Friday, December 27, 2024

క్రేజీ సీక్వెల్‌లో మరింత పవర్‌ఫుల్‌గా…

- Advertisement -
- Advertisement -

Rashmika Role More Powerful in 'Pushpa 2'

అల్లు అర్జున్ ‘పుష్ప 2’ పూజా కార్యక్రమాలు తాజాగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో సినిమా ప్రారంభం కావాల్సిఉండగా స్క్రిప్ట్‌ను మరింత బలంగా.. సినిమాలోని పాత్రలను మరింత ప్రభావితంగా చూపించడం కోసం దర్శకుడు సుకుమార్ స్క్రిప్ట్ వర్క్‌కు కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు.‘ పుష్ప 2’లోని ప్రతి పాత్రను కూడా అభిమానులు అంతకు మించి అన్నట్లుగా ఊహించుకుంటున్నారు. పుష్ప రాజ్‌ను మొదటి పార్ట్ లో ఒక సామాన్య కూలీగా చూపించిన దర్శకుడు సుకుమార్ రెండవ పార్ట్‌లో ఎలా చూపించబోతున్నాడు? అనే ఆసక్తి అందరిలో కనిపిస్తోంది. అదే సమయంలోనే రష్మిక మందన్న పాత్ర పై అంచనాలు మరింత పెరిగాయి. పుష్ప, శ్రీవల్లిల పెళ్లి పుష్ప పార్ట్ 1లో జరిగింది. పార్ట్ 2లో పుష్ప భార్యగా శ్రీవల్లి కనిపించబోతుంది. ఆమె పాత్ర సాదాసీదాగా ఉంటే ఖచ్చితంగా ఆమె అభిమానులు ఒప్పుకోరు. అందుకే సుకుమార్ ఆమె పాత్రను కథలో భాగస్వామ్యం చేసి మరింత పవర్‌ఫుల్‌గా చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్న ‘పుష్ప’2 ను వచ్చే ఏడాది సమ్మర్‌లో లేదా కాస్త అటు ఇటుగా దసరాకు అయినా విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.

Rashmika Role More Powerful in ‘Pushpa 2’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News