ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా భౌతిక కాయాన్ని కడసారి చూసి నివాళులు అర్పించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ఎన్ సిపిఏ లాన్స్ కు చేరుకున్నారు. రతన్ టాటా తన 86 వ ఏట మృతి చెందారు. చనిపోవడానికి ముందు ఆయన ముంబై లోని ఓ ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియూ) లో చికిత్స పొందారు. రతన్ టాటా ఓ అసాధారణ వ్యక్తి.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ శ్రద్ధాంజలి ఘటించారు. ప్రధాని మోడీ తన ఎక్స్ పోస్ట్ లో ఆయన ఓ ‘దార్శనికుడు’(Visionary) అని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే కూడా రతన్ టాటాకు తమ సంతాపం ప్రకటించారు. కాగా మహారాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 10న(గురువారం) రాష్ట్ర సంతాప దినంగా ప్రకటించింది. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలు జరుగుతాయని , ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ పతాకాన్ని సగం అవతనం చేస్తారని ప్రకటించారు.