మేష రాశి
ఆదాయం : 08 వ్యయం : 14
రాజ : 04 అవమానం : 03
అశ్వని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదముల యందు జన్మించిన వారు. “చూ, చే, చో, లా, లీ, లూ, లే, లో, ఆ” అను అక్షరములు తమ పేరునకు మొదట గలవారు మేషరాశికి చెందినవారు.
మేషరాశి వారికి ఈ సంవత్సరం బాగుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. వివాహాది శుభకార్యాలు ఓ కొలిక్కి వస్తాయి. గురువు, శని గ్రహ అనుకూల ప్రభావం చేత సమాజంలో స్థాయి, పరపతి పెరుగుతుంది. విద్యా, ఉద్యోగ విషయాలలో అభివృద్ధి కానవస్తుంది. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. మంచి నూతన ఉద్యోగం లభిస్తుంది. వృత్తిఉద్యోగాలలో సంతృప్తికరంగా (జాబ్ సాటిఫికేషణ్) ఉంటుంది. గురువు జన్మరాశి యందు తదుపరి వృషభ రాశి యందు సంచారం, శని కుంభ రాశి యందు సంచారం. గురు, శుక్ర మౌఢ్యాలు ప్రధాన ఫలితాలను నిర్ధేశిస్తున్నాయి. కుటుంబం కొరకు ఎక్కువగా ఖర్చు పెడతారు. ఖర్చులు తగ్గించుకోవాలని ఎంత ప్రయత్నాలు చేసినా సఫలీకృతం కాలేరు. కొన్ని వివాహ సంబంధాలు దగ్గరకు వచ్చి చేజారిపోతాయి. ఒడిదుడుకులు ఎన్ని ఎదురైనా మంచి సంబంధం కుదురుతుంది. ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. ఆధ్యాత్మిక రంగంలో రాజకీయా ల కారణంగా కొన్ని చేదు అనుభవాలు ఏర్పడతాయి. దొంగ స్వామిజీలను నమ్మి మోసపో యే అవకాశాలు ఉన్నాయి. పొరపాటున తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నందుకు మిమ్మల్ని మీరే నిందించుకుంటారు. సామాజికంగా ఏర్పడిన పరిస్థితుల దృశ్య సంతాన విషయాలలో ఎక్కువ శ్రద్ద కనపరుస్తారు. వ్యవసాయ రంగాల వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. వ్యవసాయ సంబంధమైన నల్ల నువ్వులు, పత్తి, అపరాలు, వ్యాపారులకు ఈ ఏడాది లాభిస్తాయి.
ఎగుమతి దిగుమతి వ్యాపారాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు (ప్రమోషన్) వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. కళాసాంస్కృతిక, క్రీడా రంగాలలో మీ ప్రతిభా పాటవాలు గుర్తింపుకు నోచుకుంటాయి. నూనె సంబంధమైన ఖనిజ సంబంధమైన వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. పాల ఉత్పత్తు లు, నీరు, కొబ్బరి తత్త్ సంబంధమైన వ్యాపారాలకు అనుకూలమైన కాలం. గృహంలో ఈ సం వత్సరం శుభకార్యాలు నిర్వహిస్తారు. సంతానం వలన కొంత సౌఖ్యం కలుగును. ప్రభుత్వ సం బంధిత కార్యాలు పూర్తిచేస్తారు. శని బలం వల న ప్రమోషన్స్‌తో కూడిన బదిలీలు మీకు అను క్ను చోటుకు అవుతారు. వర్క్ పర్మినెంట్ కాని వారికి పర్మినెంట్ అవుతుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలోని వారికి అనుకూల కాలం, బంగారం, వెండి వ్యాపారస్తులకు మంచి అనుకూల సమయం అని చెప్పవచ్చును. కుటుంబంలో నూతన వ్యక్తులు రావడం జరుగుతుంది.
ఉన్నత విద్యావంతులకు, నిరుద్యోగులకు తాత్కాలికంగా ఇబ్బందులు ఎదురైనా చిన్న చిన్న ఉద్యోగాలు లభించినా కూడా మొత్తం మీద కొంత వరకు ఊరట లభించి ఈ సంవత్సరం ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగం ఏదై నా బాద్యతతో నిబద్ధతతో మీరు కర్తవ్యాన్ని నిర్వహిస్తారు. తద్వారా మీ శ్రమకు తగిన గుర్తింపు ఆలస్యంగా అయినా దక్కుతుంది. నూతన అవకాశాలు కూడా తారసపడతాయి. ఒక మంచి ఉద్యోగాన్ని, మంచి స్థానాన్ని సాధిస్తారు.
సంతానసంబంధమైన విషయాలలో క్రమశిక్షణ చాలా అవసరం. సంతాన విషయంలో ఏకపక్ష నిర్ణయాలను తీసుకుంటారు. సంతానం ప్రవర్తన, వాళ్ళ చదువు, వాళ్ళ నడవడిక ఇవన్నీ మీ మానసికమైన ఆందోళనకు కారణమవుతాయి. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. మంచి ఉద్యోగం సాధించగలిగామన్న సంతృప్తిని కలిగి ఉంటారు. ఐ.ఐ.టి మరియు మెడిసిన్ సీటు సాధిస్తారు. గతంలో జరిగిన తప్పిదాలను తిరిగి జరగకుండా జాగ్రత్త వహిస్తారు. విదేశాలకు సంబంధించిన అంశాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. విదేశాలలో ఉన్న వారికి కా లం అనుకూలంగా వుంది. గ్రీన్‌కార్డు, హెచ్1బి వీసా, పి.ఆర్. లభిస్తాయి. విదేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశం కూడా లభిస్తుంది. మొ త్తం మీద ఈ సంవత్సరం అభివృద్ధి దిశగా ఉం టుంది. ఈతలు, పిక్నిక్‌లు, బైక్ రైడింగ్‌లు ఇ లాంటివి మీకు అంతగా కలిసిిరావు.
సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. వివాహ విషయాలు ఈ సంవత్సరం కొంత విసుగు, చిరాకు కలిగిస్తాయి. అయినా కూడా మీకు మంచే జరుగుతుంది. సంవత్సరం ద్వితీయార్ధంలో ఆకస్మికంగా సంబంధం కుదురుతుంది. వివాహానికి ముందు తప్పనిసరిగా వ ధూవరుల జాతక పరిశీలన చేసుకుని వివాహం చేసుకొనుట మంచిది. నమ్మిన వ్యక్తి ఆశ్చర్యంగా మోసం చేయడం జరుగుతుంది. ప్రేమ వివాహాల పట్ల నమ్మకం పోతుంది. (ఇది కొద్దిమంది విషయంలో మాత్రమే అందరికీ కాదు). ద్వితీ య వివాహం చేసుకోవాలని ప్రయత్నించే వారి కి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు.
ప్రేమ వివాహాలు అంతగా లాభించవు. గతంలో జరిగిన తప్పులు మళ్ళీ జరగకుండా ఉండాలని గ ట్టిగా నిర్ణయించుకుంటారు. అవివాహితులకు వివాహానికి అనుకూల కాలం. ఈ సంవత్సరం కుటుంబంలో కొన్ని అరమరికలు సంభవిస్తా యి. భార్యభర్తల మధ్య అనుకోని మాట పట్టిం పులు ఎదురవుతాయి. ఎక్కువ తక్కువ అనే భా వన, ఆర్థిక లావాదేవీల విషయంలో మాటమా ట పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇది అందరి విషయంలో కాదు. కుటుంబలో కొంత మానసిక అశాంతి నెలకుంటుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో సఖ్యత లోపిస్తుంది. మీవారే శత్రువులుగా మారే అవకాశాలు ఉన్నాయి. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సోదరీసోెదర వర్గంతో మాటపట్టింపులు ఉంటాయి. కాని అవి శాశ్వతంగా అయితే ఉండవు. మీరు చేయాల్సిన బాధ్యతలు సక్రమంగా చేసినా కూడా వారికి రుచించవు. ఏదో తక్కువ చేసారనే భావన వారిలో ఉంటుంది. సహోదర సహోదరీవర్గంతో నిష్కారణ విభేదాలు ఏర్పడతాయి. కుటుంబంలో విషబీజం నాటే వ్యక్తులు మీకు అత్యంత ఆత్మీయులు అవుతారు. నిష్కారణమైన తగాదాలు, స్పర్థలు చోటు చేసుకోవడం ప్రారంభమవుతుంది. గమనించుకోంటూ ఉండాలి.లేదంటే దూరం పెరిగే అవకాశాలు లేకపోలేదు.
వృషభ రాశి
ఆదాయం : 02 వ్యయం : 08
రాజ : 07 అవమానం : 03
కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 1, 2 పాదముల యందు పుట్టినవారు మరియు “ఈ, ఊ, ఏ, ఓ, వా, వీ, వు, వె, వో” అను అక్షరములు తమ పేరునకు మొదట గలవారు వృషభరాశికి చెందినవారు
వృషభరాశి వారికి ఈ సంవత్సరము మిశ్ర మ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక విషయా లు లాభిస్తాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. మొత్తం మీద శ్రమకి తగిన ఫలితం లభిస్తుంది. జ్యేష్ఠ సంతానం వలన పురోగాభివృద్ధి, మానసిక సంతోషం లభిస్తుంది. విద్య, ఉద్యోగ, పోటీ పరీక్షలు, విదేశాలలో అభ్యసించడానికి, విదేశీయా నం వంటి వాటికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అదే విధంగా గ్రీన్‌కార్డ్ కోసం, పరిశోధనా రం గంలో ఉన్న వారికి సానుకూల ఫలితాలు సం ప్రాప్తిస్తాయి. గురువు ద్వాదశ రాశి సంచారం, తదుపరి జన్మరాశి సంచారం, శని దశమ స్థాన చలనం, కేతువు పంచమ స్థాన చలనం, రా హువు లాభస్థాన మందు, గురు, శుక్ర మోఢ్యములు ప్రధాన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి.
మీ ఆధ్వర్యంలో నడిచే సంస్థలకు, వ్యాపారాలకు, ఉన్నతాధికారులకు సంవత్స ప్రధమార్ధంలో కొంత చికాకులు ఏర్పడే అవకాశం ఉం ది. మీరు గతంలో చేసిన, చేస్తున్నా పెట్టుబడులు జీవితంలో పురోగాభివృద్ధిని కలిగిస్తాయి. కోర్టు పరంగా, కుటుంబ పరంగా వచ్చే వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం బాగుంటుంది. పాతస్నేహాలు, కొత్తస్నేహాలు కలగలుపుగా పరపతి కలిగిన వారి పరిచయాలే ప్రాతిపదికగా, ప్రామాణికంగా కొన్ని కాంట్రాక్టులు, వ్యాపారాలు చేసి ప్రయోజనం పొందుతారు. విద్యార్ధిని, విద్యార్ధులకు చదువు మీద శ్రద్ధ చాలా అవసరం. చదుపుపై ఏకాగ్రత కోసం ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నిత్యం శ్రీమేధాదక్షిణామూర్తి శ్లోకం పఠించండి.మీ మెడలో శ్రీమేధాదక్షిణామూర్తి రూపు ధరించండి. కొంత వరకు చదువుమీద ధ్యాస ఏర్పడుతుంది. విదేశాలలో అభ్యసించాలనుకునే వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. వాటిని అధిగమించి మీరు కోరుకున్న విద్యను పొందడానికి ఓపిక, సహనం అవసరం. గీన్ కార్డు కోసం ప్రయత్నించేవారికి ఈ సంవత్సరం గ్రీన్‌కార్డు లభిస్తుంది, పి.ఆర్ లభిస్తుంది, హెచ్.1బి వీసా లభిస్తుంది. పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షలు, బ్యాంకు పరీక్షలు, టీచరు పరీక్షలు మొదలైన వాటిల్లో సానుకూల ఫలితాలు సాధిస్తారు. ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్., ఐ.ఐ.టి వంటి ప్రతిష్టాత్మకమైన వాటికి ఎంపిక అవుతారు.
కుటుంబంలో స్వల్ప ఒడిదుడుకులు ఉం టాయి. భార్యభర్తల మధ్య వచ్చే గొడవలు పెద్ద వి కాకుండా చూసుకోవడం చాలా అవసరం. చిన్న చిన్న మాటలే పెద్ద దూమారానికి దారి తీస్తుంది. మాటపట్టింపు, విభేదాలు కుటుంబలోని సఖ్యతను పాడుచేస్తుంది. ఆ కారణంగా మానసిక ప్రశాంతత లేకపోవడం, చికాకు, చి క్కులు కలిగిస్తాయి. సంసార జీవితంలో ఎటువంటి అరవరికలు లేకుండా ఉండును. మీ జీవి త భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత వర కు జాగ్రత్తలు అవసరం. తీర్ధ యాత్రల కొరకు ధనాన్ని వెచ్చిస్తారు. కుటుంబంలో శుభకార్యా లు చేస్తారు. ఏ పని తలపెట్టినా చాలా శ్రమపడి విజయం సాధిస్తారు. వివాహ పరంగా కొంత ఆలస్యం అయినా అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. దగ్గరగా వచ్చి చేజారిపోతున్న సంబంధాలపట్ల ఆందోళనకు గురి అవుతారు. మీరు చేసిన దానధర్మాల పుణ్యం వల్ల ఎట్టకేలకు ఒక మంచి సంబంధం కుదురుతుంది. మానసిక సంతోషం కలుగుతుంది.
