Wednesday, January 22, 2025

వార ఫలాలు…. (10-09-2023 నుండి 16-09-2023)

- Advertisement -
- Advertisement -

వార ఫలాలు.. 10-09-2023 నుండి 16-09-2023 వరకు

మేషం: మేషరాశి వారికి ఈవారం అనుకూలమైన ఫలితములు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ఈవారం సాఫీగా, సామాన్యంగా జరిగే అవకాశములు ఉన్నాయి. మీ తెలివితేటలతో మీ యొక్క సామర్ధ్యం నిరూపించుకుంటారు. వ్యాపారస్తులు కష్టపడిన దానికి ప్రతిఫలం దక్కుతుంది. లలితకళలు, కళారంగం వారికి గుర్తింపు, కొత్త అవకాశముల కొరకు చేసే ప్రయత్నములు అనుకూలమైన ఫలితాన్నిఇస్తాయి. క్రీడారంగానికి వారికీ ఈ వారం బాగుంది అని చెప్పవచ్చు. వారం ప్రథమార్ధంలో శుభకార్యములలో పాల్గొనే అవకాశములు గోచరిస్తున్నాయి. హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం శ్రేయస్కరం.

వృషభం: ఉద్యోగస్తులకుపై అధికారులతో చిన్నపాటి ఒత్తిడి ఉండే అవకాశములు ఉన్నాయి. మీరు మాట్లాడేటప్పుడు స్పష్టత అవసరం, లేకపోతె వివాదాలకు తావు ఇచ్చినవారు అవుతారు. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. అప్పుకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. వ్యాపారస్తులకు అనుకూలమని చెప్పవచ్చు. చిరు వ్యాపారస్తులకు సైతం లాభములు ఉంటాయి. సాఫ్ట్‌వేర్ రంగం వారికి అనుకూలమైన ఫలితములు. కుటుంబపరంగా సానుకూలత ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. దైవచింతన, ఆధ్యాత్మికత ధోరణి పెరుగుతుంది. నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన.

మిథునం: ఉద్యోగస్తులకు ఎప్పటి నుండో ఉండే పెండింగ్ పనులు పూర్తి అయ్యేఅవకాశములు ఉన్నాయి. ఉద్యోగాభివృద్ది ఉంటుంది. వ్యాపారస్తులకు అభివృద్ధి ఉంటుంది. గెలుపు, ఓటములు జీవితంలో తప్పవు, అలాగే ఏది ఏమైనా మన మంచికే అనే ధోరణికి వస్తారు. కుటుంబంతో ప్రయాణములు, శుభకార్యములు వంటివి ఆనందాన్ని కలుగచేస్తాయి. కళారంగం వారికి, చేతివృత్తుల వారికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. టెక్నీకల్ రంగంవారు జాగ్రత్త వహించాల్సిన సమయం ఇది. శారీరక ఆరోగ్యం బాగుంటుంది. మానసిక సంతృప్తి లభిస్తుంది. 3 పోగుల వత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన.

కర్కాటకం: వ్యాపారస్తులకు మంచి అనుకూలమైన ఫలితాలు సూచిస్తుంన్నాయి. టెక్నీకల్ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుకూలం. అయితే ఉద్యోగస్తులకు కొంత ఒడిదొడుకులు ఉండే అవకాశములు ఉన్నాయి. జాగ్రత్త వహించి మాట్లాడండి. హార్డ్‌వేర్, టెక్నీకల్ రంగం వారికి అనుకూలత ఉంటుంది. విలాసవంతమైన జీవితం గడుపుతారు. స్నేహితులతో సన్నిహితం పెరుగుతుంది. ఆదాయపరంగా నమ్మకం ఏర్పడుతుంది. అప్పులు, బకాయిల విషయంలో కొంత ధైర్యానికి వస్తారు. విలాసములకు దూరంగా ఉండాలి అని అనుకుంటారు, అయితే సాధ్యపడదు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు తప్పవు. ఓం నమశివాయ వత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన.

