Saturday, November 23, 2024

టి హబ్ 2.0 ప్రారంభోత్సవంపై ప్రముఖుల హర్షం..

- Advertisement -
- Advertisement -

టి హబ్ 2.0 ప్రారంభోత్సవంపై ప్రముఖుల హర్షం
ట్విట్టర్‌లో వెల్లువెత్తిన అభినందనలు
హైదరాబాద్: టి హబ్ 2.0 ప్రారంభోత్సవం సందర్భంగా దేశవిదేశాల ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. దేశ స్టార్టప్ ఎకో సిస్టమ్‌కు టి హబ్ 2.0 గొప్ప వరమని కితాబిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటు చేసిన తెలంగాణ సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్, రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.

“హైదరాబాద్‌లో కొత్త టి హబ్ ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కెసిఆర్‌కు అభినందనలు. భారత స్టార్టప్ ఎకో సిస్టమ్‌కు ఇది గొప్ప ఊతమిస్తుంది”-రతన్ టాటా
“ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్‌ను ఏర్పాటు చేసిన కెటిఆర్‌కు అభినందనలు. టి హబ్ హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్‌ను ప్రోత్సహించడంలో విజయవంతమైనందుకు ఆనందంగా ఉంది. ఆల్ ది వెరీ బెస్ట్!”
-సాప్ ల్యాబ్స్ ఇండియా ఎండీ, సింధు గంగాధరన్
“హ్యాపనింగ్ హైదరాబాద్‌కు మరో మైలురాయి. ఏసియాలో అతిపెద్ద ఇంక్యుబేటర్ తలుపులు తేరుచుకున్నాయి. అపురూపమైన స్పేస్, అపురూపమైన ఎనర్జీ, అపురూపమైన స్టార్టప్ ఎకో సిస్టమ్.. ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కు అద్భుతమైన ప్రోత్సహాన్ని అందించనున్నాయి. టి హబ్ ఫేజ్-2కు యూకే ఇన్ హైదరాబాద్ శుభాకాంక్షలు”-డాక్టర్ ఆండ్రూ ప్లెమింగ్, ఎపి అండ్ టిఎస్ యూకే హైకమిషనర్
“భారత్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కు మరింత బలం చేకూర్చేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ ఉపయోగపడుతుంది. టిహబ్ 2.0ను ప్రారంభించిన నా స్నేహితుడు కెటిఆర్, ఆయన బృందానికి శుభాకాంక్షలు”-గోవా ఎమ్మెల్యే రోహన్ ఖౌంటే
“మంత్రి కెటిఆర్ ఆలోచన నుంచి పుట్టిన టి హబ్ కొత్త సౌకర్యం హైదరాబాద్ ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్‌ను అగ్రస్థానానికి తీసుకెళ్లడానికి 8 సంవత్సరాలుగా ఎడతెరపిలేకుండా చేస్తున్న ప్రయత్నాల ప్రతిరూపం”-ఎంపి రంజిత్‌రెడ్డి
తెలంగాణ, హైద్రాబాద్‌కు టి హబ్ రెండో దశ మరో కలికితురాయి: ఎంపి అసద్
తెలంగాణ, హైద్రాబాద్‌కు టి హబ్ రెండో దశ మరో కలికితురాయి అని ఎంపి అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. టీ హబ్ రెండో దశ ప్రారంభంపై మంగళవారం ఆయన ట్వీట్ చేశారు. దేశంలోనే తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతోందాన్నా రు. తెలంగాణ్, హైద్రాబాద్ దేశంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రం, నగరంగా మారుతున్నాయని అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతికత, ఆవిష్కరణలకు హైద్రాబాద్ విశ్వకేంద్రంగా మారాలని ఆశిస్తున్నానని తెలిపారు.

Ratan Tata praises on T-Hub

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News