పునర్వివాహ సంబంధ విషయాలలో కూడా మీ కృషి ఫలిస్తుంది. ప్రేమ వివాహాలను మాత్రం కఠినం గా వ్యతిరేకిస్తారు. అవివాహితులకు వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. మీ మనస్సాక్షికి విరుద్ధంగా కొన్ని కార్యక్రమాలు చేయవలసి వ స్తుంది. విదేశీ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. స్వతంత్ర నిర్ణయాలు తీసుకుని కుటుంబంలోనూ, బంధువులలోనూ కొంత అలజడి సృ ష్టిస్తారు. ఆదర్శవంతమైన జీవితంలో సక్రమం గా నడుస్తున్న మీ వ్యవహారశైలికి బంధువర్గం నుండి విమర్శలు పొందుతారు. పిల్లల ప్రవర్తన మిమ్మల్ని కొంత వరకు బాధ పెట్టవచ్చు. సంతా న పురోగతికై అధిక మొత్తంలో ధనం ఖర్చు చేయాల్సి రావచ్చు. సంతానం కోసం ప్రయత్నించే వారికి ప్రస్తుతం అనుకూల కాలం కాదు. స్పెక్యులేషన్ అనుకూలం. ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉండుట మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి రాజకీయ ప రంగా అనుకూలంగా ఉంది. రాజకీయ నాయకులకి కలిసొచ్చే కాలం అని చెప్పవచ్చును. క్రిం ది స్థాయి నుండి వచ్చే వారికి రాజకీయ పరంగా అనుకూలంగా ఉంటుంది.
రాజకీయ ఎదుగుదల సంతృప్తికరంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీ జీవితాశయం నెరవేరుతుంది. కార్మిక వర్గానికి అనుకూలంగా ఉంటుంది. మీ శ్రమకు తగినంత కాకున్నా గుర్తింపు లభిస్తుంది. పదోన్నతులు గోచరిస్తున్నాయి. గతంలో కొనుగోళ్ళు చేసిన స్థిరాస్తుల విలువ పెరిగినా అమ్మడానికి వీలులేని పరిస్థితి ఏర్పడుతుంది. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆరోగ్య పరంగా కొంత జాగ్రత్తలు అవసరం. మోకాళ్ళు, వెన్ను నొప్పులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం పోటీపరీక్షలు బాగా కలిసి వ స్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్, ఉన్నత పదవులు వంటివి వరిస్తాయి. మీరు ఎంతోకాలంగా బదిలీ కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్తలు అందుకుంటారు. నిరుద్యోగులకు అనుకూలమైన కాలం అని అనుకోవచ్చు. లాయర్లకి, డాక్టర్లకి, ఫార్మసీ రంగాల వారికిఅనుకూలమైన కాలమని చెప్పవచ్చును.అదే విధంగా మద్యం, మాంసం, నూనె, పెట్రోలియం రంగాల వారికి కూడా కలిసొచ్చే కాలం. భాగస్వాముల వ్యాపారాలకు అంత అనుకూలమైన కాలం కాదు.
చేజారిపోయాయి అనుకున్న మీ స్థిరాస్తులు తిరిగి మీకు అందే అవకాశాలు ఉన్నాయి. సినీ పరిశ్రమ, పత్రికారంగం వారికి కొంత వరకు అ నుకూల ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. టీవీ రంగంలోని వారికి ప్రజాదరణ గతంలో కన్నా ఇప్పుడు పెరిగినా కూడా తగిన ప్రోత్సాహం, అవకాశాలు అందని ద్రాక్షలాగే ఉంటుంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న వృద్ధాశ్రమా లు, విద్యాసంస్థలు, అనాధ ఆశ్రమాలు, దివ్యాంగులకు సంబంధించిన ఆశ్రమాలు మొదలైన వాటికి మంచిఖ్యాతిలభిస్తుంది. ఆర్థిక సహాయం అందుతుంది. ఈ రాశికి అనుకూలమైన శని, రాహు గ్రహ ప్రభావం వలన వృత్తివ్యాపార సం బంధ విషయాలలో మీ వ్యూహాలు ఫలిస్తాయి. మీ సొంత వ్యాపారాలలో లాభాలు మీకు కలిసి వస్తాయి. మీ కుటుంబంలోని వారు బాధ్యతలు తీసుకోవడంతో కొంత వరకు అవరోధాలు ఏర్పడవచ్చు.
వృత్తిఉద్యోగాల పరంగా కాని ఇతరత్రా విషయాల వలన కాని న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి రావచ్చు. ఆర్థిక సమస్యలు ఓ కొలి క్కి వస్తే వేరేసమస్యలు ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. మొత్తం మీద ఈ రాశి వారు కొంత జాగ్రత్తలు తీసుకుంటే సంవత్సరాంతం మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ సంవత్స రం ఈ రాశివారు అంగారక పాశుపత ెమం చే యించుకుని, ఎనిమిది (8) సోమవారాలు శివుడికి అభిషేకం చేయడం ద్వారా మంచి ఫలితా లు అందుకుంటారు. ముఖ్యంగా కాలభైరవ అ ష్టకం, హనుమాన్ చాలీసా నిత్యం పఠిస్తే మంచిఫలితాలను సొంతం చేసుకున్న వారవుతారు. నూతన గృహాలు, భూములు క్రయవిక్రయాలు చేసే వారికి ఏప్రిల్ లోపల తీసుకుంటే అనుకూలంగా ఉంటుంది.
మిథున రాశి
ఆదాయం : 05 వ్యయం : 05
రాజ : 03 అవమానం : 06
మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదముల యందు పుట్టినవారు “కా, కి, కూ, ఖం, జ్ఞ, చ్ఛా, కే, కో, హా” అను అక్షరములు తమ పేరునకు మొదట గలవారు మిథునరాశికి చెందినవారు.
మిథునరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ప్రతిష్టాత్మకమైన అవార్డులు, రివార్డు లు లభిస్తాయి. ఆరోగ్య పరంగా కొంత జాగ్రత్త లు అవసరం. విదేశీయాన శుభ ఫలితాలు యో గిస్తున్నాయి. ప్రజా సంబంధాలు వృద్ధి చెందుతాయి. రాజకీయ పదవి లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా స్థిరత్వం పొందడం అవసరం. స్థా నచలనం ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి.
వైరివర్గాన్ని అధిగమించి పబ్లిక్‌లో మంచి ఖ్యాతి ని పొందుతారు. భార్యాభర్తల మధ్య అధికారం కొరకు విభేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. సోదరీ, సెదర భావనతో చేసే వారి సహాయ స హకారాలను స్వీకరించడం కొంత వరకు మీకు మంచిది. దీనివలన ఆర్థికంగా లాభపడతారు.
ఎగుమతి దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. అధికారుల మన్ననలు పొందుతారు. ధైర్యం చే సి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. వ్యాపారాన్ని హు విధాలుగా విస్తరింప చేస్తారు. పోటీ లేకుండా మీకు మీరే అనే విధంగా మీ ఆలోచన సరళి ఉంటుంది. అనుకున్న స్థాయిలో ధనం పె ట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలను సాధిస్తారు. వై ద్య విద్యలను అభ్యసించాలనే వారికి అనుకూలమైన కాలం. ఫార్మా, పాల ఉత్పత్తులు పరిస్థితులకు తగిన అమ్మకాలు చేసే వారికి, పరిశోధన రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుం ది. వ్యవసాయ రంగాలవారికి అనుకూలంగానే ఉంటుంది. కందులు, ధాన్యం, చిరుధాన్యాల ప ంట వేసే రైతులకు మంచి అభివృద్ధి ఉంటుంది. అపరాల పంటలు వేసే వారికి కూడా కొంత అభివృద్ధి కాన వస్తుంది. వర్షాభావం అనుకున్నంత అనుకున్న సమయానికి పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. పంట నష్టాలు అయితే ఊహించినంతగా ఉండవు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. శుభకార్యాల విషయంలో ఆర్థిక పరంగా కొంత భయపడతారు. మీ మనో ధైర్యమే మిమ్మల్ని అనుకూలమైన దిశకు, సరియైన వాతావరణం మలుచుకోవడంలో విజయం సాధిస్తారు. అనుకున్న సమయానికి అ నుకున్న విధంగా శుభకార్యాలను పూర్తి చేస్తారు. కాని ఎదుట వాళ్ళు సహకరించక పోగా శల్య సారాధ్యం వహిస్తారు. వృత్తి పరంగా మీ ఆలోచనలతో చేసే కార్యక్రమాలు అభివృద్ధిని కలిగిస్తాయి.
జీవితంలో నేరవేరవు అనుకున్న ముఖ్య కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మితిమీరిన ఆత్మవిశ్వాసం అన్ని వేళలా మంచిది కాదని గ్రహించండి. కార్యాలయంలో సహద్యోగులతో అంటీ అంటనట్టు ఉండడమే కొంత మీకు మేలు చేసే విషయం. విదేశీ సంబంధిత విషయాలు లాభిస్తాయి. ఎంతో కాలంగా ఆశపడి ఎదురు చూస్తున్న నూతన గృహాన్ని కొనుగోలు చేసే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నారు. జీవిత భాగస్వామితో చర్చలు, సలహాలు మీకు కొంత ఊరటని కలిగిస్తాయి. సంఘంలో గౌరవ మార్యాదలు ఏర్పడి గుర్తింపబడతారు. కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు. కీలక విషయాలలో పెద్దల సలహాలు తీసుకోవడం అవసరం అవుతాయి. సివిల్ కేసులకు సంబంధించి ఇబ్బందులను అధిగమిస్తారు. మీ ఐకమత్య సిద్ధాంతం వల్ల మీరు ఒంటరివాళ్ళవుతారు. ఎవరున్నా లేకున్నా మీకు దైవం అండదండలు ఉన్నాయని, తప్పకుండా ఉంటాయని తెలుసుకుంటారు.
పబ్లిక్ సర్వీసులలో ఉన్న వారికి, అలంకరణా సామాగ్రి, బ్యూటీపార్లర్ నడిపే వా రికి, సినీ పరిశ్రమ, విలేఖరులకు మి శ్రమ ఫలితా లు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ (గవర్నమెంట్) పరంగా కాంట్రాక్టులు లాభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలమైనవాతావరణం ఉంటు ంది. మొదట్లో కొంత ఇబ్బందికరం గా ఉన్నా పోనుపోనూ మీకు సానుకూల ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. పోలీస్, మిలటరీ, నావికా, వైమానిక దళాలలో ఉ న్నవారికి ప్రమోషన్‌లు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. దేశం కో సం మీరు చేసే సేవకు గాను సంఘంలో గుర్తింపుతోపాటు పురస్కారాలు లభిం చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ సంవత్సరం మొ త్తం మీద ఆర్థిక పరంగా బాగుంది. శుభకార్యా లు కుటుంబంలో చేస్తారు. కుటుంబ భాగస్వా మి సూచన మీద అనుకున్న పనులను సకాలంలో సాధిస్తారు. విలువైన వస్తుప్రాప్తి ఉం డును. కోర్టు కేసుల విషయాలలో అనుకూలత, పనులు సకాలంలో చేస్తారు.
రావాల్సిన బాకీలు చేతికి అందుతాయి. సంతాన సౌఖ్యం కలుగును. శని, రాహు గ్రహ అనుగ్రహం చేత ఎగుమ తి, దిగుమతి వ్యవహారాలు లాభిస్తాయి. మీక న్నా చిన్నవారితో, కార్యాలయ సిబ్బంది (ఆఫీస్ సబర్డినేటర్)తో మీ వాక్క్ చేత (మాటలు చేత) తగాదాలకు దూరంగా ఉండడం చాలా అవస రం. విద్యార్దులకు అంతంత మాత్రంగానే ఫలితాలు ఉంటా యి. ఆరోగ్య పరంగా జాగ్రత్తలు అవస రం. చర్మ, కాలేయ, గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా ఉదరానికి సంబంధించిన గ్యాస్ట్రోలజీ, కంటి సంబంధ ఇ బ్బందులు తరుచూ ఇబ్బందులకు గురి అవుతా రు. నూతన వైద్య విధానాలు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. గతంలో ఆగిన ప్ర మోషన్లు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
శుభకార్యాల విషయంలో ఆర్థిక పరంగా కొంత భయపడతారు. సంతానానికి ఎలాంటి భవిష్యత్తు, వారి ఉన్నతికి ఏ విధంగా తోడ్పాటుని ఇవ్వాలో అర్ధంకాని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సంవత్సరం ఈ రాశివారు రుద్ర పాశుపత ెమం చేయించి, ఎనిమిది (8) సోమవారాలు శివునికి అభిషేకాధులు చేయడం వలన మంచి ఫలితాల ను అందుకుంటారు. నిత్యం సుబ్రహ్మణ్య అష్ట కం, మన్యు సూక్తం, హనుమాన్ చాలీసా పఠిస్తే మరిన్ని శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి ఆకస్మిక అదృష్టం కలిసివస్తుంది. అందులో ఎలాంటి సందేహాం లేదు. కట్టడాల నిర్మాణ సం బంధమైన పనులు అనుకూలిస్తాయి. అందులో పురోగతి బాగుంటుంది. స్త్రీలతో విరో ధం, స్త్రీల సహాయ నిరాకరణ, వాళ్ళతో అభిప్రాయభేదాలు ఏర్పడి కొన్ని మంచి కార్యక్రమాలను అనుకున్న సమయానికి పూర్తి చేయలేరు.