సింహం: ఉద్యోగస్తులకు అనుకున్న ప్రమోషన్స్ లాంటివి కానీ, అధికారుల విషయంలో కానీ కొంత ఇబ్బందులు ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి. అయితే ఆర్ధికంగా ఇబ్బందులు అంతగా ఉండవు. కుటుంబపరంగా, స్నేహితులపరంగా సంతోషం కలుగుతుంది. వ్యాపారస్తులకు ఆదాయం బాగున్నప్పటికీ మాటలలో ఇబ్బందులు, పట్టింపులు ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ రంగం వారికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఏదైనా ఒక కొత్త ప్రణాళికల విషయంలో ఆలస్యంగా ఫలితములు వుండే అవకాశములు ఉన్నాయి. శారీరక ఆరోగ్యం బాగున్నప్పటికే మానసిక ఆందోళనలు, వాటి వల్ల వచ్చే తలనొప్పి వంటివి ఉండే అవకాశములు ఉన్నాయి. జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన.

కన్య: ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కూడా అనుకున్న పనులు వాయిదా వేయడం మంచిది కాదు. మీ కొద్దిపాటి నిర్లక్ష్యం వలన ఇబ్బందులు పడవలసి రావచ్చు. అయితే కొంత టెన్షన్ తరువాత అనుకున్న సమయానికి ధనం సమకూరి పనులు పూర్తవుతాయి. అతికష్టం మీద అనుకున్న పనులు పూర్తి చేశామని తృప్తి లభిస్తుంది. స్నేహితులతో చిన్నపాటి మాట పట్టింపులు ఉండే అవకాశములు ఉన్నాయి. మీ శ్రేయోభిలాషులతో వాగ్వాదములు మంచిదికాదు. టెక్నీకల్ రంగంవారికి జాగ్రత్త వహించాల్సిన సమయం అని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఆదాయము, ఖర్చులు మిశ్రమముగా సరిపోతాయి. ఓం నమశివాయవత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన.

తుల: ఉద్యోగస్తులకు అనుకోని విధంగా ఆర్థికాభివృద్ధి ఉంటుంది. చేపట్టే పనులు సత్ఫలనిస్తాయి. కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి కొంచెం కష్టంతోనైనా ప్రయత్నేస్తే మంచి ఫలితములు ఉంటాయి. వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన సమయం. చేపట్టే పనులలో పురోగతి కనిపిస్తుంది. పార్టీనేర్షిప్స వల్ల చిన్నపాటి అవమానములు, తగాదాలు ఉండే అవకాశములు ఉన్నాయి. కుటుంబపరంగా, సంతానపరముగా సంతోషం లభిస్తుంది. సాఫ్ట్ వేర్ రంగం వారికి అనుకూలంగా అభివృద్ధి అవుతుంది. వివాహం కానీ వారికీ వివాహ ప్రయత్నాలు ఓకొలిక్కి వస్తాయి. కుబేరకుంకుమతో అమ్మవారిని పూజంచడం చెప్పదగిన సూచన.

వృశ్చికం: ఉద్యోగస్తులకు క్రమక్రమాభివృద్ది ఏర్పడుతుంది. ఈ మధ్య కొత్త ఉద్యోగంలో చేరిన వారికి సైతం ప్రశంసలు అందుకునే అవకాశములు ఉన్నాయి. వ్యాపారస్తులకు, రియల్ ఎస్టేట్ రంగం వారికి, టెక్నీకల్ రంగం వారికి, సాఫ్ట్ వేర్ వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది. కుటుంబంలో సుఖశాంతులు ఉంటాయి. జీవిత భాగస్వామిపై నమ్మకం, అభిమానం, కుటుంబంపై, పిల్లలపై శ్రద్ద పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. క్రీడారంగంలో వున్న వారికి మంచి పురోగతి ఉంటుంది. విద్యార్థిని విద్యార్థులకు మంచి సమయం. అనుకూలమైన ఫలితములు వస్తాయి. నవ గ్రహవత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన.

