Wednesday, January 22, 2025

ఆదివారం రాశి ఫలాలు..(10-09-2023)

- Advertisement -
- Advertisement -

మేషం: నూతన కాంట్రాక్టులు లభిస్తాయి. ఉద్యోగులకు అధిక శ్రమతో కూడిన బాధ్యతలు ఏర్పడతాయి. ఉన్నతాధికారులతో స్వల్ప మనస్పర్ధలు అనుకున్న పనులు ఆలస్యం అవుతాయి. అయినా కూడా పట్టుదలతో పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది.

వృషభం: నూతన మిత్రులు పరిచయం అవుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. విలువైన వస్తువులు వస్త్రభరణాలు కొనుగోలు చేస్తారు. సంతానం ఉన్నవారికి నూతన ఉద్యోగం లభిస్తుంది. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది.

మిథునం: ఉద్యోగాలలో పదోన్నతులు బోనస్లు అందుకుంటారు. వాహన సౌఖ్యం ఉన్నది. మీరు తల పెట్టిన నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు మంచి కబుర్లు వింటారు. రోజంతా రెట్టించిన ఉత్సాహంతో పనులు ముగిస్తారు.

కర్కాటకం: ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. ముఖ్యమైన విషయ వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. సభలు సమావేశాలలో చురుకుగా పాలుపంచుకుంటారు. ప్రముఖుల మన్ననలు పొందుతారు. రాజకీయ నాయకులకు మిశ్రమంగా ఉంటుంది.

సింహం: కుటుంబ సభ్యులతో ఏర్పడిన తగాదాలు కొలిక్కి వస్తాయి. చేపట్టిన పనులు నిదానంగా నత్తనడక నడుస్తాయి. మొత్తం మీద పూర్తి చేస్తారు. స్వల్ప ధన లాభాలు గోచరిస్తున్నాయి. సన్నిహితులతో ముఖ్యమైన విషయాలలో గోప్యత అవసరం. తన మన తెలుసుకొని ప్రవర్తించండి.

కన్య: ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అతను బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఆదాయం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది.కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలే శ్రేయస్కరం. ఇతరుల తీపి మాటలు వినిమోస పోవద్దు.

తుల: శ్రమ అధికంగా ఉంటుంది. పనులలో జాప్యం జరిగినా కుటుంబ సభ్యుల సహాయసహకారాలతో ముందుకు సాగుతారు. అనవసర విషయాలకు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆదాయం ఎంత ఉన్న ఆర్థిక ఇబ్బందులు తప్పవు.

వృశ్చికం: పోటీ పరీక్షలలో, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు. మిత్రులతో ఇష్టాగోష్టిలతో ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో చిన్న చిన్న విషయాలకు మనస్పర్ధలు ఏర్పడతాయి. నిదానంగా ఉండుట మంచిది.

ధనస్సు: వృత్తి వ్యాపారాలలో స్వల్పలాభాలు పొందుతారు. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు అవసరం. నూతన కాంట్రాక్టులు పెట్టుబడులు అనుకూలిస్తాయి. ధైర్యంతో సాగితే విజయం మీవెంటనే ఉంటుందని గ్రహించండి.

మకరం: నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. క్రయవిక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. సోదరి సహోదర వర్గం మధ్య మనస్పర్ధలు ఏర్పడతాయి.

కుంభం: దీర్ఘకాలిక పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. ఆర్థికఅ భివృద్ధి పుంజుకుంటుంది. విలువైన వస్తువులు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి సలహా, సహకారాలతో నూతన పెట్టుబడులకి శ్రీకారం చుడతారు.

మీనం:దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. నమ్మినవారు నట్టేట ముంచిన దైవ చింతను కలిగిన వారు నడి సముద్రం నుండైనా రాగలరని నిరూపిస్తారు. ఆర్థికపరంగా ఒడిదుడుకులు ఉన్నాఅంతిమంగా అనుకూల ఫలితాలు ఉంటాయి.

Saturday rasi phalalu

సోమేశ్వర్ శర్మ, వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్
84669 32223, 90141 26121

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News