కర్కాటక రాశి
ఆదాయం : 14 వ్యయం : 02
రాజ : 06 అవమానం : 06
పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదముల యందు పుట్టిన వారు “హీ, హూ, హే, హో, డా, డీ, డూ, డే, డో” అను అక్షరములు తమ పేరునకు మొదట గలవారు కర్కాటకరాశికి చెందినవారు.
కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం కొం త అనుకూలమైన ప్రతికూలకాలం. మీరు ఈ సంత్సరంలో చేపట్టబడే ఆర్థిక పరమైన విషయాలలో అనుకూలతను సాధిస్తారు. విద్యా, గృహ సంబంధమైన, విదేశీ సంబంధమైన విషయాలు సానుకూల పడతాయి. మీ యొక్క శతృవర్గం బలం పుంజుకొని ఇబ్బందికరంగా మారతారు. భాగస్వాముల వ్యాపారంలో జాగ్రత్త వహించడం అవసరం. ఉన్నత స్థానాలలో ఉన్నవారు, స్నేహితులు, అత్తింటివారు, దగ్గర బంధువుల నుండి కొంత నమ్మక ద్రోహం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎవర్ని నమ్మాలో, ఎవర్ని నమ్మకూడదో బేరీజు వేసుకోవడం కష్టతరం అవుతుంది. దీనికి కారణం అష్టమంలో ఉన్న శని భగవానుడు. ఈ రాశి వారికి అష్టమంలో శని నడుస్తున్నందు వలన అఘోరపాశుపత ెమం అలాగే ఎనిమిది (8) శనివారాలు శనీశ్వరునికి తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన.
అదే విధంగా నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి. సాంకేతిక పరమైన విషయాలలో జాగ్రత్త తీసుకోవడం అవసరం. దీనికి కారణం లేకపోలేదు. కేతుగ్రహ సంచారం వలన తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉన్నత విద్యను అభ్యసించే వారికి పిహెచ్‌డి (PhD) చేసే వారికి అనుకూల కాలం అని చెప్పవచ్చును. గురువు దశమ లాభ స్థానాలలో సం చారం. శని అష్టమ స్థాన సంచారం, రాహుకేతు తృతీయ భాగ్య స్థానాలలో సంచారం, కుజ గ్ర హ సంచారం. గురు, శుక్ర మౌడ్యములు ప్రధా న ఫలితాలను నిర్దేశిస్తాయి. ఐ.ఏ.ఎస్., ఐ.పిఎ స్. గ్రూపు సర్వీసులకు ఎంపిక అవుతారు. విద్యా రంగంలో ఘనవిజయం సాధిస్తారు. పోటీపరీక్షలలో మీ శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తారు.
అనుకూలమైనటువంటి ఫలితాలను సాధిస్తారు. ఆహారధాన్యాల వ్యాపారాలు, హోట ల్ వ్యాపారులు, నీళ్ళ వ్యాపారులు, విద్యాసంస్థల యజమానులు, డాక్టర్లు, గొప్ప ఫలితాలను సాధిస్తారు. ఆర్థికంగా ఆశించిన దానికన్నా ఎ క్కువగా సంపాదిస్తారు. ధర్మవిరుద్ధమైన వ్యాపారాలు చేసేవారికి అనుకూలమైన కాలం. ఎప్పు డో కొనుగోలు చేసిన స్థిరాస్థికి విలువ పెరుగుతుంది. మీ అంతరాత్మకు విరుద్ధంగా ఒకరికి సన్నిహితం అవుతారు. జీవితంలో నూతన వ్య క్తులు ప్రవేశిస్తారు, నిష్ర్కమిస్తారు. మీరు మాత్రం రాగభావ ద్వేషాలకు అతీతంగా ప్రవర్తిస్తారు.
విదేశాలలో చదువుకునే వారికి అనుకూల కాలం. ఈ రాశికి చెందిన భార్యాభర్తల మధ్య ఓ ర్పు, సహనం చాలా అవసరం. భార్యాభర్తల మ ధ్య విభేదాలు సృష్టించి తమాషా చూసే వారు, తెగతెంపులు చేసేవారు ఉన్నప్పటికీ దైవానుగ్రహం వలన కొంత వరకు ఇబ్బందులు నుండి బయటపడతారు. ఈ రాశికి సంబంధించిన కొ ద్దిమంది విషయంలో వైవాహిక స్పర్థలు అధికమవుతాయి, విడాకులు వంటివి సంభవించవ చ్చు, విడాకుల అనంతరం సంతానం విషయం లో మనోవేదన ఏర్పడుతుంది.కుటుంబ విషయాలను నిర్లక్ష్యం చేసినందుకు తగిన మూల్యం చెల్లించవలసిన పరిస్థితి వస్తుంది, పద్ధతులు మార్చుకుంటారు. వీసా, పాస్‌పోర్టు లభిస్తాయి. నూతన విద్యను అభ్యసించాలని ఉత్సాహపడే వారికీ విదేశాలలో చదువుకుని, ఉద్యోగం చేసి అప్పులు తీర్చి కుటుంబ స్థాయిని పెంచాలని ఆరాటపడే వారికి ఇది అనుకూల కాలం.
గ్రీన్ కార్డు లభించే ప్రయత్నాలు దాదాపు చివరిదశకు చేరుకుంటాయి. విద్యార్థినీవిద్యార్థులు విశేషంగా శ్రమించి అనుకూల ఫలితాలు సాధిస్తా రు. గురు గ్రహ అనుగ్రహం వలన ఆర్థిక పరమై న అంచనాలు మీరు ఊహించని దానికన్నా రెట్టింపు అవుతాయి. ఎంత అదుపులో ఉంచాలనుకున్నా, కొన్ని సందర్భాలలో అనారోగ్యం కొ రకు కొంత ఖర్చుపెట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. స్త్రీలతో సత్సంబంధాలు ఏర్పడతాయి. సహోదర, సహోదరీ వర్గానికి ఆర్థికసహాయం చేసి జీవిత భాగస్వామికి విరోధం అవుతారు. మీరు ఎంతగానో వేచి చూస్తున్న భూముల విలు వ అమాంతం పెరిగే అవకాశాలు గోచరిస్తున్నా యి. లాయర్లకు, మతాధికారులకు, టీచర్లకు వృత్తి పరంగా మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. పాడి పరిశ్రమలో వచ్చే లాభాలు సంతృప్తికరంగా ఉంటుంది.
మీరు పెట్టే ప్రతీ పైసాకి అంత కు అంత లాభాల పంట పడుతుంది. విద్యా, సాంసృ్కతిక విషయాల్లో కొన్ని మార్పులు వస్తా యి. వాలెంటరీ రిటైర్‌మెంట్లు వద్దు. కుటుంబంలో మరొకరి సంపాదన ప్రారంభమవుతుం ది. స్టేషనరీ వ్యాపారస్ధులకు అలంకార సామాగ్రి విక్రేతలకు, గృహ నిర్మాణ సంబంధ సామాగ్రి విక్రేతలకు అనుకూల వాతావరణం సూచిస్తున్నాయి. అదే విధంగా గృహ సంబంధ, అలంకార సంబంధ, ంగారం, నగల వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి. బ్యాంక్, చిట్స్ వ్యవహారాల పట్ల జాగ్రత్త వహించండి. మీ ఖాతాలలో మీకు తెలియకుండానే కొంత మొత్తం మాయం అవుతాయి. చిట్టీలు, చిట్స్‌ఫండ్స్‌లలో కూడా మీకు తెలియకుండానే మోసపోయే అవకాశాలు ఉన్నాయి. రహస్యంగా పెట్టిన కొన్ని పెట్టుబడులు వలన కొన్ని విషయ వ్యవహారాలలో న్యాయపరమైన చిక్కులలో పడతారు.
ఈ సంవత్సరం వివాహం కాని వారికి అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి. ఆకస్మికంగా వివాహం కుదురుతుంది. కాకుంటే జాతకపరిశీలన చేసుకుని వివాహం చేసుకోండి. వి వాహం కుదరడంలో కాని, ఒడిదుడుకుల విషయంలో కాని ఎటువంటి లోటు-పాట్లు జరిగినా, జరగడానికి కారణం బుధ, గురు గ్రహాలు అనుకూలంగా లేకపోవడం. పునర్వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం లేని వారికి సంతానప్రాప్తి. గురు దృష్ఠి అనుకూలత వలన శత్రువర్గంపై విజయం సాధిస్తారు.
సింహ రాశి
ఆదాయం : 02 వ్యయం : 14
రాజ : 02 అవమానం : 02
మఘ 1,2,3,4 పాదములు, పుబ్బ 1,2,3,4 పాదములు, ఉత్తర 1వ పాదముల యందు పుట్టిన వారు “మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే” అను అక్షరములు తమ పేరునకు మొదట గలవారు సింహరాశికి చెందినవారు.
సింహరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నా యి. ఆర్థిక పరిస్థితి అంత సానుకూలంగా లేదు. అం తంత మాత్రంగానే గోచరిస్తున్నది. సంవత్సరం ప్రధమార్ధం కన్నా ద్వితీయా ర్ధం ‘మే’ తదుపరి ఆర్థిక పరమైన విషయంలో నుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో చిక్కుపోయిన ధనం చేతికి అందుతుంది. వృ త్తి ఉద్యోగాల పరంగా నూతన అవకాశా లు అందుకుంటారు. వృ త్తి ఉద్యోగాల పరంగా మా ర్పులకు సంబంధించిన వి షయాలలో దూరదృష్ఠితో ఆలోచించి మారడం మంచిదని చెప్పదగిన ము ఖ్య సూచన. చేసే పనిలో అలసత్వం, సోమరిత నం ఆవరిస్తుంది. జాగురత వహించండి. గురుడు భాగ్యంలో దశమ స్థాన సంచారం వలన ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది.
మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలు, ట్రస్టు లు గట్టి పోటీని ఎదుర్కొనవలసిన పరిస్థితి వ స్తుంది. మీ యొక్క కృషి వలన ధర్మ సిద్దాంతాల వలన సమాజంలో మీ స్థాయిని నిలబెట్టు కోవడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. జీ విత ఆశాయన్ని సాధించుకోవడానికి ఎంతో కొం త ఆర్థిక లబ్ధి పొందడానికి మీరు చేసే ప్రయత్నా లు కొంత వరకు మంచి ఫలితాలను అందుకుంటారు. సంసారంలో ఒడిదుడుకులు గోచరిస్తున్నా యి. కుటుంబ జీవితంలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే అంశాలు తలెత్తే పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఒకరినొకరు అపోహలకు, అపార్ధాలకు పోకుండా సఖ్యతతో ఉండటం మేలైన విషయం. ఉన్నదానికి లేనిదానికి ఒకరినొకరు ద్వేషించుకొనే పరిస్థితి నుండి దూరంగా జరిగే అవకాశాలు తారసపడే విధంగా ప్రవర్తించవద్దు.
కుటుంబ సంబంద విషయాలలో వైషమ్యం రాకుండా చూసుకోండి. అవివాహితులకు వివా హ సంబంధాలు కుదరడంలో జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ సంబంధ వ్య వహారాలకు దూరంగా ఉండటం ఉత్తమం. వివా హం అయిన వారికి సం తాన పరంగా కొన్ని ఇ బ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. సం తానానికి సంబంధించిన విషయాలో కొన్ని కఠనమైన నిర్ణయాలు అవసరమవుతాయి. సంతానం లేని వారికి సంతానప్రాప్తి కలుగు తుంది. వ్యక్తిగత వ్యాపార పరంగా, భాగస్వామ్య వ్యాపార విషయ వ్యవహారాలలో ఆర్థిక సం బంధ విషయాలలో ఎం త కట్టుదిట్టంగా ఉంటే అంత మేలు జరుగుతుం ది. బ్యాంకుల నుండి ఋ ణాలు తీసుకొని ఇల్లు, వాహనాలు కొనడం వంటివి అంత శ్రేయస్కరమైన కాలం కాదని చెప్పవచ్చును. స్థిరచరాస్థి తీసుకున్నామనే ఆనం దం కన్నా వాటిద్వారా ఉత్పన్నమయ్యే ఒత్తిడిని తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎంత పొదు పు చేద్దామనుకున్నా కూడా కొన్ని దుబరా ఖర్చులు, రహస్య దానాలు తప్పవు. అనాలోచిత నిర్ణయాలు మీకు సంకటస్థితిని కలిస్తాయి.
