- Advertisement -
ప్రముక పారిశ్రామికవేత్త, టాటా సన్స్ సంస్థ ఛైర్మన్ రతన్ టాటా( 86) ఆరోగ్య పరిస్థితి విషమించినట్టు తెలుస్తోంది. ముంబై లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఆయన చికిత్స పొందుతున్నట్టు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ బుధవారం పేర్కొంది. రతన్ టాటా అస్వస్థతకు గురై బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చేరారంటూ సోమవారం వార్తలు వచ్చాయి. దీనిపై ఆయన అధికారిక ఎక్స్ ఖాతాలో తాను బాగానే ఉన్నానని, ఆందోళన అవసరం లేదని పేర్కొన్నారు. వృద్ధాప్య సంబంధ రుగ్మతలను పరీక్షించుకుంటున్నట్టు చెప్పారు. రూమర్ల వ్యాప్తి పట్ల ప్రజలు, మీడియా సంయమనం పాటించాలని కోరారు.
- Advertisement -