Thursday, January 16, 2025

రతన్‌కి టాటా

- Advertisement -
- Advertisement -

ముంబై: వేలాది మంది అభిమానులు, ప్రముఖుల సమక్షంలో పారిశ్రామిక దిగ్గజం, వితరణశీలి, టాటా గ్రూపు మాజీ చైర్మన్ రతన్ టాటాకు మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో గురువా రం అంత్యక్రియలు జరిగాయి. పార్సీ మత ఆచారాల ప్రకారం వర్లిలోని విద్యుత స్మశాన వాటికలో దహన సంస్కారాలు జరిగాయి. కేంద్ర హోం మం త్రి అమిత్ షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ సిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కేంద్ర వాణి జ్య మంత్రి పియూష్ గోయల్ తదితర ప్రముఖు లు రతన్ టాటాకు అంతిమ వీడ్కోలు తెలిపిన వా రిలో ఉన్నారు. రతన్ టాటా గౌరవార్థం మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం సంతాప దినాన్ని ప్రకటించింది.

బుధవారం రాత్రి మరణించిన 86 సంవత్సరాల రతన్ టాటా భౌతిక కాయాన్ని ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నా రిమన్ పాయింట్‌లోని నేషనల్ సెంటర్ ఫర్ పర్ఫార్మింగ్ ఆర్ట్ వద్ద ఉంచి అక్కడి నుంచి వర్లిలోని స్మశాన వాటికకు తరలించారు. పేదల పెన్నిధిగా ఎన్నో దాతృత్వ కార్యక్రమాలు నిర్వహించిన రతన్ టాటాకు అంతిమ వీద్కోలు పలికేందుకు వేలాది మంది ప్రజలు అంతిమయాత్ర సాగిన 12 కిలోమీటర్ల మార్గంలో బారులు తీరారు. రాజకీయ ప్రముఖులతోపాటు సినీనటులు, క్రీడాకారులు, అంబానీలు, అదానీలతోసహా పలువురు పారిశ్రామికవేత్తలు రతన్ టాటా భౌతిక కాయానికి నివాళులర్పించారు.

రతన్ టాటాగొప్ప మానవతావాది
ప్రముఖుల నివాళులు…
ప్రముఖ పారిశ్రామిక వేత్త, గొప్ప మానవతావాది రతన్ టాటా గారి మరణం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సిఎం రేవంత్, మాజీ సిఎం కెసిఆర్, మాజీ మంత్రి కెటిఆర్, బిఆర్‌ఎస్ నేత ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్, ఎపి సిఎం, డిప్యూటీ సిఎంలు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, మంత్రి లోకేష్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్.విద్యాసాగర్‌రావు ప్రభృతులు రతన్ టాటాకు ఘనంగా నివాళులర్పించారు.
యావత్ భారతదేశానికే తీరని లోటు : సిఎం రేవంత్‌రెడ్డి
దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. వా రి నిష్క్రమణ పారిశ్రామిక రంగానికే కాకుండా యావత్ దేశానికి తీరని లోటు అని అన్నారు. రతన్ టాటా వ్యాపార రంగంలో నిబద్ధతకు, విలువలకు కట్టుబడిన గొప్ప వ్యక్తిగానే కాకుండా దాతృత్వానికి ప్రతీక అన్నారు. టాటా చారిటబుల్ ట్రస్టు ద్వారా ఆయన ఎనలేని సేవలు అందించారని, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. రతన్ టాటా గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

‘రతనా’న్ని భారతదేశం కోల్పోయింది : కిషన్‌రెడ్డి
తరాల తరబడి స్ఫూర్తి నింపిన ఓ అమూల్యమైన ‘రతనా’న్ని భారతదేశం కోల్పోయిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. భారత పారిశ్రామిక దిగ్గజం, సామాజికవేత్త, పద్మవిభూషణ్ రతన్ టాటా కన్నుమూశారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానన్నారు. పరిశ్రమలతోపాటుగా టెక్నాలజీ, అటొమొబైల్, విద్యుదుత్పత్తి తదితర రంగాల్లో వీరి కంపెనీల విస్తరించడంతోపాటు లక్షలాది కుటుంబా ల్లో వెలుగులు నింపిన రతన్ టాటా స్పృశించని భారతీయ కుటుంబం లేదంటే అతిశయోక్తి కాదు.

