Thursday, December 26, 2024

రాశి ఫలాలు(22-08-2024)

- Advertisement -
- Advertisement -

మేషం: శక్తికి మించి శ్రమిస్తారు. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్తలు పాటించాలి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

వృషభం: శుభకార్యాలు సానుకూలంగా సాగుతున్నప్పటికీ ఒక సమస్య తీరితే మరో సమస్యను పరిష్కరించు కోనవలసి రావడం మానసిక ఒత్తిడికి కారణం అవుతుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి.

మిథునం: వృత్తి ఉద్యోగాల పరంగా మీదే పైచేయిగా ఉంటుంది. వస్త్రధారణకు అలంకరణకు ప్రాధాన్యతని ఇస్తారు. ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కార్యాలయంలో  అధికంగా శ్రమిస్తారు.

కర్కాటకం: ముఖ్యమైన వ్యవహారాలలో మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ప్రజా సంబంధాలను విస్తృత పరుచుకుంటారు. జీవిత భాగస్వామితో సఖ్యతగా మెలుగుతారు.

సింహం: ముఖ్యమైన వ్యవహారాలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. ఒక శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

కన్య: శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఇష్టదేవత అనుగ్రహం కలుగుతుంది.

తుల:  రాజకీయ, కళా రంగాల వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. అనుకున్న విధంగా ఒప్పందాలు కుదుర్చుకొని విధానపరంగా లాభపడగలుగుతారు.

వృశ్చికం: వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. జీవిత భాగస్వామితో స్వల్పమైన విభేదాలను గ్రహస్థితి సూచిస్తుంది. పరిస్థితులను మీకు అనుకూలంగా మలుచుకుంటారు.

ధనుస్సు: ఆర్థిక లావాదేవీలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. శుభప్రదమైన కార్యక్రమాలు ప్రయాస మీద నెరవేరుతాయి. సాధారణమైన ఫలితాలు ఉంటాయి. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉంటారు.

మకరం: కష్టమైన కార్యక్రమాలను కూడా శ్రమించి సానుకూల పరుచుకోగలుగుతారు. గృహ నిర్మాణ ఆలోచనలలో తొందరపాటు వద్దు, జీవిత భాగస్వామి నుండి స్వల్ప ధన లాభం పొందుతారు.

కుంభం: పనులలో ఆటంకాలు ఎదురయి చికాకులు పెడతాయి. ఆరోగ్యపరంగా నలతగా ఉంటుంది. మానసిక ఉల్లాసానికి ఆధ్యాత్మికత పట్ల మక్కువ చూపుతారు.

మీనం: అధిక శ్రమ తప్పకపోవచ్చు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక లావాదేవీలలో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News