Friday, November 22, 2024

నీళ్ల కోసం మెదక్-చేగుంట రోడ్డులో రాస్తారోకో

- Advertisement -
- Advertisement -

మెదక్: భగీరథ నీళ్లు రావడం లేదని ఫిర్యాదులు చేసినా ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రతిస్పందించడం లేదంటూ మెదక్ జిల్లాలోని గ్రామస్థులు మెదక్-చేగుంట రోడ్డుపై ఆదివారం ‘రాస్తా రోకో’ ధర్నాకు దిగారు. చిన్న శంకరంపేట్ మండల్ లోని గవలపల్లి గ్రామస్థులు చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా అంత ప్లాస్టిక్ బిందెలు, బకిట్లు పట్టుకుని రాస్తారోకో చేపట్టారు.

గ్రామస్థుల నీళ్ల ఇబ్బందులపై పంచాయతీ కార్యదర్శి సహా అధికారులు కళ్లు మూసుకుపోయినట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. గత రెండు వారాలుగా మిషన్ భగీరథ నీళ్లు సరఫరా కావడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇబ్బందులు ఇక భరించలేక గ్రామస్థులు రోడ్ల దిగ్భంధానికి దిగారు. కాగా పోలీసులు ఆందోళన విరమించాలని, జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి గ్రామస్థులను బుజ్జగించారని సమాచారం.

మిషన్ భగీరథ ద్వారా గత బిఆర్ఎస్ ప్రభుత్వం 2.32 కోట్ల ప్రజలకు త్రాగు నీరు పథకాన్ని చేపట్టింది. కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News