Friday, December 20, 2024

ప్రాణాలను పణంగా పెట్టాం కానీ..

- Advertisement -
- Advertisement -

డెహ్రాడూన్: ఉత్తర కాశీలోని సిల్‌క్యారా సొరంగంలో ఇటీవల చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను విజయవంతంగా బయటికి తీసుకురావడంలో ర్యాట్‌హోల్ మైనర్స్‌ది కీలక పాత్ర అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆరు ప్రత్యామ్నాయ మార్గాల్లో రెస్కూ ఆపరేషన్ చేపట్టినప్పటికీ అత్యంత ప్రమాదకరమైన ర్యాట్‌హోల్ మైనింగ్ విధానం ద్వారానే సొరంగంలో చిక్కుకున్న కూలీలను రెస్కూ బృందాలు చేరుకోగలిగాయి. ఈ క్రమంలోనే ర్యాట్‌హోల్ మైనర్ల సేవలకు ప్రతిఫలంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఇటీవల12 మందిని రూ.50వేల చొప్పున చెక్కులతో సత్కరించారు. అయితే ఈ ఆపరేషన్‌లో తాము పోషించిన పాత్రకు ప్రభుత్వ సాయానికి ఏమాత్రం పొంతన లేకుండా పోయిందనివారు ఆవేదన వ్యక్తం చేసునత్నారు. ఈ చెక్కులను తిరిగ ఇచ్చేస్తామని అంటున్నారు. ‘ఆ రోజు చాలా అసాధ్యకరమైన పరిస్థితి.యంత్రాలు విఫలమైన వేళ మేము సొరంగంలోకి ప్రవేశించాం. ఎటువంటి షరతులు విధించకుండా ప్రాణాలను పణంగా పెట్టి మేము శిథిలాలను తొలగించాం.

ఈ ఆపరేషన్‌లో ర్యాట్‌హోల్ మైనర్లది వీరోచితమైన పాత్ర. ఈ క్రమంలోనే సిఎం చూపించిన చొరవకు కృతజ్ఞతలు. కానీ మా సేవలను లెక్కలోకి తీసుకుంటే ప్రభుత్వం అందించిన మొత్తంతో సంతృప్తిగా లేము. ఇది మా మనోధైర్యాన్ని తగ్గిస్తుంది. చెక్కులు అందజేసిన రోజే మా అసంతృప్తిని తెలియజేశాం.దీంతో త్వరలోనే ఒక ప్రకటన చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. వారు తమ మాటను నిలబెట్టుకోకుంటే చెక్కులను తిరిగి ఇచ్చేస్తాం’ అని ర్యాట్‌హోల్ మైనర్ల బృందానికి నాయకత్వం వహించిన వకీల్ హసన్ పిటిఐకి చెప్పారు. శాశ్వత ఉద్యోగం లేదా నివసించడానికి ఇల్లు ఇచ్చి ఉంటే సముచితంగా ఉండేదని ఆ రోజు సొరంగంలోని కూలీల వద్దకు మొదటగా చేరుకున్న మున్నా ఆకాంక్షించారు. సొరంగంలో చిక్కుపడిన కార్మికులను కాపాడడం కోసం తాము మృత్యువు కోరల్లోకి వెళ్లామని, మనుషుల ప్రాణాలను కాపాడడం కోసం తాము తమ కుటుంబ సభ్యుల మాట కూడా వినలేదని అతను చెప్పాడు. భార్యా పిల్లలతో మున్నా ఓ చిన్నపాటి గదిలో నివాసం ఉంటున్నాడు.

కాగా నవంబర్ 12న 41 మంది కార్మికులు సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకు పోయారు. కూలీలను బయటికి తీసుకువచ్చేందుకు చేపట్టిన సహాయక చర్యల్లో అడుగడుగునా సవాళ్లు ఎదురయ్యాయి. డ్రిల్లింగ్ కోసం తీసుకువచ్చిన మిషన్ బ్లేడ్లు విరిగిపోయాయి. మొత్తం 57 మీటర్లకుగాను ఆ మిషన్ అప్పటికే 47 మీటర్లు తవ్వింది.ఈ క్రమంలోనే 12 మంది ర్యాట్‌హోల్ మైనర్లు(బొగ్గుగనుల్లో సన్నని మార్గాలను తవ్వడంలో నిపుణులు)ను రంగంలోకిదించారు. మిగతా డ్రిల్లింగ్ పనిని వీరు చేతులతో చేపట్టారు. చివరికి 17 రోజలు తర్వాత నవంబర్ 28న కార్మికులందరూ సురక్షితంగా బయటపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News