Friday, January 17, 2025

అత్యున్నత ఆస్ట్రేలియా పౌర పురస్కారం అందుకున్న రతన్ టాటా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ చైర్మన్ ఎమెరిటస్ రతన్ టాటాకు ఆస్ట్రేలియా అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’ అవార్డు లభించింది. ఈ సమాచారాన్ని ఆస్ట్రేలియా రాయబారి బారీ ఓ ఫారెల్ ట్వీట్ ద్వారా వెల్లడించారు. బారీ ఓ ఫారెల్ రతన్ టాటాతో ఉన్న కొన్ని ఫోటోలను ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఈ ఫోటోలో ఆయన రతన్ టాటాను అవార్డుతో సత్కరిస్తున్నట్లు కనిపించారు. ఈ ఫోటోల క్యాప్షన్‌లో ‘రతన్ టాటా భారతదేశంలో వ్యాపారం, పరిశ్రమలు, దాతృత్వం, దిగ్గజం మాత్రమే కాదు, ఆయన సహకారం ఆస్ట్రేలియాలో కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపింది’ అని రాశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News