Wednesday, October 16, 2024

మహా మేటి టాటా

- Advertisement -
- Advertisement -

వారసత్వ క్రమం 1822 నాటిది.. ఇప్పటి టాటాది నాలుగో తరం
అంచెలంచెలుగా ఎదిగిన వ్యాపార వంశవృక్షం

ముంబై: టాటా అనే రెండక్షరాల పదం, దేశ ఆర్థిక , వ్యాపార వాణిజ్య రంగంలో అపూర్వ రీతుల బా టకు దారితీసింది. పెట్టనికోట అయింది. ఇంతకూ రతన్ టాటా విస్తారిత బిజినెస్ సామ్రాజ్యం వంశవృక్షం ఏమిటనేది ఇప్పుడు అందరికీ మదిలో మెదిలో అంశం అయింది. 1937 డిసెంబర్ 28న బొంబాయిలో జన్మించిన రతన్ టాటా వంశానికి ఆద్యుల వివరాలు ఇవే

నుస్సెర్‌వంజి టాటా (1822-86)

ఈ టాటా టాటా కుటుంబానికి పెద్ద , ఆది మూ లపు వ్యక్తి. ఆయనకు జీవన్‌భాయ్ కవాస్‌జీ టా టాతో పెళ్లయింది. వీరికి ఐదుగురు పిల్లలు, జం శెట్జి టాటా, రతన్‌భాయ్ టాటా, మాణెక్‌భాయ్ టా టా, విరభాయ్‌జీ టాటా, జెర్బాయ్ టాటా . వీరిలో జంశెట్జీ టాటా తొలుత టాటా గ్రూప్ స్థాపించారు. ఆ తరువాత కాలక్రమంలో ఇది దేశంలోనే అ త్యంత శక్తివంతమైన వ్యాపార దిగ్గజ సంస్థ అయి నిలిచింది.

జమ్‌శెట్జి టాటా (1839-1904)

టాటా గ్రూప్ వ్యవస్థాకుడు అయిన జమ్‌శెట్జి టా టా భారతదేశ పరిశ్రమ పితామహుడుగా పేరొందారు. 1870లో సెంట్రల్ ఇండియాలో బట్టల మిల్లుతో ఆయన వ్యాపారం ఆరంభమైంది. ఆయన దూరదృష్టి, పట్టుదలతో తరువాతి క్రమంలో టాటా గ్రూప్ స్టీల్, పవర్ ఇండస్ట్రీలకు విస్తరించింది. ఇదే దశలో పలు సాంకేతిక విద్యాసంస్థలు కూడా ఏర్పా టు చేశారు. దేశ పారిశ్రామిక ప్రగతిని ముందుకు తీసుకువెళ్లిన ఘనత ఈ టాటాదే .ఆయనకు హీరాబాయ్ దాబూతో పెళ్లయింది. ముగ్గురు పిల్లలు. వీరు సర్ దోరబ్జీ టాటా, ధున్‌భాయ్ టాటా, సర్ రతన్ టాటా వ్యాపార బాధ్యతలు తీసుకున్నారు.

సర్ దోరబ్జీ టాటా (1859-1932 )

ఈయన జెమ్‌సెట్జీ పెద్ద కుమారుడు. టాటా గ్రూప్ ప్రగతిలో కీలక పాత్ర పోషించారు. 1910లో భారతీయ పరిశ్రమ ప్రగతికి తోడ్పాటు అందించారు. ఆయనకు పిల్లలు లేరు. తన జీవితాన్ని కుటుంబ వ్యాపార విస్తరణకు అంకితం చేశారు.

సర్ రతన్‌టాటా ( 1871-1918)

ఈయన జెమ్‌సెట్జీ టాటా చిన్న కుమారుడు. ఆయ న కూడా టాటా వ్యాపార ప్రగతిలో ముఖ్య పాత్ర వహించారు. ఆయనకు నవజ్‌భాయ్ సెట్టుతో పెళ్లయింది. అయితే వీరికి పిల్లలు కలగలేదు.ఈ రతన్ టాటా మరణం తరువాత ఆయన భార్య నవజ్‌భాయ్ నవల్ టాటాను దత్తత తీసుకున్నారు. నవల్ ఆ తరువాత టాటా కుటుంబ వారసత్వ కీర్తి కాంతుల వృద్థికి పాటుపడ్డారు.

