- Advertisement -
హైదరాబాద్: నలబై రోజుల పసికందును ఎలుక కొరకడంతో దుర్మరణం చెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… నాగనూల్‌లో శివ-లక్ష్మికళ అనే దంపతులకు 40 రోజుల క్రితం బాబు జన్మించాడు. శనివారం రాత్రి లక్ష్మికళ తన బాబుతో కలిసి నేలపై నిద్రలోకి జారుకుంది. అర్థ రాత్రి సమయంలో బాబు ముక్కును ఎలుక కొరకడంతో ఏడ్చాడు. ముక్కు నుంచి రక్తస్రావం కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసిన మెరుగైన వైద్యం కోసం నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు ఆదివారం చనిపోయాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.
- Advertisement -