అరుదైన పారిశ్రామిక వేత్త రతన్ టాటా : కెసిఆర్
ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని అద్దిన అరుదైన పారిశ్రామిక వేత్త రతన్ టాటా అని మాజీ సిఎం కెసిఆర్ అన్నారు. సమాజ హితుడుగా వారి తాత్వికత, దార్శనిక కార్యాచరణ ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరికీ ఆదర్శం అని అన్నారు. భారత సమాజం గర్వించే ప్రపంచ వ్యాపార దిగ్గజం, పద్మ విభూషణ్ రతన్ టాటా మరణం పట్ల సంతాపం ప్రకటించారు. పారిశ్రామిక ప్రగతికి మానవీయ కోణాన్ని అద్దిన మానవతావాది, దార్శనికుడు, పరోపకారి రతన్ టాటా అని కొనియాడారు. అభివృద్ధి ఫలాలు కింది స్థాయికి చేరుకోవాలనే సామాజిక ఆర్థిక తాత్వికత ను సొంతం చేసుకున్న అరుదైన పారిశ్రామిక వేత్త రతన్ టాటా అని తెలిపారు.

మహనీయుడు రతన్‌టాటా : కెటిఆర్
రతన్ టాటా గారు అద్భుతమైన ఆవిష్కర్త, దార్శనీకుడు , మహనీయుడని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ అన్నారు. రతన్ టాటా మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పారు. భారత వ్యాపార ముఖచిత్రాన్ని మార్చేసిన ఆయన ఎంతోమందికి ప్రేరణ అని చెప్పారు. రతన్ టాటా వినయపూర్వ దిగ్గజమని కొనియాడారు. వ్యాపార రంగంలో ఆయన లేని లోటు పుడ్చలేనిదన్నారు. దాతృత్వంలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారని చెప్పారు. టిహబ్‌ని చూసిన ప్రతిసారీ, మేము మిమ్మల్ని గుర్తుంచుకుంటూనే ఉంటామని రతన్ టాటా టీ హబ్ ను సందర్శించిన సందర్భాన్ని గుర్తు తెచ్చుకున్నారు.

నానో ఆలోచన ఎప్పటికీ మరువలేనిది : ప్రవీణ్‌కుమార్
భారతీయ పరిశ్రమలో అత్యంత ప్రముఖుల్లో ఒకరైన దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్‌టాటా మృతి పట్ల హృదయపూర్వక నివాళులర్పిస్తున్నట్లు బిఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ట్వీట్ చేశారు. ప్రతి భారతీయ కుటుంబం కారును సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో నానో ఆలోచనతో రావడం ఎప్పటికీ మరువలేనిది అని పేర్కొన్నారు.
గొప్ప మానవతావాదిని కోల్పోయాం : చంద్రబాబు
ప్రముఖ పారిశ్రామిక వేత్త, మానవతావాది రతన్ టాటా మరణం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొందరు మాత్రమే తమ అడుగుజాడలు వెళుతూ వెళుతూ ఈ భూమిపై వదిలి వెళతారని, తమ దూరదృష్టి, సమగ్రతలతో రతన్ టాటా అదే చేశారని అన్నారు.

మనం కేవలం ఒక గొప్ప వ్యాపారవేత్తనే కాదు గొప్ప మానవతావాదిని కోల్పోయామని, కేవలం పారిశ్రామిక వారసత్వంలోనే కాకుండా ఆయన అందరి హృదయాలను స్పృశించి వెళ్ళారన్నారు. ఆయన పారిశ్రామిక రంగానికి చేసిన సేవ, జాతి నిర్మాణం లోనూ, పరోపకారి గుణంలోనూ తరతారాలలో మార్పును తెచ్చిందని కొనియాడారు.
‘రతన్ టాటా సేవా కార్యక్రమాలకు పెట్టిన పేరు’
రతన్ టాటా సేవాకార్యక్రమాలకు పెట్టింది పేరని మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్.విద్యాసాగర్‌రావు అన్నారు. అన్ని రంగాలలో ప్రకాశించే అరుదైన రత్నాన్ని భారతదేశం కోల్పోయిందన్నారు. నిరాడంబరత, సేవా భావం అన్ని జీవుల పట్ల కారుణ్యం అందరిని ఆకర్షించింది. వ్యాపార వేత్తలు తమ లాభాలలో ఏమేరకు సమాజ అభివృద్ధికి ఖర్చు చేయాలో చేసి చూపించిన మహానుభావుని మరణం దేశానికి పెద్ద లోటన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News