Thursday, January 23, 2025

రష్మిక మందన్న అందంపై…

- Advertisement -
- Advertisement -

ముంబై: నటి రష్మిక మందన్న సోమవారం ఉదయం ముంబైలో కనిపించగానే ఫోటోగ్రాఫర్లు వెంటబడి క్లిక్…క్లిక్ మనిపించారు. ఎవరైన ప్రసిద్ధ వ్యక్తుల వెంటబడి వారి ఫోటోను తీసే ఛాయాచిత్రకారులను ‘పపరజీ’ అంటారు. రష్మిక ముంబై నుంచి తెలియని గమ్యస్థానానికి అక్కడి నుంచి వెళ్లింది. అయితే దీనికి సంబంధించిన వీడియోను రష్మిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

ఆమె పెట్టిన వీడియోలో ఆమె విమానాశ్రయానికి వస్తున్న దృశ్యం ఉంది. ప్రయాణానికి అనుగుణంగా తగిన దుస్తులను ఆమె ధరించి కనిపించింది. ఆమె వైట్ షర్ట్‌తో పాటు బ్లాక్ టి (TEE)లో కనిపించింది. ఆమె మాస్క్‌ను ధరించింది. భుజాలకు నల్లని స్లింగ్(బ్యాగ్) ధరించింది. ఆ తర్వాత ఆమె ఓ పపరజీ ‘ఫోటోకు ఓ ఫోజ్ ఇవ్వండి ప్లీజ్’ అని అడిగాడు. దానికి ఆమె చిరునవ్వుతో తన మాస్క్‌ను తీసేసి నవ్వుతూ ఫోజ్ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె “మీరు నిద్ర పోలేదా?” అని అడిగింది. దానికి ఓ ఫోటోగ్రాఫర్ “మేము నిద్రించే ఇక్కడికి వచ్చాము” అని జవాబిచ్చాడు. మరో ఫోటోగ్రాఫర్ “మేము పొద్దునే పనిచేసేవాళ్లం” అన్నాడు. దానికి రష్మిక “నేను ఇప్పుడే లేచి వచ్చాను” అన్నది. ఆ తర్వాత మరో ఛాయాగ్రాహకుడు “మీరు అందంగా ఉన్నారు… నిజంగానే చాలా అందంగా ఉన్నారు” అని వ్యాఖ్యానించాడు. ఆ తర్వాత ఆమె విమానాశ్రయంలోకి వెళ్లిపోతూ ఆ పపరజీలకు చేయి ఊపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News