Monday, January 20, 2025

అదానీపై దాడి కుట్రపూరితమే

- Advertisement -
- Advertisement -

నాగ్‌పూర్ : పతన షేర్లతో , పెట్టుబడుల వివాదాలతో ఉన్న అదానీకి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మద్దతు ప్రకటించింది. సంఘ్ అధికారిక పత్రిక ఆర్గనైజర్‌లో సంబంధిత విషయంపై ఆర్‌ఎస్‌ఎస్ శనివారం స్పందించింది. అదానీ సంస్థల్లోకి భారీ స్థాయిల్లో ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడులు గురించి హిండెన్ బర్గ్ వెలువరించిన నివేదిక పూర్తిగా దురుద్ధేశపూరితం అని చాలా ఏళ్లుగా ఇదే క్రమంలో పలు దిక్కుల నుంచి అదానీపైనా, సంస్థలపైనా విమర్శలు తలెత్తుతున్నాయని ఆర్గనైజర్ పేర్కొంది.

భారత్ వ్యతిరేకి అయిన జార్జి సోరెస్ ఇంతకు ముందు ఇదే విధంగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ థాయ్‌లాండ్‌లపై కల్పిత కథలకు దిగి వాటిని దెబ్బతీశారని, ఇప్పుడు ఇదే తంతు సాగుతోందని , భారతీయ లాబీ ఒక్కటి కావాలనే అదానీ పట్ల ప్రతికూలత సృష్టికి ఈ విధంగా నివేదిక పేరిట , పరిశోధనల సాకుతో వార్తలకు ఎక్కిందని ఆర్‌ఎస్‌ఎస్ పేర్కొంది. ఈ భారత వ్యతిరేక బృందంలో దేశానికి చెందిన ప్రముఖ ప్రచార లేక దుష్ప్రచారాల వెబ్‌సైట్లు ప్రత్యేకించి వామపక్ష భావజాలంతో కూడిన వెబ్‌సైట్లు , ఓ ప్రముఖ వామపక్ష నేత భార్య అయిన ఓ జర్నలిస్టు పాత్ర ఉందని ఆర్గనైజర్ ఆరోపించింది. అదానీపై ఇప్పటి దాడికి బీజాలు ఇప్పటివి కావని, 2016లో ఆస్ట్రేలియాలోనే బీజాలు పడ్డాయని ఆర్గనైజర్ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News