Friday, January 17, 2025

రతన్ టాటాకు ‘ఉద్యోగరత్న’ అవార్డు ప్రదానం

- Advertisement -
- Advertisement -

ముంబయి: ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటాసన్స్ చైర్మన్ ఎమిరిటస్ రతన్ టాటాను మహారాష్ట్ర ప్రభుత్వం ‘ఉద్యోగరత్న’ అవార్డుతో సతరించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రులు అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవిస్‌లె శనివారం రతన్‌టాటా నివాసంలో ఉద్యోగరత్న అవార్డుతో సత్కరించారు. రతన్ టాటా అనారోగ్యంతో బాధపడుతున్నందున ముఖ్యమంత్రి ఇంటివద్దే అవార్డును అందజేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి షిండే మాట్లాడుతూ రతన్ టాటా, టాటా గ్రూపులు దేశానికి ఎనలేని సేవలందించాయన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డును స్వీకరించినందుకు రతన్‌టాటాకు కృతజ్ఞతలు తెలియజేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం తొలిసారి ఉద్యోగరత్న అవార్డును ఏర్పాటు చేసింది. రతన్ టాటాకు ఈ అవార్డును అందజేయనున్నట్లు జులై 28న ఆ రాష్ట్ర పరిశ్రమల మంత్రి ఉదయ్ సావంత్ ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News