Wednesday, December 4, 2024

పుష్ప-2 ఫోటోలు లీక్.. రష్మిక అసహనం

- Advertisement -
- Advertisement -

పుష్ప-2 మూవీపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై లీక్ వీరులు కన్నేశారు. ఎంతో పకడ్బందీగా చిత్రీకరణ జరుగుతున్నా.. సినిమాలో అల్లుఅర్జున్ కు సంబంధించిన ఓ ఫోటో లీక్ అయ్యింది. ఇకేముంది.. క్షణాల్లో వైరల్ గా మారింది. దీనిపై హీరోయిన్ రష్మికా మందన్న స్పందిస్తూ అసహనం వ్యక్తం చేశారు.

“షూటింగ్ సెట్ నుంచి నటీనటుల ఫోటోలు లీక్ చేయడం కరెక్ట్ కాదు. ఈ సినిమా కోసం ఎంతో మంది కష్టపడి పనిచేస్తున్నారు. ముందే ఫోటోలు లీక్ చేేస్తే.. విడుదలైన తర్వాత ఆసక్తి ఉండదు. దయచేసి ఇలాంటి పనులు చేయకండి. పుష్ప-2 భారీ అంచనాలు ఉన్నాయి. సరైన సమయంలో మీ ముందుకు వస్తుంది. మిమ్మల్నీ అలరిస్తుంది. సినిమా ప్రైవసీకి భంగం కలిగించవద్దు” అంటూ సోషల్ మీడియాలో రష్మిక అసహనం వ్యక్తం చేసింది.

కాగా, పుష్ప-1 మూవీ కూడా లీక్ ల బెడదకు గురైంది. విడుదలకు ముందే ఓ సీన్ లీకైంది. తాజాగా ఇప్పుడు పుష్ప-2 నుంచి ఫోటోలు లీకవ్వడంతో చిత్రయూనిట్ అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. మరింత పకడ్బందీగా షూటింగ్ కు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు లీక్ వీరులపై లీగల్ గా వెళ్లనున్నట్లు వార్తలు వినిపిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News