Wednesday, January 22, 2025

అదే నా బ్యూటీ సీక్రెట్

- Advertisement -
- Advertisement -

Rashmika says that exercising every day is same as her beauty secret

 

యంగ్ బ్యూటీ రష్మిక మందన్న చాలా ఫిట్‌గా ఉంటుంది. తన అందాన్ని కాపాడుకోవడానికి ఆమె ప్రతి రోజూ ఎక్స్‌ర్‌సైజ్‌లు చేస్తుందట. అదే తన బ్యూటీ సీక్రెట్ అని చెబుతోంది రష్మిక. “ప్రతిరోజూ ఎక్సర్‌సైజ్‌లు చేయాలి. ఏ రోజూ గ్యాప్ ఇవ్వకూడదు. అదే నా బ్యూటీ సీక్రెట్. తప్పని పరిస్థితుల్లో తప్ప నేను ఎప్పుడూ ఎక్సర్‌సైజ్‌లు చేయడం ఆపను” అని చెప్పింది ఈ భామ. ఈ అమ్మడు గతంలో వర్కవుట్‌ల విషయంలో పెద్దగా సీరియస్‌గా ఉండేది కాదట. కానీ సినిమా ఇండస్ట్రీలో ఇతర నటీనటుల శ్రమపడే విధానాన్ని చూసి ఆమె స్ఫూర్తి పొందిందట. ఒక్కసారి జిమ్మింగ్ అలవాటు అయితే వదలం అని కూడా చెబుతోంది ఈ బ్యూటీ. అయితే ఎక్కువ సేపు జిమ్‌లో ఉండదట. తక్కువ టైంలో ఎక్కువ వర్కవుట్స్ చేయడం వల్ల మంచి ఫలితం వస్తుందని గ్రహించిందట ఈ భామ. హైదరాబాద్ లో ఆమెకి ప్రత్యేక ట్రైనర్ ఉన్నాడు. పాతికేళ్ల ఈ సుందరి త్వరలోనే రెండు కొత్త సినిమాలు ప్రకటించనుంది. ప్రస్తుతం ఆమె ‘పుష్ప 2’కి సిద్ధమవుతోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News