Sunday, December 22, 2024

మంగళవారం రాశి ఫలాలు (02-01-2024)

- Advertisement -
- Advertisement -

మేషం –  చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వ్యవహారాలు చేపడతారు. వస్తు లాభాలు పొందుతారు. అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు పొందుతారు. సోదరుల నుండి శుభవార్తలువింటారు..

వృషభం – ప్రముకులతో పరిచయాలు. విందు, వినోదాలు. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. మిత్రుల నుండి శుభవార్తలు వింటారు. పెట్టుబడులకు తగిన సమయం. నూతన వస్తు కొనుగోలు

మిథునం – కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలలో తొందరపాటు వద్దు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ధనలాభం.

కర్కాటకం – ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సన్నిహితుల నుండి సహాయం అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. సోదరులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు.

సింహం – కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. ఆకస్మిక ధనలాభం పొందుతారు. అనుకోని ఆహ్వానాలు ఆనందాన్ని కలిగిస్తాయి. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

కన్య – అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. అంతర్గత శత్రువులు సమస్యలు సృష్టించి అధిగమిస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. వస్తు సేకరణ చేస్తారు.

తుల – ఆర్థిక లావాదేవీలు లాభాసాటిగా ఉంటాయి. ఋణాలు తీరతాయి. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం పొందుతారు. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. ధన వస్తు లాభాలు.

వృశ్చికం – సోదరులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. ప్రయాణాలు ముందుకు సాగవు. కోపతాపాలకు దూరంగా వుండండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.దైవ దర్శనం చేస్తారు.

ధనుస్సు- వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. విలువైన ఆభరణాలు, వస్తు కొనుగోలు చేస్తారు. సోదరులను కలుస్తారు.

మకరం – కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. సంఘంలో ఆదరణ పొందుతారు. బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది. గృహనిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి.

కుంభం – ప్రయాణాలలో అవరోధాలు ఏర్పడినా అధిగమిస్తారు. వివాదాలకు కోపతాపాలకు దూరంగా వుండండి. ఎంత శ్రమించినా ఫలితం ఉండదు. జీవిత భాగస్వామి నుండి ధనలాభం.

మీనం – కుటుంబ సభ్యలతో ఏర్పడిన మాటపట్టింపులు తొలగుతాయి. మిత్రుల నుండి ముఖ్యమైన సమాచారం అందుతుంది. ఆరోగ్య సమస్యలు నుండి బయటపడతారు.శుభవార్తలు.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News