విదేశీయానం, ఆస్పత్రులు, ఫార్మసీ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. సాంకేతిక విద్య, సైకాలజిస్ట్‌లు, గోప్యతతో కూ డిన విద్యలను అభ్యసించే వారికి కొంతవరకు అనుకూలమైన కాలం. అదేవిధంగా ఛార్టెడ్ అ కౌంట్స్, క్రీడాకారులకు అనువైనకాలం. ఫార్మసీ రంగంలో మెడికల్ రిప్రజెంటివ్స్‌కి, స్టాకిస్ట్‌లకి మంచి లాభదాయకమైన కాలం. సాఫ్ట్‌వేర్ సంస్థలకు లాభాలు ఉన్నా లేనట్టుగా ఉంటారు. సాఫ్ట్‌వేర్ జాబులు చేసే వారికి అంత అనుకూల మైన కాలం కాదు అని చెప్పవచ్చును.
ఆరోగ్య పరంగా జాగ్రత్తలు అవసరం. మీ ఆహారపు అలవాట్లులో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యసనాల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం పై అశ్రద్ద వహించకండి. చర్మ సంబంధ రుగ్మతలు, రక్త హీనత, నీరు చేరుట, చెవి గొంతు సంబందిత ఇబ్బందులు, మోకాళ్ళ నొప్పులు, అస్తమా, మన:స్థి మితం లేకపోవడం మొదలైన అనారోగ్య సమస్యల బారిన పడకుండా జాగ్రత్త వహించండి. అదే విధంగా కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో కలవర పడతారు.వారి ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నా కూడా మీకు ఆందోళన కలిగించే విధంగా ఉంటుంది.
ఆర్థికపరంగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. డబ్బు పరంగా సంతృప్తికరంగా ఉన్నప్పటికీ మానసిక ప్రశాంతత లోపిస్తుంది. చేతిలో ధనం ఉన్నప్పటికీ నిల్వ ఉండదు, నిల్వ చేయలే ని పరిస్థితి. మీ మాట దురుసుతనంతో కొన్ని ఇ బ్బందులను తెచ్చుకుంటారు. మనస్తత్వంలోమా ర్పు తెచ్చుకుంటే కుటుంబంలో ప్రశాంత జీవనం ఏర్పడి, సుఖ సంతోషాలతో జీవనం సాగుతుం ది. ఈ సంవత్సరం నిర్మాణ సంబంధమైన వ్యా పారాలు, సొంత ఇంటి నిర్మాణ విషయాలు నత్తనడకన సాగుతాయి.ఒకరిని నమ్మి ఏపని అప్పజెప్పడం మంచిదికాదని గ్రహిస్తారు. తృణ దా న్యాలు, పండ్లు, చింత, పెసలు, అపరాలు పం డించే రైతులకు అనువైన కాలం.
అదే విధంగా ఇత్తడి, కంచు, ఇనుము, లోహపు వ్యాపారస్తుల కు లాభసాటిగా ఉంటుంది. ంగారం, వెండి, వ జ్రాల వ్యాపారస్తులకు మంచి ఆర్థికపరమైన లాభాలు అర్జిస్తారు. పౌల్ట్రీ రంగం వారికి ఆశించినంత లాభాలు ఉండకపోవచ్చు. కొంత వరకు లాభాలున్నా క్రమేపీతగ్గు మోహం పడతాయి. ఈ ఏడాది ఈ రాశి వారు మహా పాశుపత ెమం, శనివారాలు వేంకటేశ్వర స్వామి వారికి అర్చనాదులు చేయడం వలన మంచి శుభ ఫలితాలు అందుకుంటారు. ముఖ్యంగా ఆదిత్య హృద యం, కాలభైరవ అష్టకం పఠిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
కన్య రాశి
ఆదాయం : 05 వ్యయం : 05
రాజ : 05 అవమానం : 02
ఉత్తర 2,3,4 పాదములు, హస్త 1,2,3,4 పాదములు, చిత్త 1,2 పాదముల యందు పుట్టినవారు “టో, పా, పి, పూ, షం, ణా, ఠా, పే, పో” అను అక్షరములు తమ పేరునకు మొదట గలవారు కన్యారాశికి చెందినవారు.
కన్యారాశి వారికి ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలు సూచిస్తున్నాయి. పనులు నిదానంగా అవుతాయి. ప్రతి ముఖ్యమైన పనులు, కార్యక్రమాలు చేసేటప్పడు ఒకటికి నాలుగు సార్లు చూసుకుంటూ చేస్తే కాని సఫలీకృతం కావు. సరైన గురువులను ఆశ్రయించి, సలహాలు, సంప్రదింపులు చేయడం ద్వారా సత్త్ఫలితాలు పొందుతారు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఎక్కువగా ఆకర్షితులు అవుతారు.
ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి సరియైన సమయం అని చెప్పవచ్చును. ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళినప్పటి కీ ఇంకా ఏదో సాధించాలని, తెలుసుకోవాలని ముందుకు వెళ్ళాలనే మీ కోరిక బలపడుతుంది. విహార యాత్రులు, తీర్ధ యాత్రలు మానసిక ఆనందానికి, సంతోషానికి కారణమవుతాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడచడానికి మీ శక్తి వంచన లేకుండా ఆధ్యాత్మికమైన భావనలు కలిగించి ప్రశాంతతను నెలకొల్పుతారు. రాను రాను సనాతన ధర్మం పట్ల ఆకర్షితులు అవుతారు. వాటిని అవలంబిస్తారు. సం ఘంలో ఉన్నత స్థాయిలో ఉన్న గురువులను, ఆ ధ్యాత్మిక వేత్తలతో కలిసి పని చేస్తారు.
నూతన వృత్తులు, మద్యం, మాంసం, వ్యా పారాలు చేసే వారు భాగస్వాముల విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవడం, దగ్గరుండి అన్నీ చూసుకోవడం అవసరం. ఇతరులపై ఆధారపడి ఉండకూడదు. రచన, పత్రిక, మీడియా, కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి అనుకూల కాలం. భాగస్వాములు మోసాలు చేసే అవకాశా లు ఉన్నాయి. ముందుగా మేల్కొని తప్పులు జరగకుండా చూసుకోవడం ఉత్తమము. మిల్క్‌డైరీ ప్రారంభించాలని ఆలోచన చేస్తారు. వెంటనే ప్రారింభిస్తారు. ఆహార సంబంధమైన వ్యాపారాలు ప్రారంభించాలనే ఆలోచన వస్తుంది. సు వర్ణ ఆభరణాల విషయంలో భద్రత తీసుకుంటా రు. కళా, సాహిత్యరంగంలోని వారికి మంచి గు ర్తింపు.
అవార్డులు లభిస్తాయి. ఆర్థిక పరంగా అంతంత మాత్రంగానే ఉంటుంది. ధనం ఎంత వచ్చినప్పటికీ అవసరానికి, అవసరాల మేరకు మాత్రమే ఉంటుంది. అంతకు మించి ఆదా చే యలేరు. ఏ విధంగా వచ్చినా వచ్చింది వచ్చిన ట్లు నీళ్ళ ప్రాయంగా ఖర్చైపోతుంది. పది రూపాయల సంపాదన ఉంటే 20 రూపాయలు దానధర్మాలకు, కుటుంబ పురోగాభివృద్ధికి ఖర్చు చేస్తారు. శుభకార్యాలకు మీరు ఊహించని దానికన్నా రెట్టింపు ఖర్చవుతుంది. ఆకస్మికంగా ధన నష్టం వాటిల్లే అవకాశాలు గోచరిస్తున్నాయి. దై వానుగ్రహం ఉంటే ఏదైనా అసాధ్యం సుసాధ్యం అని మరొకమారు రుజువు అవుతుంది. ఋణ గ్రస్తులకి కొంత అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబంలో పెద్దలు, అయినవాళ్ళ సంతోషానికి మీ శక్తికి మించి ఖర్చుపెట్టి, వాళ్ళను చాలా సంతృప్తిపరుస్తారు.
ఈ రాశిలో జన్మించిన భార్యాభర్తలు మధ్య ఓర్పు, సహనం చాలా అవసరం. మీద్వారా అన్ని సహాయాలను, సంరక్షణను పొందినా ప్రేమ మాత్రం వేరేవాళ్ళ మీద ఉంటుంది. కుటుంబలో పిల్లల ప్రవర్తన, క్రమశిక్షణ మీకు సంతృప్తిని ఇవ్వదు. కొంత ఆందోళన కలిగిస్తుంది. పాఠశాల స్థాయిలో ఉన్న విద్యార్ధులు ముఖ్యంగా 10వ తరగతి చదివే వారు కష్టించి ఫలితాలు రాబట్టాల్సిన పరిస్థితి నెలకుంటుంది. ప్రస్తుత సమాజంలో నెలకున్న దుర అలవాట్లుకు బానిస అయ్యే అవకాశాలు ఉన్నాయి. పిల్లల స్వతంత్ర నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. విద్యాసంబంధమైన విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించి ఉన్నత విద్యలు అభ్యసించ గలుగుతారు. కుల, మత, వర్గ ప్రాంతీయ విద్వేషాలు మీ మీద ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ప్రభావం చూపుతాయి. మిమ్ములను మీరు నిరూపించుకోవడానికి ఎంతో కష్టపడవలసి వస్తుంది.
లిఖితపూర్వకంగా ఉన్న ప్రభుత్వ ఉత్తర్వులకు వక్రభాష్యం చెప్పి మీ ప్రయోజనాలను కొంతమంది అధికారులు అడ్డుకుంటారు. న్యాయస్థానాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుంది. క్రీడాసంబంధమైన విషయాలలో కొంత మానసిక సంతృప్తి కలుగుతుంది. సంతానం క్రీడాసంబంధమైన విషయాల్లో రాణిస్తారు. మీ మానసిక సంతోషానికి కొన్ని విషయాలు కారణం అవుతాయి. ఉద్యోగానికి సంబంధించి స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ బాగా ఉపకరిస్తాయి. మీ పిల్లలకు మీ బంధువుల పిల్లలకు చదువులో ఆరోగ్యకరమైన పోటీ ఏర్పడుతుంది. వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పరస్పర అవగాహనతో ఒకరినొకరు అర్ధం చేసుకుని, చ క్కటి వాతావరణం నెలకొల్పుకోవాలి. లేదంటే శృతిమించి రాగాన పడుతుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు సృష్టించి, తెగతెంపులు చేసేవారు ఉంటారు. భార్యాభర్తల ఇరువురి ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించండి. స్త్రీలవల్ల కొన్ని ప్రయోజ నాలను పొందుతారు. స్త్రీ, పురుషుల మధ్య ఉన్న స్నేహాన్ని వక్రీకరించే ఈ సమాజం వక్ర ధోరణి పట్ల విరక్తి కలుగుతుంది.
ముఖ్యంగా ఈ సంవత్సరం మీ న్మ రాశిలో కేతు సంచారం. సప్తమంలో రాహు గ్రహ సం చారం, కుంభంలో శని గ్రహ సంచారం, అష్టమ భాగ్యంలో గురు గ్రహ సంచారం వలన ప్రధాన ఫలితాలు నిర్ధేశిస్తున్నాయి. ఈ సంవత్సరం ఈ రాశి వారు సుబ్రహ్మణ్య పాశుపత ెమం మరియు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయడంవలన మంచి ఫలితాలు అందుకుంటారు. ప్రతినిత్యం సుబ్రహ్మణ్య అష్టకం పఠిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలు, వృద్ధాశ్రమాలు వాటి నిర్వహణ పురోగమనంలో ఉంటాయి, మంచి పేరు వస్తుంది. కొన్ని సందర్భాలలో జీవితం మళ్ళీ ప్రారంభిస్తున్నామా అనిపిస్తుంది. గృహనిర్మాణ సంబంధమైన లోనులు మంజూరు అవుతాయి. హోల్‌సేల్, వ్యాపారాని కన్నా, రిటైల్ మార్కెటింగ్‌లో ఎక్కువ లాభాలు పొందుతారు. సినిమా, టివి రంగంలోని వారికి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారం సంస్థ విస్తరించడంకోసం దూరప్రాంత ప్రయాణాలు చేస్తారు. రహస్య చర్చలు పూర్తిచేస్తారు.
తుల రాశి
ఆదాయం : 02 వ్యయం : 08
రాజ : 01 అవమానం : 05
చిత్త 3,4 పాదములు, స్వాతి 1,2,3,4 పాదములు, విశాఖ 1,2,3 పాదముల యందు పుట్టినవారు “రా, రి, రూ, రే, రో, త, తీ, తూ, తే” అను అక్షరములు తమ పేరునకు మొదటగలవారు తులారాశికి చెందినవారు.
తులారాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న పనులు నిదానంగా పూర్తి అవుతాయి. ఈ సంవత్సరం ఈ రాశి వారు ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా ఆధ్యాత్మికంగా వెళ్ళడానికి సరైన మార్గాలను ఎంపిక చేసుకోవాలి. అన్ని విషయాలలో భ్రమ లేకుండా భ్రమలో బతకకుండా పనిచేయడం మంచిది. విదేశాలకు వెళ్ళే వారికి అనుకూలం. విదేశాలలో విద్యార్థులు చదువుకోవడానికి వెళ్ళేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని వెళ్ళడం మంచిది. దీనికి కారణం జ్ఞానాన్ని ప్రసాదించే గురువు ఇంట్లో రాహువు ఉండడమే కారణం. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం. ఆహారపు అలవాట్లు నిర్ణయాలు సరైన రీతిలో మంచి సమయంలో తీసుకోవడం అవసరం.
