Thursday, January 23, 2025

బుధవారం రాశి ఫలాలు (06-11-2024)

- Advertisement -
- Advertisement -

మేషం – మీలోని సామర్థ్యాన్ని నిజాయితీని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా ఒక ఆశ ఫలించడం వల్ల మీకు మీ భాగస్వాముల ఆనందానికి అవధులు ఉండవు.

వృషభం – వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన కాలం. మీ సలహాలు నైపుణ్యం శ్రమ ఇతరులకు ఉపయోగపడుతుంది. అమ్ముడు పోనీ కొన్ని స్థిరాస్తులు ఇబ్బందిగా మారుతాయి.

మిథునం – మీ నైపుణ్యానికి సంబంధించిన ప్రశంసాపూర్వకమైన సర్టిఫికెట్లు చేతికందుతాయి.ఆత్మవిశ్వాసంతో చేసే ఏ మంచి పనైనా మంచి ఫలితాలు ఉంటాయి అని గ్రహిస్తారు ఆత్మవిశ్వాసం ఎప్పుడు మిమ్మల్ని రక్షిస్తుంది.

కర్కాటకం – సన్నిహితులు నిపుణులతో సంప్రదించకుండా ఏ ముఖ్య కార్యక్రమాన్ని అమలు చేయకండి. వివాహాది శుభకార్యాలలో మీ అభిప్రాయాలను మీ సన్నిహితులు సమర్ధించరు,

సింహం – కుటుంబ సభ్యులతో భేదాభిప్రాయాలు వస్తాయి. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. ఆరోగ్య విషయంలో మెలకువ అవసరం. మానసిక ఆనందం కలిగి ఉంటారు.

కన్య – ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే సూచనలు ఉన్నాయి. సంగీత సాహిత్య, కళా, రంగాలలో ప్రత్యేక అభిరుచి కనబరుస్తారు. చిన్ననాటి మిత్రుడు దగ్గరవుతారు. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది.

తుల – వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీ స్థాయి పెరుగుతుంది. ప్రత్యర్థులు పోటీ దారుల నుండి ఊహించిన విధంగానే పోటీలు ఎదురవుతాయి. అయితే మీరు తీసుకున్న ముందు జాగ్రత్త వల్లచెప్పుకోదగిన నష్టం లేదు.

వృశ్చికం – ప్రజా సంబంధాలు వృద్ధి చేసుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. తాత్కాలిక అవసరాల కన్నా భవిష్యత్తుకు సంబంధించిన విషయ వ్యవహారాలకు ప్రాముఖ్యతను ఇస్తారు.

ధనుస్సు – క్రయవిక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగాలలో ప్రమోషన్లు పొందుతారు. శ్రమకు తగిన ఫలితాన్ని అందుకోగలుగుతారు. అనుకున్న పనులలో విజయం సాధిస్తారు.

మకరం – పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆదాయ మార్గాలు మెరుగ్గా ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. స్వల్ప ధన లాభం.

కుంభం – రుణ ఒత్తిడులు తొలగి ఊరట చెందుతారు. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.

మీనం – ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆత్మవిశ్వాసం మనోధైర్యం పెరుగుతాయి. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు మేలు.వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

Saturday rasi phalalu

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News