ధనస్సు: ఈ వారం ప్రథమార్ధం కంటే ద్వితీయార్థంలో అనుకూలంగా ఉంటుంది. మధ్య కాలంలో కొంత ఒడిదుడుకులు ఉండే అవకాశములు ఉన్నాయి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు స్వల్ప నష్టములు ఏర్పడే అవకాశములు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. పెద్దవారితో తగాదాలు, మాట పట్టింపులు మంచిది కాదు. చిన్నమాటకి పెద్ద నింద రావచ్చు. ఏదైనా కొత్త పనులు కానీ, కొత్త వ్యవహారములు కానీ మొదలుపెట్టడం అంత మంచిది కాదు. ఒకవేళ తప్పని సరి అయితే చాలా జాగ్రత వహించండి. తొందర పాటు నిర్ణయములు, అనాలోచిత ఖర్చులు అంత పనికి రావు. 3 పోగుల వత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన.

మకరం: ఈవారం ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ ప్రతీ విషయంలో ఆలోచించి నిర్ణయములు తీసుకోవడం మంచిది. ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయములు తొందరపాటుతో ఉంటె భవిష్యత్తులో ఇబ్బందులు పడవలసి ఉంటుంది. ఏదైనా కొత్త పనులు, ప్రణాళికలు అయితే పూర్తిగా మీ ఆలోచనలకు సరిపడితేనే మొదలు పెట్టండి. సంకోచంగా, అనుమానంగా చేయవద్దు. కుటుంబపరంగా జీవిత భాగస్వామితో చిన్నపాటి మాట పట్టింపులు ఉండే అవకాశములు ఉన్నాయి. మీ అంతరంగ సమస్యలు మిమ్మల్ని ఇబ్బందిపెడతాయి. విద్యార్థిని, విద్యార్థులకు మంచి సమయం అని చెప్పవచ్చు. నలుపు వత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన.

కుంభం: ఉద్యోగస్తులకు మార్పులకు అంతమంచి సమయం కాదు. అలాగే అభివృద్ధి విషయంలో కంగారు పడకండి, నిదానంగా ఉండండి. ఎదో అభివృద్ధి కొరకు ఉన్న స్థితిగతులను పక్కకుపెట్టకండి. రుణాలు, కోర్ట్ వ్యవహారములు వంటివి వాయిదాలు పడే అవకాశములు ఉన్నాయి. చిన్నపాటి తగాదాలు, అవమానములు ఉండవచ్చు. ఏదైనా ఒక విషయం చర్చనీయాంశమైనపుడు మీరు తక్కువగా స్పందించడం మంచిది. మంచి పనికైనా ఈ అడ్డంకులు, చిక్కులు ఏమిటి అని ఆందోళన ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు కూడా కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టడం, అనాలోచిత పెట్టుబడులు మంచిది కాదు. ఆచీతూచీ అడుగువేయండి. హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం శ్రేయస్కరం.

మీనం: ఉద్యోగస్థులకు ఈ వారం వత్తిడితో పని, మానసిక ప్రశాంతత లోపిస్తుంది, చేసిన పనే పదిసార్లు చేయవలసి వస్తోందే అనే భావన కలుగుతుంది. పనిలో ఆటంకాలు రాకుండా జాగత్త వహించాలి. నిబద్దతతో పనిచేస్తే మంచి ఫలితాలు అందుకుంటారు. వ్యాపారస్తులకు ఇతరత్రా ఏ రంగం వారికైనా విపరీతమైన ఖర్చులు అయ్యే అవకాశములు గోచరిస్తున్నాయి. వాహనములు, ప్రయాణముల విషయంలో జాగ్రత్త వహించండి. ఆరోగ్యపరముగా శ్రద్ధ వహించండి. పెద్దవారి సహాయ, సహకారములు తీసుకోండి. ప్రథమార్ధం కంటే ద్వితీయార్థంలో వచ్చేసరికి కొంత సానుకూలత ఏర్పడుతుంది. నిత్యం శనిస్తోత్రం అలాగే హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగిన సూచన.

Saturday rasi phalalu

సోమేశ్వర్ శర్మ, వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్
84669 32223, 90141 26121

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News