అశ్రద్ద చేస్తే మొదటికే మోసం జరిగే అవకాశాలు ఉంటాయి. ఆహార రంగంలో ఎన్నో మోసాలు జరుగుతున్నాయని మనందరికీ విదితమే. జాగ్రత్త వహించండి. ెటల్ వ్యాపారం, తినుబండారాల వ్యాపారాలలో కల్తీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచం అంతా కూడా కల్తీ రాజ్యమేలుతోంది. అధికారుల నుండి కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య పరంగా ఈ.ఎన్.టికి సంబంధించి ఇబ్బందులు ఎదురవుతాయి. మానసికంగా స్ట్రెస్ తీసుకోకుండా ఉండడం ఆరోగ్యానికి మంచిది. మోకాళ్ళనొప్పులు, కీళ్ళనొప్పులు, పాదాలు, వెన్నుముక నొప్పులు బాధిస్తాయి. జీర్ణకోశ సంబంధమైన సమస్యలు తలెత్తుతాయి. ఆహార, ఆరోగ్య నియమాలను పాటించండి. అరుగుదల తక్కువగా ఉంటుంది. ప్రాథమిక స్థాయిలో ఉన్న విద్యార్థులు అనుకూల ఫలితాలను సాధిస్తారు.
ఉన్నత స్థాయి విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం ఆశించినంతగా ఉండదు. వృత్తిపరంగా స్థాన చలనాలు ఉన్నప్పటికీ మారకుండా ఉండడం మంచిది. ప్రస్తుత పరిస్థితులు అంత అనుకూలం గా లేనందున అటువంటి పనులు వాయిదా వేసుకోవడం ఉత్తమం. తక్కువ వ్యవధిలో ఎక్కువ ఆలోచన చేయకుండా ముఖ్యమైన విషయాల మీద మాత్రమే దృష్ఠిని కేంద్రీకరించడం వలన ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. మే మాసం వరకు ఆర్థిక పరంగా కొంత సానుకూలమైనఫలితాలు గోచరిస్తున్నాయి.ఋణ సంబంధమైన విషయాలలో ఋణాలు చేయకుండా ఉండడం మంచిది. అప్పుల జోలికి వెళ్ళితే వేసుకోవడానికి జోళ్ళే లేకుండాపోతాయనేలా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ద్వాదశ రాశు ల వారికన్నా ఈరాశి వారికి ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి సరైన సమయం. మంత్రసిద్ధి లభించడానికి, సాధనకు సరైన కాలం. అన్నదానాలు, సేవా కార్యక్రమాలలో విరివిగా పనిచేస్తు న్న వారికి అనుకూల కాలం.
కెమెరాల ముందు వెనుక పని చేస్తున్న వారికి సరైన కాలం అని చెప్పవచ్చును. మంచి ప్రాజెక్టులు లభించి ఉన్నతస్థితికి వెళ్ళే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. మీ ప్రతిభకి ప్రశంసలు, సన్మానాలు దక్కుతాయి. మెడికల్ రంగంలో ఉన్నవారు కూడా కొంత వరకు మీరు చేసే వృత్తి వ్యవహారాలలో గతం కన్నా ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది. హర్డ్ వర్క్, హార్డ్ అవర్స్‌లో పనిచేసే సందర్భాలు రావచ్చు. అన్నిటికీ సిద్ధపడి ఉండాలి. దీనికి కారణం రాహువు 6వ స్థానంలో ఉండటమే కారణం. నూతన గృహం తీసుకునే వారికి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎంతో కాలంలో స్వగృహ కల నెరవేరు కాలం అని చెప్పవచ్చును. కొంత ఆలస్యం అయినా కూడా మీరు మీకు నచ్చిన విధంగా స్వంత ఇంటి కల నెరవేర్చుకుంటారు. మీ అభిరుచికి అనుగుణంగా గృహ నిర్మాణం లేదా గృహాన్ని ఏర్పాటు చేసుకుంటారు.
వివాహం కాని వారికి శుభ ఫలితాలు ఉంటాయి. సరైన సమయంలో అవివాహితులకు వివాహం జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రయత్న లోపం లేకుండా ఉంటే తప్పకుండా సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆదర్శవంతమైన మనస్సుతో ఎంతో శ్రమించి ఒక పునర్వివాహం జరగడానికి కారణం అవుతారు. మగపిల్లల పెళ్ళి విషయం పెను సమస్యగా మారుతుంది. దానికి కారణం ఒకటని చెప్పలేము. వా రి జాతకలోపం కావచ్చు, ఆడపిల్లలు దొరకక ఇ తరత్రా విషయాల వలన వివాహం జాప్యం అవ డం పరిపాటిగా తయారైంది. ఈ సంవత్సరం ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకి ప్రేమ పెళ్ళికి సంబంధించిన వ్యవహారాలు వివాదాస్పద మవుతాయి. ప్రేమ వ్యవహారాలు మూడునాళ్ళ ము చ్చటగానే ఉంటాయి. అభిప్రాయబేధాలు తలెత్తి కొన్ని ఇబ్బందులు ఎదొర్కొనవలసి వస్తుంది. పె ళ్ళికి ముందు ఉన్న ప్రేమ, అప్యాయతలు వివాహానంతరం లేకపోవడం, పెద్దల నిర్ణయాలు వ్య తిరేకించడం వాటివలన ఎన్నో సమస్యలను అనుభవించవలసి ఉంటుంది.
వృశ్చిక రాశి
ఆదాయం : 08 వ్యయం : 14
రాజ : 04 అవమానం : 05
విశాఖ 4వ పాదము, అనూరాధ 1,2,3,4 పాదములు, జ్యేష్ఠ 1,2,3,4 పాదముల యందు పుట్టినవారు “తో, నా, నీ, నూ, నే, నో, య, యా, యూ” అను అక్షరములు తమ పేరునకు మొదటగలవారు వృశ్చికరాశికి చెందినవారు
వృశ్చికరాశి వారికి ఈ సంవత్సరం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఋణాలు చేసి వస్తు, వాహనాలు, గృహాలు తీసుకునే వారికి అనుకూల కాలం. క్రెడిట్ కార్డు విషయంలో జాగ్రత్తలు అవసరం. మీకు బ్యాంకు నుండి ఋణాలు తీసుకోవడానికి అనువైన కాలం అని చెప్పవచ్చును. గృహంలో శుభకార్యాలు జరగడానికి సరైన కాలం. ఈ రాశిలో జన్మించిన వారికి అర్ధాష్టమ శని నడుస్తున్నప్పటికీ షష్ఠ, సప్తమ గురు సంచారం, పంచమ చతుర్ధ రాహు సంచారం లాభ స్థానంలో కేతు సంచారం అభివృద్ధిని సూచిస్తుంది.
ఆర్థిక పరమైన సమస్యల నుండి బయటకు రావడానికి మీరు చేస్తున్న కృషి ఫలిస్తుంది. మీ సంపాదనలో కొంత భాగం మీ సంతాన అభివృద్ధికే ఖర్చు పెడతారు. కుటుంబంలో ఒకరి సంపాదన మీకు ఆనందాన్ని ఇస్తుంది. భాగస్వామ్యుల వ్యాపారం ప్రధమార్ధంలో కన్నా ద్వితీయార్ధంలో లాభిస్తాయి. సమాజంలో, బంధువుల్లోనూ ప్రతిష్ఠ నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ పలుకుబడి పెరుగుతుంది. గృహ నిర్మాణం చేస్తారు. లాటరీలు, జూదాలు, బెట్టింగులు మీకు అనుకూలం అనిపించినప్పటికీ రాబోయే గ్రహ సంచార పరిస్థితుల దృశ్యా వాటికి దూరంగా ఉండడం మంచిది.
శా సాంప్రదాయాలలో ఉన్న వారికి ఆశాజనకంగా ఉంటుంది. సినీ, టీవీ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటాయి. కోర్టు వ్యవహారాలు, భూమి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి.
కొంత ఆలస్యం అయినా మీరు ఆశించిన తీర్పులు, లాభాలు పొందుతారు. ఈ సంవత్సరం విద్యా సంబంధ విషయా లు అనుకూలిస్తాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. సమాజంలో మంచి అభివృద్ధి పథంలో ఉన్నవారికి సన్నిహితులు అవుతారు. మీ కెరీయర్‌కు సంబంధించి మంచి ప్రణాళికలు వారి నుండి చర్చించి, తెలుసుకొని లబ్ధీ పోందుతారు. విద్యార్థినీవిద్యార్థులు ముత్యపు గణపతి లాకెట్ ధరించండి, మేధోదక్షిణా మూర్తి రూపును మెడలో ధరించడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. విద్యార్థినీ విద్యార్థులకు మెరి ట్ మార్కులు, స్కాలర్ షిప్పులు వస్తాయి. సివిల్ సర్వీస్‌లకు ఎంపిక అవుతారు. ఐ.ఐ.టిలో సీటు వస్తుంది, మెడిసిన్ సీటు వస్తుంది. సాహిత్య కళాసాంస్కృతిక రంగంలో అభివృద్ది బాగుంటుంది. సంతాన పురోగతిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. సంతానం కోసం ప్రయత్నించే వారికి ఈ సంవత్సరం కొంత వరకు అనుకూల వాతావరణం ఉంటుందని చెప్పవచ్చును.
అలాగనే ఈ జన్మనక్షత్రంలో జన్మించిన వారికి ఆరోగ్య పరం గా జాగ్రత్తలు అవసరం. స్త్రీ సంబందిత అనారోగ్య సమస్యలు అధికంగా బాదిస్తాయి. మధుమేహం(షుగర్), కాలేయ సంబంధిత ఇబ్బందు లు, రక్తపోటు, చర్మ సంబంధ సమస్యల విషయాలలో జాగ్రత్త వహించండి. ఆరోగ్య క్రమశిక్షణలు తప్పనిసరిగా పాటించాలి. ఈ రాశిలో జన్మించిన భార్యాభర్తలు మధ్య ఓర్పు, సహనం చాలా అవసరం. వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పరస్పర అవగాహనతో ఒకరినొకరు అర్ధం చేసుకుని, చక్కటి వాతావరణం నెలకొల్పుకోవాలి.
లేదంటే శృతిమించి రాగాన పడుతుంది. ఆ ప్రభావం మీ కుటుంబంపై పడుతుంది. మీ పిల్లల భవిష్యత్తుని దృష్ఠిలో ఉంచుకుని ఇటువంటి ఇబ్బందులు పు నరావృతం కాకుండా జాగ్రత్త పడండి. కుటుంబ వ్యవహారాలలో బంధువుల, స్నేహితుల జోక్యం అరికడితే గానీ గృహశాంతి లభించదని గ్రహిస్తా రు. ఎవర్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలని నిర్ణయానికి వస్తారు. భార్యాభర్తల ఇరువురి ఆ రోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించండి. ఆ త్మవిశ్వాసంతో చేసే ఏ మంచి పనైనా మంచి ఫ లితాలు ఉంటాయి. ఈ సంవత్సరం మొత్తం మీ ద సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి.
ధనుస్సు రాశి
ఆదాయం : 11 వ్యయం : 05
రాజ : 07 అవమానం : 05
మూల 1,2,3,4 పాదములు, పూర్వాషాఢ 1,2,3,4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదముల యందు పుట్టినవారు “యే, యో, బా, బి, భూ, భా, డ, భే” అను అక్షరములు తమ పేరునకు మొదటగలవారు ధనుస్సురాశికి చెందినవారు.
ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. అనుకూలమైన గ్రహ ప్రభావం చేత చాలా విషయాలలో విజయం సాధిస్తారు. జీవిత సాధనకు సంబంధించి గురు గ్రహ అనుగ్రహం చేత మీ మనస్సులో ఉన్న కోరిక నెరవేరుతుంది. గురువు పంచమ, షష్ఠమ స్థాన సంచారం. రా హువు చతుర్ధ స్థాన చలనం, కేతువు దశమ స్థాన చలనం, శని తృతీయ స్థాన చలనం. గురు, శుక్ర మౌఢ్యములు ప్రధాన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి. విద్యా సంబంధ విషయాలు, వాహన కొనుగోలు, నూతన గృహాలకు ప్రయత్నించే వా రికి అనుకూల కాలం.
కుటుంబంలో శుభకార్యాలకు ధనంను విరివిగా హెచ్చిస్తారు. మీరు ధన వ్యయంలో చేసే ప్రణాళికలు రాబోయే భవిష్యత్తు(ప్యూచర్)లో ఉత్తమ ఫలితాలను అందిస్తాయి. పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. మీరు పనిచేసే విద్యా సంస్థలు, కార్యాలయాలలో మోసాలు జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో మార్పులు, ప్రమోష న్లు, బదిలీలు ఉంటాయి. కార్యాలయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక పరంగా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. గతం లో ఇచ్చిన ఋణాలు తిరిగి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి.
యోగా, మెడిటేషన్, ప్రకృతి వైద్యం, ఆధ్యాత్మిక విద్యను బోధించే వారికి, వైద్య వృత్తులలోని వారికి అనుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వృత్తివ్యాపారాలు, దూరప్రాంతాలలో పనిచేసే వారికి అనుకూల కాలం ఉండవచ్చు. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వారితో సం బంధబాంధవ్యాలు ఏర్పడతాయి. తీర్థయాత్రలు చేసే వారికి, దగ్గర, దూర ప్రయాణాలు చేసే వా రు, మార్పుకోసం చేసే ప్రయత్నాలు చేసే వారికి అనుకూలమైన వాతావరణం నెలకుంటుంది. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. లాయర్లకు, టీచర్లకు, లెక్చరర్ల్‌కు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. సాంకేతిక లోపాలు రాకుండా చూసుకోవడం మంచిది. భాగస్వా మ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.
