Wednesday, January 22, 2025

‘నీకెవరు చెప్పార్రా?’… నెటిజన్ పై రష్మిక మందాన ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

హీరోయిన్ రష్మిక మందాన టాలీవుడ్ లోనూ, బాలీవుడ్ లోనూ మంచి అవకాశాలు అందిపుచ్చుకుని, దూసుకుపోతోంది. సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆ మధ్య తనపై డీప్ ఫేక్ వీడియో వస్తే, ఎంత రచ్చ చేసిందో చూశారుగా? తాజాగా ఓ నెటిజన్ తనపై కామెంట్ చేసినందుకు గట్టిగా బుద్ధి చెప్పింది. ‘ఇలాంటి నిరాధారమైన వార్తలు ఎలా రాస్తారు?’ అంటూ దులిపేసింది.

అసలు విషయం ఏంటంటే… 2022లో రష్మిక ‘ఆడాళ్లూ..మీకు జోహార్లు’ అనే మూవీకి సైన్ చేసిందనీ, అయితే కథ నచ్చి కాదనీ, హీరో శర్వానంద్, డైరెక్టర్ కిశోర్ తిరుమల ఉన్నారని తెలిసే నటించేందుకు ఒప్పుకుందనీ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. దీనిపై మండిపడిన రష్మిక ‘ఎవరు చెప్పార్రా? కథ నచ్చితేనే సినిమాలు ఒప్పుకుంటాను. చక్కటి నటీనటులతో, సిబ్బందితో పనిచేస్తే అదొక గౌరవం. మీకు ఇలాంటి నిరాధారమైన విషయాలన్నీ ఎలా దొరుకుతాయో?’ అంటూ చీవాట్లు పెట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News