Wednesday, January 22, 2025

రతన్ టాటాకు ‘ఉద్యోగరత్న’ తొలి అవార్డు ప్రదానం

- Advertisement -
- Advertisement -

ముంబై : పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాను మహారాష్ట్ర ప్రభుత్వం అవార్డుతో గౌరవించింది. పారిశ్రామిక , ఉపాధి కల్పనా రంగాల్లో విశిష్ట సేవలు అందించినందుకు గాను ఆయనకు ‘ఉద్యోగరత్న’ పురస్కారాన్ని ప్రదానం చేసింది. దక్షిణ ముంబై లోని కొలాబాలో ఉన్నటాటా నివాసానికి వెళ్లిన మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ,డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌లు 85 ఏళ్ల టాటాను కలిసి ఈ పురస్కారాన్ని అందజేశారు.

ఉపాధి కల్పనారంగాల్లో విశేష సేవలందించే పారిశ్రామిక వేత్తలను గౌరవించేందుకు ఈ ఏడాది ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే శనివారం మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తరఫున శాలువా , ప్రశంసా పత్రంతోపాటు జ్ఞాపికను అందజేసి రతన్ టాటాను సన్మానించారు. రతన్‌టాటాకు ఉద్యోగరత్న పురస్కారం అందించడం ద్వారా ఆ అవార్డుకే మరింత గౌరవం పెరిగిందని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ప్రశంసించారు.

మన దేశం లోని అనేక రంగాల్లో టాటా గ్రూపు సహకారం అపారమైందన్న ఆయన టాటా అంటేనే నమ్మకమని కొనియాడారు. ప్రపంచం లోని ఏడు ఖండాల్లోని 100 కి పైగా దేశాల్లో టాటా గ్రూపు ఉక్కు నుంచి ఉప్పు దాకా వ్యాపార రంగంలో తనదైన ముద్రవేస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News