సో దర సెదరి వర్గానికి చెందిన వారు అభివృద్ధిలోకి వస్తారు. శత్రు వర్గంపై విజయాన్ని సాధిస్తారు. పాస్‌పోర్టు, వీసాల కోసం ప్రయత్నించేవారికి అవి లభిస్తాయి. గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూసే వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ప్రభుత్వ సంబంధమైన కొన్ని రకాల ఉత్తర్వులు మీకు మేలు చేస్తాయి. మీ పలుకుబడిని ఉపయోగించి తక్కువ కొటేషన్‌తో ఎక్కువ లాభాలు ఉన్న కాంట్రాక్టులను మీ సొంతం చేసుకుంటారు. వ్యాపారంలో అనారోగ్యకరమైన పోటీని ఎదుర్కొంటారు. వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసే వ్యాపారులకు, కమీషన్ ఏజెంట్లకు మంచి కా లం. చట్ట వ్యతిరేకంగా నిల్వలు చేస్తే చాలా ఇ బ్బందులు వస్తాయి, జాగ్రత్త. వచ్చిన డబ్బులను వచ్చినట్లుగానే ఖర్చు పెట్టే పద్ధతిని మార్చుకోవాలని అనుకుంటారు, పొదుపు పథకాలలో ధనా న్ని పెట్టుబడిగా పెడతారు.
అవివాహితులకు వివాహ కాలం అని చెప్పవచ్చు. కొంత ఆలస్యం అయినా కూడా మంచి సంబంధం కుదురుతుంది. పునర్వివాహ సం బంధమైన విషయ వ్యవహారాలు కలిసొస్తాయి. పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి అతికష్టం మీద సంబంధం కుదురుతుంది. వివాహం చేసుకున్న కొద్ది రోజులకే భేదాభిప్రాయాలతో విడిపోవాలని నిర్ణయించుకున్న దంపతులను చూసి నైరాశ్యం ఏర్పడుతుంది. వాళ్ళను కలిపే ప్రయత్నాలు ఫలించవు. సంతాన పరంగా ఎదురు చూసే వారికి మంచి సమయం. సానుకూల ఫలితాలు అందుకుంటారు. ఎంతో కాలంగా ఎదురుచూపులకు, మంచి శుభవార్తలను వింటారు. ఏదిఏమైనా సంతాన పరంగా సానుకూల ఫలితాల కోసం సంతాన పాశుపత ెమం చేయించుకోవడం ఉత్తమం.తద్వారా గర్భస్థ శిశువుకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి ఫలితం దక్కుతుంది. ప్రతి నిత్యం సుబ్రహ్మణ్యస్వామి పూజ, కృత్తికా నక్షత్రం రోజున స్వామి వారికి అభిషేకాదులు నిర్వహించండి.
శుభఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆరోగ్య విషయంలో ఈ సంవత్సరం తగిన జాగ్రత్తలు అవసరం. దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్త వహించండి. రక్త హీనతకు సంబంధించిన సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.
కిడ్నీ సంబందిత ఇబ్బందులకు గురి అయ్యే ప్రమాదం ఉన్నది. రక్తపోటు, మధుమేహం, చెవి, గొంతు తదితర ఇబ్బందులు గోచరిస్తున్నాయి. ఆహార విషయంలో తగు జా గ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఆరోగ్య వ్యా యామ క్రమశిక్షణ అవలంబించండి. స్త్రీ సం బంధిత ఇబ్బందులు అధికంగా ఉంటాయి. సరై న అవగాహన లోపం వలన కొన్ని ఇబ్బందుల ను తెచ్చుకుంటారు. సరైన సమయంలో గుర్తిం చి వైద్యుల సలహాలు, సూచనలు పాటించండి. తలనొప్పి లేదా పార్శపునొప్పి కొంతకాలం బాధిస్తుంది. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నతస్థితి సాధించాలని భావిస్తారు.
కొంత మంది మంత్రోప దే శం తీసుకుంటారు. క్రమబద్ధమైన ఆధ్యాత్మిక జీ వితాన్ని గడుపుతారు. చిన్న విషయాలకు కూడా అతిగా భావిస్తారు. మీ సలహాలను పెడచెవిన పెట్టి దురాశకు పోయి నష్టపోయిన మీ సన్నిహితులను మందలించి తగిన సహాయం కూడాఅం దజేస్తారు. జీవితంలో అశాంతిని సృష్టిస్తున్న ఓ స్త్రీని వదిలించుకోవడానికి న్యాయపోరాటం చేసి విజయం సాధిస్తారు. మనశ్శాంతి కోసం పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న చారిటీ ట్రస్ట్‌లు, అనాధ ఆశ్రమాలు, ప్రఖ్యాతి చెందుతాయి. సామాజిక సేవాసంస్థలలోనూ, ఆధ్యాత్మిక కేంద్రాలలోనూ, యూనియన్లలోనూ ఏ పదవీ నిర్వహించకుండా సేవ చేస్తారు. పదవులు లేకుండా సామాన్య రీతిగా ఉంటేనే స్వేచ్చగా ఉంటారని భావిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నిర్దిష్ట సమయం కేటాయిస్తారు. భూములు, స్థలాలు, గృహం కొనుగోలు చేస్తారు. మొత్తం మీద ఈ రాశి వారికి మంచి అనుకూల ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి.
మకర రాశి
ఆదాయం : 14 వ్యయం : 14
రాజ : 03 అవమానం : 01
ఉత్తరాషాఢ 2,3,4 పాదములు, శ్రవణం 1,2,3,4 పాదములు, ధనిష్ఠ 1,2 పాదముల యందు పుట్టినవారు “బో, జా, జీ, జూ, జే, ఖా, గా, గీ” అను అక్షరములు తమ పేరునకు మొదట గలవారు మకరరాశికి చెందినవారు.
మకరరాశి వారికి ఈ సంవత్సరం కొంత వరకు శుభ ఫలితాలు సూచిస్తున్నాయి. వ్యాపార రం గంలో ఉన్న వారికి కొంత వరకు అనుకూల కా లం అని చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క సెద ర, సెదరీల మధ్య చిన్నపాటి ఆత్మీయ బంధాలు పెరగడానికి ఆస్కారాలు ఉన్నాయి.
దాని ద్వారా మీరు లాభపడతారు. నూతన అభివృద్ధి కొరకు ప్రయత్నించే వారికి అనుకూలమైన కాలం.
విదేశీ ప్రయాణాలు చేయడానికి మంచి సమయం. కుటుంబ పెద్దలను సంతోష పెట్టడం లో కొంత కష్టపడాల్సి వచ్చును. దైవానుగ్రహం మీ మీద ఎప్పుడూ ఉంటుంది. ప్రేమ వివాహాల విషయంలో కొంత అనుకూలత ఉంటుంది. సంతాన విషయంలో కొంత వరకు సంతృప్తి పొందుతారు. సంవత్సర ప్రధమార్ధంలో కుటుంబంలో అనుకోని సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. జీవనాధారమైన వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి.
మీ ఆర్ధిక మూలాలను ప్రకటించి మిమ్మల్ని దెబ్బ తీయాలని చేసే ప్రయత్నాలు మిమ్మల్ని కొంత వరకు ఇబ్బందికి గురి చేస్తాయి. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగా రాణిస్తారు. గృహంలో చేసే శుభ కార్యాలు అనుకూలిస్తాయి. మీ సొంత నిర్ణయాలు అమలు చేసేటప్పుడు మీ ధైర్య సాహసాలు కొంత వరకు మిమ్మ ల్ని ముందుకు నడిపిస్తాయి. మీ నిర్ణయాలు, ఆలోచనలు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం మంచిదని చెప్పదగిన సూచ న. ప్రభుత్వ సంబంధమైన పనుల కన్నా, ప్రైవేటీకరణ సంబంధమైన పనులు ప్రాధాన్యత ఇస్తారు.
వృత్తిఉద్యోగాలలో స్థాన చలనం ఉన్నది. స్పె క్యులేషన్ లాభిస్తుంది. సుగంధ వ్యాపారాలు, వస్త్ర వ్యాపారం, సౌందర్య సామాగ్రి, వైద్య పరికరాలు అమ్మేవారు, చిన్నపాటి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం వృత్తిఉద్యోగ, వ్యాపారాల పరం గా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో మీ బ రువు బాధ్యతలు పెరుగుతాయి, కష్టపడి పనిచేస్తారు. మంచి ప్రయోజనాలు పొందుతారు. పె ట్టుబడిపెట్టి మోసపోయిన ఫైనాన్స్ కంపెనీల నుండి డబ్బులు రావు. మీ శ్రమను, శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకుని కొంతమంది వ్యక్తు లు ఇవ్వవలసిన ప్రతిఫలం కన్నా తక్కువ ఇచ్చి ఎంతో చేశామని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తా రు. ఆ ధనాన్ని మీరు తిరస్కరిస్తారు.
మీ ఆధ్వర్యంలో ఉన్న ఆధ్యాత్మిక సంస్థలు మంచి పురోగతి, అభివృద్ధిని సాధిస్తాయి. తీర్థయాత్రలు చేయడం, ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం కొంత వరకు మీకు మానసిక శాంతిని కలిగిస్తుంది. అన్నిటికీ దేవుడే దిక్కు అనే మీ మానసిక ఆలోచన మీకు ప్రశాంతతను ఇ స్తుంది. ఈ సమాజంలో నీతి నిజాయితీ మంచితనం కన్నా ధనమే మిన్న, ధనం మూలం ఇదం జగత్త్ అనే సామెత నిజం చేస్తోందని వేదనకు గురి అవుతారు. ధనం ముఖ్య పాత్ర వహించడం మీ మానసిక వేదనకు కారణమవుతుంది.
దానివలనే వేదనకు గురి అవుతారు. ఆధ్యాత్మికమైన కార్యక్రమాలలో పాల్గొని మీ జీవిత గమ్యం, సత్యం ఏంటో మీరు తెలుసుకోవడానికి చేసే ప్ర యత్నాలకు మంచి అనుకూలమైన సమయం. మీ కుటుంబ సభ్యులలో కొంత వరకు అభద్రతాభావం ఏర్పడుతుంది. ఆరోగ్య పరంగా కొంత వరకు జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా మనోవేదనకు మందు లేదు. మనోవేదనకు గురికాకుండా ఉండడం అవసరం. చర్మ సంబంధ వ్యాధులు హిమాగ్లోబిన్, రక్త సంబంధిత వ్యాధులతో జాగ్రత్తలు అవసరం.
కుటుంబంలో అశాంతికి కారణమైన వ్యక్తులను గుర్తించి కూడా మీరు ఏమీ చేయలేరు. మీ కులేని ఉద్దేశ్యాలను మీకు ఆపాదించి రక్త సంబంధీకులకు, సన్నిహితులకు అందరికీ దూరం చే యాలని మీ శత్రుకూటమి విశేష ప్రయత్నాలు చే స్తుంది. ఈ సందర్భంగా ఓ పెద్దమనిషి మీకు అండగా నిలుస్తాడు, ఎలాంటి దుష్పరిణామాలు కలగకుండా చేయగలుగుతాడు. మీ ముందు ఉ న్న బాధ్యతలను, కఠినమైన సవాళ్ళను యాంత్రికంగా, సమర్థవంతంగా ఎదుర్కొంటారు.
ఈ రాశిలో జన్మించిన స్త్రీ, పురుషులకు కేతు గ్రహ సంచారం వలన జీవిత భాగస్వామి తో విభేదాలు వచ్చినప్పటికీ అవి తాత్కాలికంగా మాత్రమే ఉంటాయి.
ఉండటానికి తాత్కాలికంగా ఉన్నా పెద్ద తుఫానుని సృష్టించే విధంగా ఉంటాయి. ఎన్నో అలజడులు, ప్రశ్నలు వెంటాడుతుంటాయి. సాధ్యమైనంత వరకు ఒకరినొకరు దుర్భాషలాడుకోకుండా, అర్ధం చేసుకుని సానుకూలంగా స్పందిస్తే కొంత వరకు సమస్య లు రాకుండా సమసిపోతాయి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం. కావున రాహుకేతు గ్రహ శాంతికై రాహు గ్రహ దీపం లే దా జపం చేయడం అవసరం. జీవిత భాగస్వా మి విషయంలో ఎంతో ఉదారంగా వ్యవహరిస్తా రు, గతంలో ఏర్పడిన స్పర్థలు మరచిపోయి మం చి ఆలుమగలుగా వ్యవహరిస్తారు.
ఈ ఏడాది సుగంధ ద్రవ్యాల వ్యాపారాలు, హోల్‌సేల్ మార్కెటింగ్, రిటైల్ మార్కెటింగ్, తక్కువ వ్యవధిలో సాగే తాత్కాలిక వ్యాపారాలు, ఆటోమొబైల్స్, నిర్మాణరంగం, ట్రావెల్స్ మొదలైన వ్యాపారాలలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. చెల్లింపులు, రాబడులు కొంతకా లం సరిసమానంగా ఉంటాయి.
