Monday, January 20, 2025

రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ హత్య

- Advertisement -
- Advertisement -

జైపూర్ : జైపూర్‌లో రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేశ్ సింగ్ గోగా మోడీని దుండగులు కాల్చి చంపారు. ఆయన ఇంట్లోకి చొరబడి కాల్పులు జరిపినట్టు ప్రాథమిక సమాచారం. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా ఆయన ప్రాణాలు కోల్పోయారు. సుఖదేవ్ సింగ్‌ను చంపుతామంటూ గతంలో లారెన్స్ విష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన సంపత్ నెహ్రూ నుంచి పోలీస్‌లకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అయితే ఈ సంఘటన జరిగిన వెంటనే శ్యామ్‌నగర్ ప్రాంతంలో పోలీస్ బలగాలను మోహరించారు.

గన్‌మెన్ నరేంద్రపై కూడా దుండగులు కాల్పులు జరిపినట్టు చెబుతున్నారు. ఆ ప్రాంతం సీసీటీవీ ఫుటేజిని పోలీస్‌లు పరిశీలిస్తున్నారు. రాష్ట్రీయ కర్ణిసేనతో చాలాకాలంగా సంబంధాలున్న సుఖ్‌దేవ్ సింగ్ విభేదాలు రావడంతో రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన పేరుతో మరో సంస్థ ఏర్పాటు చేశారు. బాలీవుడ్ చిత్రం పద్మావత్, గ్యాంగ్‌స్టర్ ఆనంద్ పాల్ ఎన్‌కౌంటర్ కేసు తర్వాత రాజస్థాన్‌లో జరిగిన అనేక ధర్నాలతొ ఆయన పేరు బాగా ప్రచారం లోకి వచ్చింది. సుఖ్‌దేవ్ సింగ్ హత్యపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని పోలీస్ కమిషనర్‌ను కోరినట్టు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News