మేషం: ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.నూతన కార్యక్రమాలకు నాంది పలుకుతారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో కలహాలు కాపురం చేస్తాయి జాగ్రత్త వహించండి. అనాలోచిత ఆలోచనలు,మాటలకు దూరంగా ఉండడం మంచిదని చెప్పదగిన ముఖ్య సూచన.
వృషభం: ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలలో కుటుంబ సభ్యులు తమ చేతనైన సహాయ సహకారాలు అందిస్తారు.ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం.విద్యార్థులకు సానుకూల ఫలితాలు ఉంటాయి.
మిథునం: ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతానం నూతన విద్య,ఉద్యోగ అవకాశాలు పొందుతారు.దూర ప్రయాణాలు లాభిస్తాయి. ఆప్తులతో సఖ్యత అవసరం. మాట విషయంలో అప్రమత్తత అవసరం.
కర్కాటకం: అనుకోని అతిధులు, శుభ ఆహ్వానాలు అందుతాయి. పనులు మందకోడిగా సాగుతాయి. అయినా మొక్కవోని దీక్షతో అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా అంతంతమాత్రంగా ఉన్న అవసరాలకు ధనం చేతికందుతుంది.
సింహం: సంఘంలో సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.విందు వినోదాలు శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.విలువైన వస్తువులు,వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందోత్సహాలతో గడుపుతారు. ఆరోగ్యపరంగా స్వల్ప జాగ్రత్తలు అవసరం.
కన్య: జీవిత భాగస్వామి సలహాతో నూతన పనులకు శ్రీకారం చుట్టి విజయవంతంగా నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.ఆస్తివివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. విలువైన వస్తువులు సేకరిస్తారు.
తుల: రుణాలు తీరుతాయి.ఉద్యోగులకు ఉన్నత పదవులు వరిస్తాయి. సంఘంలో గుర్తింపు లభిస్తుంది.సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ధన లాభాలు కలుగుతాయి. బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు.
వృశ్చికం: ఎంత శ్రమించినా ఫలితం కష్టమే, రుణ బాధలు తప్పేలా లేవు జాగ్రత్త వహించండి. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి. ఆకస్మిక ధన, వస్తు లాభాలు కలుగుతాయి. సన్నిహితులతో కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది.
ధనస్సు: దూర ప్రాంతాల నుండి శుభ ఆహ్వానాలు అందుకుంటారు.చేపట్టిన పనులలో సన్నిహితుల సహాయ సహకారాలు అందిస్తారు.క్రయవిక్రయాలు లాభసాటిగా సాగుతాయి.ఆర్థిక అభివృద్ధి అనుకూలం.భవిష్యత్తు కార్యచరణలు చేస్తారు.
మకరం: రాజకీయ, కళా సాంస్కృతిక, పారిశ్రామిక రంగాల వారు సన్మానాలు సత్కారాలు పొందుతారు. ఆర్థికాభివృద్ధిచెందుతుంది. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రముఖుల సలహాలతో రాబోవు జీవితానికి సంబంధించిన దారి ఏర్పరచుకుంటారు.
కుంభం: ఆరోగ్యం పట్ల మెలకువ అవసరము. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. క్రయవిక్రయాలలో ప్రోత్సాహం పొందుతారు. జీవిత భాగస్వామి నుండి ధన లాభాలు పొందుతారు. సంతాన విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు.
మీనం: పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.ఆదాయం పెరుగుతుంది దానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరుగుతాయి. నూతన ఒప్పందాలు కుదురుతాయి. నిలకడ మీద సానుకూలత ఏర్పడుతుంది. స్వల్పంగా ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది.
సోమేశ్వర్ శర్మ, వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్
84669 32223, 90141 26121