఎక్కువగా ఉంది ఈ భామకి. ఇప్పటికే ముంబైకి మకాం మార్చిన ఆమె హైదరాబాద్‌లో షూటింగ్ ఉన్నప్పుడు మాత్రమే వస్తోంది. తాజాగా తన మొదటి హిందీ చిత్రం ‘గుడ్ బై’ ప్రొమోషన్ కోసం చాలా కష్టపడుతోంది. దేశమంతా తిరుగుతోంది. ఈ ప్రమోషన్ సందర్భంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక విషయాలను సంకోచం లేకుండా మాట్లాడుతోంది. అవును నేను లవ్‌లో ఫెయిల్ అయ్యాను. మూడు, నాలుగు సార్లు ప్రేమలో పడ్డా. కొన్ని నా వల్ల బ్రేకప్ అయ్యాయి. మరికొన్ని వాళ్ళ వల్ల బ్రేకప్ అయ్యాయి. కారణాలు ఏమైనా మాజీ బాయ్ ఫ్రెండ్స్‌తో శత్రుత్వం లేదు. ఇప్పటికీ వారితో ఫ్రెండ్లిగా ఉంటాను అని చెప్పింది రష్మిక. అంతేకాకుండా ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ గురించి కూడా చెప్పింది. ఇక, ‘గుడ్ బై’ సినిమా ఈనెల 7న విడుదల కానుంది.

Rashmika Mandanna opens up about her breakups

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News