Sunday, December 22, 2024

ఆగస్టు 21 రాశి ఫలితాలు.. ఏ రాశుల వారికి బాగుందంటే?

- Advertisement -
- Advertisement -

మేషం: కష్టపడి సాధించుకున్న పదవి మానసిక అశాంతి కారణమవుతుంది. సర్వీస్ లో వివాదాస్పద వ్యక్తిగా మిగలకుండా ఉండడానికి కొన్ని ప్రయోజనాలను మీరు వదులుకోవాల్సి వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి.

వృషభం: మీడియా పరంగా చికాకులు గోచరిస్తున్నాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది.  స్త్రీలతో వివాదాస్పద అంశాలు సర్దుబాటుకు మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.

మిథునం: ఆధ్యాత్మిక సామాజిక కార్యక్రమాలలో ఎన్నడూ లేనంత ఉత్సాహంగా పాల్గొంటారు. ప్రత్యర్థులలో ఐకమత్యం లేకపోవడం మీకు లాభిస్తుంది. ఆర్థిక పరంగా అనుకూలమైన ఫలితాలుంటాయి.

కర్కాటకం: ఇతరులపై మీరు చేసే ఆరోపణలకు సంబంధించిన విషయాల తాలూకు సాక్షాదారాలు లభిస్తాయి. అన్ని విషయాలు మీ అదుపులో ఉన్నట్లుగానే పరిస్థితులు ఉంటాయి.

సింహం: కొన్ని అపోహలు, అనుమానాలు పక్కనపెట్టి నిజ జీవితంలో బ్రతకడం అనేది మేలు అని గ్రహిస్తారు. ఇంటి కొనుగోలు విషయంలో పెద్దలతో చర్చలు జరిపి అడుగు ముందుకు వేయండి.

కన్య: హోల్సేల్ వ్యాపారం చేసే వారికి, నిర్మాణ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. నూతన బ్యాంకు ఖాతాలు తెరుస్తారు. రావాల్సిన మొండి బాకీలు చేతికి అందుతాయి.

తుల: ఇతరులు మీకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. వృత్తిలో ఏర్పడినటువంటి చికాకులు తొలగిపోతాయి. పై అధికారులు ఒకరు తప్పుకోవడం మీకు లాభిస్తుంది.

వృశ్చికం: జమా ఖర్చులను సరి చూసుకోవడం వలన లాభపడతారు. కార్యాలయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. పరిస్థితులను మీకు అనుకూలంగా మలుచుకుంటారు.

ధనుస్సు: మీకు మీరుగా వ్యాపారం చేసుకోవడానికి ప్రణాళికలు ఏర్పరచుకుంటారు. పక్కవారి సలహాలు సూచనలు తీసుకొని ముందుకెళ్లడం ముఖ్యమని భావించి ఆ విధంగా వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటారు.

మకరం: నూతన అవకాశాలను చక్కగా ఉపయోగించుకుంటారు. గతంలో ఒకరికి ఇచ్చిన మాటను నెరవేరుస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు వహించండి.

కుంభం: ప్రతి పనిని క్రమ పద్ధతిలో నిర్వహిస్తారు. క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగానే ఉంటాయి.

మీనం: బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. ప్రముఖుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. నూతన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News