- Advertisement -
న్యూఢిల్లీ : ఏ రూపంలోనూ క్రిప్టోకరెన్సీతో ఎటువంటి సంబంధం లేదని ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా పేర్కొన్నారు. క్రిప్టోకరెన్సీలో తాను పెట్టుబడులు పెడుతున్నాననే వార్తలను ఆయన కొట్టిపారేశారు. ‘నెటిజన్లు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను, నాకెలాంటి క్రిప్టోకరెన్సీతో సంబంధం లేదు’ అని రతన్ టాటా ట్విట్టర్‌లో తెలిపారు. ఒక వ్యాసంతో కూడిన స్క్రీన్‌షాట్‌ను ఆయన ట్విట్టర్‌లో పంచుకున్నారు. క్రిప్టోకరెన్సీతో అనుసంబంధంపై వచ్చిన కథనాలు పూర్తిగా అవాస్తవమని అన్నారు. 2021 సంవత్సరంలో మహీంద్రా గ్రూప్ చైర్మన్ అనంద్ మహీంద్రా కూడా తనపై వచ్చిన క్రిప్టోకరెన్సీలో పెట్టుబడుల వార్తలను ఖండించారు.
- Advertisement -