Monday, January 20, 2025

రష్మిక మందన ప్రధాన పాత్రలో ‘రెయిన్‌బో’ ప్రారంభం..

- Advertisement -
- Advertisement -

ఖాకీ, ఖైదీ, సుల్తాన్, ఒకే ఒక జీవితం వంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ మరో అద్భుతమైన మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రధాన పాత్రలో బ్రీజీ రొమాంటిక్ ఫాంటసీ ఎంటర్ టైనర్ ‘రెయిన్‌బో’ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పై ఎస్ఆర్  ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు.  నూతన దర్శకుడు శాంతరూబన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం ఈ రోజు గ్రాండ్ గా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి అమల అక్కినేని క్లాప్ కొట్టగా, అల్లు అరవింద్ కెమరా స్విచాన్ చేయగా, సురేష్ బాబు స్క్రిప్ట్ అందించారు.

నటుడు దేవ్ మోహన్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం, భాస్కరన్ సినిమాటోగ్రఫీ.. ఈ రెండూ సినిమాలోఆకర్షణగా వుండబోతున్నాయి. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ డిజైనర్ బంగ్లాన్ ప్రొడక్షన్ డిజైన్ ఇన్‌ఛార్జ్‌గా పని చేస్తున్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా రష్మిక మాట్లాడుతూ..  ‘రెయిన్‌బో’ కోసం చాలా ఎక్సయిటెడ్ గా వున్నాను. దర్శకుడు దర్శకుడు శాంతరూపన్ అద్భుతమైన కథతో వచ్చారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాతలకు కృతజ్ఞతలు. టీం అందరితో కలసి పని చేయడానికి ఎదురుచూస్తున్నాను’’ అన్నారు.

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాత..  ‘ఒకే ఒక జీవితం’ తర్వాత మరో మంచి కథతో మీ ముందుకు రాబోతున్నాం. దర్శకుడు శాంతరూపన్ చాలా మంచి కథని రాసుకున్నారు. రష్మిక గారికి కృతజ్ఞతలు. మంచి టెక్నికల్ టీం, సరికొత్త కథాంశంతో రాబోతున్న ‘రెయిన్‌బో’ కూడా తప్పకుండా మిమ్మల్ని అలరిస్తుందని నమ్ముతున్నాం ” అన్నారు. దర్శకుడు శాంతరూపన్.. ప్రభు గారు ఒక కథ ఓకే చేస్తే ఎలా వుంటుందో అందరికీ తెలుసు  ‘రెయిన్‌బో’ అంతే అద్భుతంగా వుంటుంది. ఈ కథని అంగీకరించిన రష్మిక గారికి కృతజ్ఞతలు. టీం అంతా ఎంతో సపోర్ట్ చేస్తోంది. మీకు వండర్ ఫుల్ ప్రాజెక్ట్ ఇవ్వడానికి శ్రమిస్తున్నాం’’ అన్నారు.

Rashmika Mandanna's Rainbow movie launched

దేవ్ మోహన్  మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకుల అభిమానానికి కృతజ్ఞతలు. నా మొదటి సినిమా శాకుంతులం విడుదలకు ముందే ఈ సినిమా ప్రారంభం కావడం ఆనందంగా వుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాతలు ఎస్ఆర్  ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు గారికి థాంక్స్. దర్శకుడు ఈ కథ చెప్పినపుడే ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది’’ అన్నారు. కాగా, ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 7 నుండి ప్రారంభం కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News