ఫ్యాషన్ డిజైన్ రంగంలో ఉన్నవారికి, చేతి వృత్తి, పనివారికి, సన్నకారు రైతులకు మంచి అనుకూలమైన కా లం. బంగారం, వెండి రాగి మొదలైన లోహపు వ్యాపారులకు కాలం అద్భుతంగా ఉంటుంది. ఇనుము, స్టీలు మొదలైన వ్యాపారులకు కాలం అనుకూలంగా ఉంది. డాక్టర్లు, లాయర్లు, చా ర్టెడ్ అకౌంటెంట్‌లకు కాలం అనుకూలంగా ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో డబ్బు రాదు, కమర్షియల్ ట్యాక్స్, ఇన్‌కంట్యాక్స్, మున్సిపల్ ట్యాక్స్ అధికారుల వల్ల, ఎసిబి అధికారులవల్ల, విజిలెన్స్ అధికారుల వల్ల ఇబ్బందులు రావచ్చు, జాగ్రత్త వహించండి. రచనా వ్యాసాంగాలు, పుస్తక రచన, పరిశోధన, నటన, కళా సంబంధమైన వృత్తి, ఉద్యోగాలలో విశేషమైన నిపుణత కలిగి ఉంటారు.
సంగీత, సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. మీలో కొన్ని బలహీనతలు చోటు చేసుకుంటాయి. దురభ్యాసాలవైపు మనస్సు పోతుం ది. సుఖంగా ఉన్న జీవితాన్ని మీకు మీరుగా ఇబ్బందుల పాలు చేసుకుని మీ స్థాయిని మీరే తగ్గించుకుంటారు. అనవసరమైన కొనుగోళ్ళు చేస్తారు. ధనాన్ని దుర్వినియోగం చేస్తారు. కొన్ని సందర్భాలలో తాత్కాలికంగా భయానికి, భ్రాం తికి లోనవుతారు. కార్మిక వర్గాలకు, మంచి స్ఫూ ర్తిని నింపుతూ, ఉదాహరణగా ఉంటారు. మీ వర్గం ఐకమత్యం దెబ్బతీసే ప్రయత్నాలు నెరవేరవు. యూనియన్స్‌ను సమర్థవంతంగా నడుపుతారు. మీమీద అందరూ నమ్మకం కలిగి ఉంటా రు. కీలకమైనటువంటి బాధ్యతలను విజయవంతంగా నిర్వహించామన్న సంతృప్తి కలుగుతుం ది. గురు, శుక్ర మౌఢ్యమిలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఏలిననాటి శని నడుస్తుంది కావున కాలభైరవ రూపును మెడలో ధరించండి.
కుంభ రాశి
ఆదాయం : 14 వ్యయం : 14
రాజ : 06 అవమానం : 01
ధనిష్ఠ 3,4 పాదములు, శతభిషం 1,2,3,4 పాదములు, పూర్వాభాద్ర 1,2,3 పాదముల యందు పుట్టినవారు “గు, గే, గో, సా, సీ, సు, సే, సో, దా” అను అక్షరములు తమ పేరునకు మొదటగలవారు కుంభరాశికి చెందినవారు.
కుంభరాశి వారికి ఈ సంవత్సరం తృతీయ చతుర్ధ రాశులలో గురు గ్రహ సంచారం జన్మరాశిలో శని గ్రహ సంచారం. గురు, శుక్ర మౌఢ్యయాలు , ద్వితీయ, తృతీయాలలో రాహుకేతు గ్రహ సంచారం ప్రధాన ఫలితాలు నిర్ణయించుతున్నాయి. ఈ సంవత్సరం ఈ రాశివారికి అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. కొత్త సంపాదనా మార్గాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రాహుకేతు సంచారం ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. నూతన ఆహారపు అలవాట్లు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క కుటుంబ పరంగా అభివృద్ధి బాగుంటుంది. ఆర్థిక పరమైన విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు, కుటుంబ సంబంధ విషయాలు, స్థిరాస్తులు ఏర్పరుచుకోవడం జరుగుతాయి. ముఖ్యంగా వివాహ విషయంలో అన్ని విషయ వ్యవహారాలు పరిశీలించుకుని ముందుకు వెళ్ళడం మంచిది. ఒకటికి నాలుగు సార్లు పరిశీలించుకుని, ఇరువురి జాతకం, నక్షత్ర పొంతన సరిచూసుకుని వివాహ పరంగా నిర్ణయాలు తీసుకోవడం శ్రేయస్కరం. విద్యా సంబంధ విషయాలు అన్ని రంగాల విద్యార్ధి విద్యార్ధులకు, ఉద్యోగస్తులకి బాగున్నాయి. పి.హెచ్.డి చేసే వారికి, విదేశాలకు వెళ్ళే వారికి అనుకూల కాలం. షేర్ మార్కెట్ వారికి అనుకూలం. అయితే కొంత మందికి మాత్రమే వర్తిస్తుంది షేర్ మార్కెట్ ఫలితాలు. వ్యక్తిగత జాతక ఫలితాలను బట్టి తారుమారు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఏ విషయంలో అయినా కూడా వారివారి జాతక పరిశీలన బట్టి స్థితిగతులు మార్పులు, ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
కావున వ్యక్తిగత జాతక పరిశీలన అనేది ముఖ్యం. మీ చిరకాల సొంత ఇంటి కల నెరవేరు కాలంగా చెప్పవచ్చును. బ్యాంకుల ద్వారా ఋణం పొంది నూతన గృహాలు, వాహనాలు తీసుకునే వారికి అనుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. ప్రామిసరీ నోట్ల విషయాలలో, బాండ్ పేపర్లు విషయాలలో జాగ్రత్త అవసరం. మీరు నడిపే విద్యా సంస్థలలో, ధార్మిక సంస్థలలో అవకతవకలు జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు వహించడం ద్వారా ఆర్థిక పురోగాభివృద్ధి పొందగలుగుతారు. సంతానం కోసం ఎదురు చూసే వారికి అనుకూలంగా ఉంటుంది.
సంతానం కోసం ఎదురు చూసే వారికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సంతానంలేని వారికి సంతానప్రాప్తి కలుగుతుంది. సంతానపాశుపత హోమం, పుత్రకామేష్ఠి హోమం చేయించండి. ఆరోగ్య పరంగా ఎటువంటి మానసిక ఒత్తిడికి, ఎటువంటి అపొహలకు తావు లేకుండా ఉండడం మంచిదని చెప్పదగిన సూచన. ర్యాభర్తల మధ్య ఇతరుల జోక్యం లేకుం డా ఉండుట మంచిది. వేరొకరి ప్రమేయం ఉంటే మీ మధ్యన మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉం టాయి.అటువంటి సంఘటనలు జరిగితే జీవితంలో కోలుకోలేని తప్పులు చేసిన వారుగా మిగిలిపోతారు. ఇతరులు మీ మధ్యకు రాకుండా జాగ్రత్త పడండి.
జీవిత భాగస్వామి ద్వారా లాభాన్ని పొందుతారు. సలహాలు సహకారాలు సమపాళ్ళలో అందిపుచ్చుకుంటే ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. పదుగురిలో మన్ననలు పొందుతారు. గతంలో కుటుంబ కలహాల కారణంగా విడిపోవాలని నిర్ణయించకున్న భార్యాభర్తలకు న్యాయస్థానంలో తీర్పు వాయిదాపడే అవకాశా లు ఉన్నాయి. విడాకుల విషయంలో ఆలస్యం అ వుతుంది. కొంత మంది దంపతుల విషయంలో చట్టరీత్యా శాశ్వతంగా విడిపోవడం జరుగుతుంది. కుటుంబ సంబంధమైన కలహాలు, భా ర్య వేధింపులు, కోర్టులు, పోలీస్‌స్టేషన్లు మొదలై న వ్యవహారాలన్నీంటికీ తెర పడుతుంది, తాత్కాలిక ప్రశాంతత లభిస్తుంది. జీవితంలో ఓ ఆత్మీయుడితో విడిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడతా యి. స్త్రీకి స్త్రీయే శతృవు అన్న విషయం మీ విషయంలో ఋజువు అవుతుంది.
ఆరోగ్య పరంగా మెళకువలు అవసరం. కొంత స్వయంకృతాపారాధాలు మీ ఆరోగ్యాన్ని క్షీణించే విధంగా చేస్తాయి. మోకాళ్ళ నొప్పులు, దీర్ఘకాలిక రోగాలు, నేత్ర సంబంధ వ్యాధుల విషయంలో జాగ్రత్తలు అవసరం. అదే విధంగా వె న్నునొప్పి స్పాంటిలైట్ ఇబ్బందులు అమితంగా బాధించే అవకాశం ఉంది. స్త్రీ సంబందిత గైనిక్ ప్రాబ్లవ్‌సు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ము ఖ్యంగా ఈ సంవత్సరం శని, గురు సంబంధ కా ర్యక్రమాలు జపాలు, ెమాధి క్రతువులు చేయడం వలన గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఉ త్తమ ఫలితాలు పొంద డానికి ఆస్కారం ఉం టుంది. శారీరక వ్యాయామాలు, యోగా, మెడిటేషన్ వంటివి మంచి ఫలితాలను ఇస్తాయి.
విదేశాలలో చదువుకోవడానికి అవకాశం వస్తుంది. విదేశాలలో ఉండి పార్ట్‌టైం ఉద్యోగా లు చేస్తున్నవారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. మీరు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గ్రీన్‌కా ర్డు, పి.ఆర్., హెచ్1బి వీసా లభిస్తాయి. వైద్యరంగంలో ఉన్నవారికి ముఖ్యంగా డాక్టర్లకు ప్రాక్టీస్ బాగా పెరుగుతుంది. హస్తవాసి మంచిదని ప్ర ఖ్యాతి లభిస్తుంది. ఇదేవిధంగా ప్రతిరంగంలో ఉ న్న వారికి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి, ఇ దంతా శనిభగవానుని అనుగ్రహం వల్ల, గురుబ లం వల్ల ఇలాంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి, క లిసి వస్తాయి.
మాతృ సంబంధిత వర్గం నుండి వివాహ సంబంధిత విషయాలు ప్రస్తావనకు వస్తాయి, బంధువులు పూనుకుని ఐకమత్యంగా నిర్ణయా లు తీసుకుంటారు. వివాహాది శుభ కార్యాలు చేస్తారు. మీరు అతి గోప్యంగా ఉండటం వల్ల మీ అంతరంగిక వర్గానికి విసుగు కలుగుతుంది. ద గ్గరి దాకా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్న పెళ్ళి సంబంధాల విషయంలో నిరాశ కలుగుతుంది. భృగుపాశుపత హోమం చేయించండి. అరటిచెట్టును వివాహం జరిపించండి. ఇందువల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు, శుక్రగ్రహ అనుగ్రహం వల్ల పెళ్ళి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ప్రేమ పెళ్ళిళ్ళు, కులాంతర వివాహాలు చర్చనీయాంశం అవుతాయి. ప్రేమ వివాహాలు కలిసిరావు. మనస్సులో మాట స్పష్టంగా చెప్ప డం వల్ల లౌక్యం లేకపోవడం వల్ల లేక ముక్కుసూటిగా ప్రవర్తించడం వల్ల స్వతంత్ర నిర్ణయాల వల్ల చాలా సమస్యలను ఒంటరిగా ఎదుర్కోవలసి వస్తుంది, ధైర్యంగా ఎదుర్కొంటారు. మనస్సులోని ఆలోచన, వ్యూహం ఇతరులకు తెలియనివ్వరు.
న్యాయ పరమైన చిక్కుల నుండి బయటపడటానికి న్యాయ నిపుణులను సంప్రదిస్తారు, మంచి ఫలితాలను సాధిస్తారు. ఇంటర్వ్యూలలో విజయం మీదే. స్థిరాస్తుల విక్రయానికి ఇష్ట పడరు. కొన్ని సందర్భాలలో కీలక నిర్ణయాలు వె ంటవెంటనే చెప్పలేని పరిస్థితులు నెలకొంటా యి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చి నా వాటివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. వ్యాపార కూ డలి ప్రదేశాలు అద్దెకు ఇచ్చి అదృష్టాన్ని జారవిడుచుకుంటారు. జీవితంలో ఘనవిజయాలు సా ధిస్తారు. పోటీలేని చోట కూడా మీ మంచితనం వల్ల పోటీదారుల్ని మీరే కొని తెచ్చుకుంటారు.
మొత్తం మీద ఈ సంవత్సరం బాగుంటుంది.
