Sunday, December 22, 2024

బుధవారం రాశి ఫలాలు (20-12-2023)

- Advertisement -
- Advertisement -

మేషం – పనులు చకచకా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలలో కొత్త మిత్రుల పరిచయాలు. ఇంటా బయటా ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో ఏర్పడిన చికాకులు తొలుగుతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

వృషభం – ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. అనుకోని అవకాశాలు పొందుతారు.

మిథునం – కుటుంబ సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. భాగస్వామ్య వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. శుభవార్తలు

కర్కాటకం – కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పొందుతారు. సంతానం నుండి కీలక సమాచారం అందుకొంటారు. నూతన వస్తు, వస్త్ర కొనుగోలు.

సింహం – వ్యవహారాలలో ఆటంకాలు ఎదురై చికాకు పెడతాయి. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. ఆరోగ్య సమస్యల నుండి కొంత వరకు బయటపడతారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

కన్య – దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. జీవితభాగస్వామి నుండి ఆస్తిలాభం పొందుతారు. విద్యావకాశాలు.

తుల – సంతానంనకు నూతన ఉద్యోగం  లభించడం మీకు ఆనందాన్నికలిగిస్తుంది. పనులు సజావుగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త కొంత ఆనందం కలిగిస్తుంది.

వృశ్చికం – బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకొంటారు. గృహనిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుకొంటారు.వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్త వహించాలి.

ధనుస్సు – విద్యార్థులకు శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలలో ఎదురైన చికాకులు తొలుగుతాయి. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు వుంటాయి. ప్రయాణాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు.

మకరం – కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును.వృత్తి, వ్యాపారాల అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు పొందుతారు.

కుంభం – నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా వుంటాయి. తండ్రి ద్వారా ఆస్తి లాభం పొందుతారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు లభిస్తాయి. అరుదైన ఆహ్వానాలు.

మీనం – ఆర్థిక ఇబ్బందులు ఎదురైన అధిగమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకొంటారు. ఆరోగ్యం పట్ల మెలుకువలు అవసరం. ఎదుటివారితో  మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్
9014126121, 8466932225
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News