ముంబయి: దిగ్గజ పారిశ్రామిక వేత్త, టాటా గ్రూప్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా(86) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ముంబయిలోని క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి పదకొండున్నర గంటలకు తుదిశ్వాస విడిచారని టాటాసన్స్ ప్రస్తుత చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. రతన టాటా కన్నుమూయడంతో సోషల్ మీడియాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, పలువురు ప్రముఖులు, సినీ నటులు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేశారు. రతన్ టాటా ఇకలేరని తెలియగానే రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి చేరుకున్నారు. రతన్ టాటా అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
ముంబయిలోని నావల్ టాటా- సోనీ టాటా దంపతులకు 1937 డిసెంబర్ 28న జన్మించారు. 1962లో కార్నెల్ యూనివర్సిటీ నుంచి బి ఆర్క్ డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. టాటా స్టీల్ కంపెనీలో షాప్ ప్లోర్‌లో సాధారణ ఉద్యోగిగా పనిచేశారు. అనంతరం నేషనల్ రెడియో, ఎలక్ట్రానిక్స్ కంపెనీ లిమిటెడ్ డైరెక్టర్ ఙన్‌ఛార్జిగా సేవలందించారు. 1991లో జెఆర్‌డి టాటా నుంచి టాటా సన్స్ ఛైర్మన్ బాధ్యతలు చేపట్టారు. 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్‌నకు రతన్ టాటా చైర్మన్‌గా ఉండడంతో 2016 నుంచి 2017 వరకు తాత్కాలిక చైర్మగా విధులు నిర్వహించారు. 2000లో రతన్ టాటాకు పద్మభూషణ్, 2008లో పద్మవిభూషణ్ అనే పౌర పురస్కారంతో భాతర ప్రభుత్వ సత్కరించింది. దేశం గర్వించే, విలువలతో కూడిన వ్యాపార శిఖరం, భరతమాత ముద్దుబిడ్డ రతన్ టాటా అస్తమయం భారతదేశానికి తీరని లోటు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆయన జీవించి వున్నప్పుడే భారత ప్రభుత్వం భారతరత్నతో గౌరవించి ఉంటే బాగుండేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.