వృ త్తివ్యాపార సంబంధమైన విషయాలను మళ్ళీ గా డిలో పెడతారు. ఈ రాశిలో జన్మించిన వారు అ త్యంత ముఖ్యమైన వ్యక్తిని శాశ్వతంగా చట్టబద్ధంగా విడిపోవడం జరుగుతుంది (ఇది అందరివిషయంలో కాదు కొద్దిమంది విషయంలోనే). శత్రువర్గంపై మీరే విజయం సాధిస్తారు. సెల్‌ఫోన్ వాడటం వీలైనంత వరకు తగ్గించండి. పిల్లలకు టూ వీలర్ కొనిపెట్టవద్దు. ఈతలు పిక్నిక్ లు, డే నైట్ పార్టీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆర్థికస్థితి బాగుంటుంది. కన్సల్టెన్సీ ఫీజును పెంచుతారు. దారిద్య్రానికి దూరం గా కుటుంబాన్ని ఉంచాలనే ఉద్దేశ్యంతో దివారాత్రులు కష్టపడతారు. గతంలో కొనుగోలు చేసి న స్థిరాస్థి అమ్ముడు పోకుండా ఇబ్బంది పెడుతుంది. డబుల్ రిజిస్ట్రేషన్ వల్ల నష్టం వచ్చే అవకాశం ఉంది. ఉన్నంతలో విలాసవంతమైన జీవి తం గడుపుతారు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వివాహాది శుభకార్యాలు ఘనంగా పూర్తిచేస్తారు. కుటుంబంలో మరొకరి సంపాదన మొదలవుతుంది. ఆభరణాల భద్రత విషయంలో జాగ్రత్త గా ఉండాలి, చోర భయం పొంచి వుంది.
మీన రాశి
ఆదాయం : 11 వ్యయం : 05
రాజ : 02 అవమానం : 04
పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు, రేవతి, 1,2,3,4 పాదముల యందు పుట్టిన వారు “ది,దు,శ్యం,ఝా,దా,దే,దో,చా,చి” అను అక్షరములు తమ పేరునకు మొదట గలవారు మీనరాశికి చెందినవారు.
మీనరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితా లు గోచరిస్తున్నాయి. కొత్త విషయాలు ఆలోచించడంలో ఏది మంచో, ఏది చెడో నిర్ణయించుకుని నిర్ణయాలు తీసుకోవడం అవసరం. ము ఖ్యంగా జన్మరాశిలో రాహు గ్రహ సంచారం, ద్వితీయ, తృతీయాలలో గురు గ్రహ సంచారం, సప్తమ వ్యయంలో కేతు, శని గ్రహ సంచారం ప్రధాన ఫలితాలు నిర్ణయిస్తున్నాయి. వ్యాపారంలో చేసే మార్పులు ఆలోచించి చేయడం మంచిది. జీవిత భాగస్వామి నిర్ణయాలు తీసుకుని చేయ డం వలన మంచి ఫలితాలను పొందుతారు. మీ యొక్క ఆలోచనా విధానాలు కొంత తప్పుదోవ పట్టే అవకాశాలు ఉన్నాయి.
దాని వలన మీరు ప్రయోజనాలు ఎంతవరకు పొందగలరో నిర్ణయించుకొని ముందుకు వెళ్ళడం మంచిది. నూ తన భాగస్వాముల వ్యాపారంలో ధనం పెట్టుబడిగా పెట్టకపోవడం మంచిది. ఉద్యోగ వ్యాపారాలను బాధ్యతలు అధికమవుతాయి. సమాజంలో ని కొంత మంది చేసిన రాజకీయాల వలన అదనపు బాధ్యతలు పెరుగుతాయి. కొన్నాళ్ళు వృత్తి లో అసంతృప్తి ఏర్పడుతుంది. మీ ప్రయత్నలో పం వలన కావచ్చు, వేరే కారణాలు కావచ్చు. చే సే పనిలో కొంత జాప్యం జరిగే విధంగా గోచరిస్తున్నది. వృధా ప్రయాణాలు అధికమవుతాయి. ఒక్కో సంధర్భంలో వృధా ప్రయాస అవుతుంది. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చినప్పటికీ సర్దుకుపోవడం మంచిది. ఇతరుల జ్యోక్యం అనవసరం. దూరం పెరిగే ఆస్కారాలకి తావు ఇచ్చిన వారు అవుతారు. చిన్నచిన్న అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆందోళన కలిగించే అంత ఇబ్బందులు ఉండవు.
అయి నా కూడా తగిన జాగ్రత్తలు అవసరం. షుగర్, జీర్ణవ్యవస్థ, మోకాళ్ళు నొప్పులు, ఇ.ఎన్.టి., న రాల బలహీనత, అలర్జీ వ్యాధులను ముందుగా గుర్తించి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అన్నదమ్ములు అక్క చెల్లెలు మధ్య సంబంధబాంధవ్యాలు అనుకూలిస్తాయి. అయిన వారికి కొంత కాలం దూరంగా ఉంటారు. పి.హెచ్.డి. చేసే వా రికి అనుకూలంగా ఉన్నది. ఆర్థికంగా అనుకూలంగా ఉన్నట్టు ఉంటుంది. కాని ఆదాయం కం టికి కనిపించదు. ఎంతున్నా లేదనే భావన ఉం టుంది. సామాన్యంగా ఎవర్నీ అతిగా నమ్మరు. ఒక్కసారి నమ్మితే వదులుకోవడానికి ఇష్టపడరు. రాజకీయ పరంగా అభివృద్ధి ఉంటుంది. ప్రయాణాల్లో అత్యంత జాగ్రత్త అవసరం. రాజకీయరంగంలో ఉన్న వారికి నామినేటెడ్ పోస్టు వస్తుంది. మీ శక్తి సామర్థ్యాలు రుజువు చేసుకోవడానికి కొన్ని అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగపరుచుకొని సమాజంలో మీ స్థాయిని పెంచుకోగలుగుతారు. కుటుంబ పరం గా తీర్థయాత్రలు చేస్తారు.
దైవ దర్శనాలు, దైవ కార్యక్రమాలకు ముందుంటారు. ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొనడం, గురువుల బోధనలు, ఆ ధ్యాత్మిక వాతావరణంలో గడపడం వలన ఉత్తమ ఫలితాలు పొందుతారు. మెడిటేషన్ యోగా వంటి విషయాలలో ఆసక్తి ఉన్నా వాటిని పెద్దగా పా టించరు. మీరు చేసే పూజలు, పునస్కారాలు, వ్ర తాలు, నోములు, దైవకార్యక్రమాలు, అన్నదా నం, విద్యాదానం ఇలాంటివన్ని కూడా మీకు, మీ కుటుంబానికి లాభం చేకూరుస్తాయి. నూత న వాహనం కొనుగోలు చేస్తారు. మీకున్న ప్రత్యేకతను నిలబెట్టుకోగలుగుతారు. సహోదరసహోదరీ వర్గానికి అండగా వుంటారు. అన్ని మీరై వా ళ్ళకు ఏ లోటు రాకుండా చూసుకుంటారు. ఉన్నత స్థాయిలో ఉన్నవారికి ఈ సంవత్స రం పరీక్షాకాలం అని చెప్పవచ్చును. వివాదాల కు దూరంగా ఉండటం మంచిది. అనుకోని సం ఘటనలు ఎదురైనా ధృఢ సంకల్పంతో ముందు కు సాగితే విజయాలు అందుకుంటారు.
చుట్టూ ఉన్న పరిస్థితులను అర్ధం చేసుకుంటూ వాటికి అనుగుణంగా నడుచుకోవడం వలన సత్పలితాలను పొందుతారు. ఈ సంవత్సరం ఈ రాశివా రు సుబ్రహ్మణ్య పాశుపత ెమం చేయించుకోవా లి. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వా రికి పూజాధి అభిషేకాలు చేయడం వలన మంచి ఫలితాలను అందుకుంటారు. ముఖ్యంగా కృత్తి కా నక్షత్రం నాడు స్వామి వారికి అభిషేకాలు నిర్వహిస్తే మరిన్ని శుభ ఫలితాలు సంప్రాప్తిస్తా యి. అను నిత్యం హనుమాన్ చాలీసా, మన్యు సూక్తం పఠిస్తే మంచి ఫలితాలు పొందుతారు.
ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంది. అవివాహితులైన వారికి వివాహం జరుగుతుంది. వివాహ సంబంధమైన విషయాలలో అనుబంధాలకు, బాధ్యతలకు అతీతంగా వ్యవహరించండి. సున్నితమైన విషయాలలో కొన్ని తప్పిదాలు జరుగు తాయి. అందుకు మీ ప్రమేయం ఉండదు. అతికష్టంమీద ముఖ్యమైన తప్పిదాలలో మీ తప్పు లేదని మాత్రం ఋ జువు అవుతుంది. విడిపోవాలని నిర్ణయించుకు న్న భార్యా భర్తలు చట్టపరంగా విడిపోవడం జరుగుతుంది. కొంత మంది విషయంలో పెళ్ళి చేదు అనుభవంగా మిగులుతుంది. ద్వితీయ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవితం ఓ గాడిలో ప డుతుంది. గతించిపోయిన ఆత్మీయుల జ్ఞాపకా లు మనస్సును బాధిస్తాయి.
కుటుంబంలో చిన్నచిన్న తగాదాలు అభివృద్దికి అడ్డంకిగా నిలుస్తాయి. వ్యాపార విస్తరణకు అవసరమైన ప్రభుత్వ అనుమతులు ఆలస్యం అ వుతాయి. కొన్ని అవకాశాలు చేతిలో ఉండి ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థికపరమైన మినహాయింపులు, ఇన్‌కం ట్యాక్స్‌లకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. అందరినీ కలుపుకుని సమిష్టి ప్రయోజనాల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇందు వలన కీర్తి, ధనం, లభిస్తుంది. విలువైన పత్రాలు, డాక్యుమెం ట్స్ చోరీకి గురి అయ్యే అవకాశం ఉంది, జాగ్రత్త వహించండి.
విలాసవంతమైన జీవితానికి దూ రంగా ఉండాలని భావిస్తారు అయితే అది ఆచరణలో సాధ్యం కాదు. వస్త్ర వ్యాపారాలు చేసే వ్యాపారులకు ప్రతికూల కాలం. మీ పరిధిలో లేని పనులు చేసిపెట్టమని ఒత్తిడి పెరుగుతుంది. విధి నిర్వహణలో ఇది సమస్యగా మారుతుంది. చేసిన పొరపాట్లను మళ్లీ చేయకూడదని నిర్ణయించుకుంటారు. చెప్పుడు మాటలు నమ్మవ ద్దు, ప్రత్యక్ష పర్యవేక్షణ ద్వారా అంటే మీకంటితో చూసి నిజాలు నిర్ధారించుకోండి, దీనివల్ల మేలు జరుగు తుంది. భూమి, వాహన సంబంధమైన విషయాలు, కొనుగోళ్ళు అమ్మకాల విషయంలో లాభిస్తాయి. గతంలో ఆగిపోయిన ఓ అ మ్మకం వల్ల ప్రస్తుతం లాభం పొందుతారు. ఆ ర్జించిన వాటిపై అంతగా లాభాలు రాకపోయినా సరదాగా చేసిన కొన్ని కార్యాక్రమాలు వల్ల ప్ర యోజనాలు ఎక్కువగా వస్తాయి. సమాజంలో కుటుంబస్థాయి పెరుగుతుంది.
ఈతలు, పిక్నిక్ లు, బైక్ రైడింగ్‌లకు దూరంగా ఉండండి. కొన్ని ప్రమాదాలు తప్పుకుని చేదు వాస్తవాలు తెలుసుకుంటారు. కపటంలేని మనుషులు సహాయంగా ఉంటారు. అపార్థాలు, అపోహలకు దూరంగా వాస్తవాలు గ్రహించడానికి ప్రయత్నించండి. ప్రింటింగ్, వ్యాపార ప్రకటనలు, మార్కెటింగ్ మ ధ్యస్తంగా ఉన్నాయి. దురభ్యాసాలు ఉన్నవారికి ముఖ్యమైన పనులు అప్పజెప్పి భంగపడతారు. మీరు ఎంత ధర్మంగా వ్యవహరించినా ఏదొక వ ర్గానికి చెందిన వ్యక్తిగా మీమీద ముద్రపడుతుంది. అన్నింటికీ కా లమే సమాధానం చెబుతుంది. కాలక్రమంలో ఏర్పడుతున్న మార్పులు మీ ఆలోచనా విధానంపైన ప్రభావం చూపుతా యి. భవిష్యత్తును దృష్టి లో ఉంచుకుని ఇప్పటినుండే లొంగి ఉండటం, మీ సిద్ధాంతాలకు విరుద్ధంగా పనిచేయడం మీ కు చేతకాదని తేల్చి చెప్పేస్తారు.
ఆ త్మగౌరవం లేని వ్యక్తుల సహాయం అక్కరలేదని తెగతెంపులు చేసుకుంటారు. కృషిని నమ్ముకుంటారు, భగవంతుణ్ణి కూడా కోరికలు అడిగే పరిస్థితికి స్వస్తి చెబుతారు. మీకృషి వ్యర్థం కా దన్న సంగతి చాలా సందర్భాలలో రుజువు అవుతుం ది. మీ స్థాయికి సరి సమానంగా కొంతమంది చేరుకుంటారు, ఇది మీ కు బాధ కలిగించే అం శంగా మారుతుంది. దై వానుగ్రహం ఉంటే చెడు కూడా మంచిగా మారుతుందని ఋజువు అవుతుంది. పంతాలకు, పట్టింపులకు పోకుండా చ ర్చలతో చాలా సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ వ స్తుంది. అన్నిరంగాలలోనూ మీదైన స్థాయిలో ముద్ర వేయ గలుగుతారు.