Friday, December 20, 2024

బాలుడిని కొరికిన పందికొక్కు….. మెక్ డొనాల్డ్స్ పై కేసు (వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

 

న్యూస్ డెస్క్: డిన్నర్‌కు వెళ్లిన ఒక ఎనిమిదేళ్ల బాలుడిని కుక్క పిల్ల సైజులో ఉన్న పందికొక్కు కొరకడంతో ఆ హోటల్‌పై బాధిత బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని కొంపల్లిలో ఉన్న ఎస్‌పిజి గ్రాండ్ హోటల్ ఆవరణలో ఉన్న మెక్‌డొనాల్డ్ ఔట్‌లెట్‌లో బుధవారం రాత్రి జరిగింది. మేజర్ సేవియో హెన్రిక్స్ అనే వ్యక్తి తన ఎనిమిదేళ్ల కుమారుడు ద్వానె హెన్రిక్స్‌తో కలసి మెక్ డొనాల్డ్ ఔట్‌లెట్‌కు వెళ్లారు. ఆ బాలుడు తింటుండగా కుక్క పిల్ల సైజులో ఉన్న ఒక పందికొక్కు డైనింగ్ హాల్‌లోకి ప్రవేశించి ఆ బాలుడి కాళ్లమీదుగా తొడల వద్దకు పాకి అతని తొడలను కొరికింది.

ఆ బాలుడు నొప్పితో గట్టిగా అరవడంతో వెంటనే అతని తండ్రి ఆ ఎలుకను చేతిలో పట్టుకుని పక్కకు విసిరేశారు. ఇదంతా అక్కడ ఉన్న సిసి టివి కెమెరాలో రికార్డయింది. వెంటనే ఆ తండ్రి తన కుమారుడిని బోయిన్‌పల్లిలోని మిలిటరీ ఆసుపత్రికి తీసుకువెళ్లి బాలుడికి టెటానస్, యాంటీ ర్యాబీస్ ఇంజక్షన్లు వేయించారు. గురువారం ఆయన కొంపల్లి పోలీసు స్టేషన్‌లో మెక్ డొనాల్డ్స్ ఔట్‌లెట్‌పై ఫిర్యాదు చేశారు. పిల్లలకు సురక్షితమైన పరిసరాలను కల్పించాల్సిన బాధ్యత మెక్ డొనాల్డ్‌కు ఉందని, ఈ సంఘటనకు ఔట్‌లెట్‌ మేనేజర్, సిబ్బంది ప్రత్యక్ష సాక్షులని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News