నవల్ హెచ్ టాటా (1904-1989)

ఆయన రతన్ టాటా దత్తపుత్రుడు. నవల్ టాటా సూన్ కమిషయరిట్‌ను పెళ్లాడాడు. వీరికి ఇద్దరు కుమారులు. రతన్‌టాటా, జిమ్మి టాటా. సూనూ త రువాతి క్రమంలో విడాకులు తీసుకున్నప్పుడు రెం డో తరపు రతన్‌టాటా వయస్సు కేవలం పది సంవత్సరాలు. నవల్ ఆ తరువాత సిమోనీ దునోయెర్‌ను పెళ్లాడాడు. వీరికి నోయెల్ టాటా జన్మించాడు.

రతన్ టాటా.. ఆయన పెరిగిన కుటుంబం

ఇప్పుడు దివంగతుడు అయిన రతన్ టాటా తన తమ్ముడు జిమ్మి టాటా, మారు తమ్ముడు నోయల్ టాటాతో కలిసి పెరిగాడు. తల్లిదండ్రుల విడాకుల తరువాత రతన్, జమ్మి వారి నాయనమ్మ నవజ్‌బాయ్ సెట్ ఆలనాపాలనలో ముంబైలోని టాటా ప్యాలెస్‌లో గడిపారు. రతన్ టాటా తన జీవితాన్ని అంతా టాటా గ్రూప్ విస్తరణకు అంకితం చేశారు. 1991 నుంచి టాటా గ్రూప్ ఛైర్మన్‌గా వ్యవహరించారు. 2012లో ఆయన బాధ్యతల నుంచి విరమించుకున్నారు. ఆయన తన హయాంలో కంపెనీని విశ్వవిఖ్యాత కంపెనీగా చేయడంలో పలు చర్యలు తీసుకున్నారు. స్థానిక కంపెనీ గ్లోబల్ అయింది. ఆయన వ్యూహాత్మక ఆలోచనల ఫలితంగా జాగ్వార్ ల్యాండ్ రోవర్ కంపెనీ ధారాదత్తం అయింది. ఇదే క్రమంలో ఆయన పలు వితరణ ధార్మిక కార్యక్రమాలను తమ టాటా ట్రస్టుల ద్వారా చేపట్టారు. దీనితో దేశమంతటా ఆయన కంపెనీ పేరు విశిష్టతను సంతరించుకుంది. పలు సామాజిక, విద్యా , ఛారిటబుల్ కార్యకలాపాలతో టాటా అందరికి చేరువయింది.

జిమ్మి టాటా తెరవెనుకే ఉన్నారు. ఆయన ఎప్పుడూ ఎక్కడా పెద్దగా ప్రజల ముందుకు రాలే దు. కంపెనీ వ్యవహారాలలో చురుగ్గా పాల్గొనలేదు. రతన్‌తో పోలిస్తే నామమాత్రం అయ్యారు. ఇక రతన్ మారు సోదరుడు అయిన నోయెల్ టాటా ఇప్పుడు టాటా గ్రూప్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. రతన్ టాటా రిటైర్మెంట్ తరువాత నోయెల్ పలు విధాలుగా కంపెనీ విస్తరణకు చర్యలు చేపట్టారు. ఆయ నే టాటా ఇన్వెస్టెమెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఉ న్నారు. పైగా టాటా ఇంటర్నేషనల్ సంస్థ ఎండిగా వ్యవహరిస్తున్నారు. టాటా గ్రూప్ లో ఆయనే తరువాతి ప్రధాన వ్యక్తి అవుతారని అంతా బావిస్తున్నారు. రతన్ టాటా మరణంతో ఆయన స్థానంలోకి ఇకపై అధికారికంగా నోయెల్ దూసుకువస్తారని వెల్లడైంది.

నోయల్ టాటా కుటుంబం.. వీరిదే ఇకపై టాటా సారథ్యం

నోయల్ టాటా అలూ మిస్త్రీని వివాహం చేసుకున్నారు. ఆమె పల్లోంజీ మిస్త్రీ కూతురు. పల్లోంజీ పేరు మోసిన పారిశ్రామికవేత్త, టాటా సన్స్‌లో ప్రధాన వాటాదారు. నోయల్‌కు ముగ్గురు పిల్లలు . లిహ్ టాటా, మాయా టాటా, నెవలే టాటా . లీహ్ టాటా ఇప్పుడు టాటా గ్రూప్‌లో కీలక స్థానంలో ఉన్నారు. మాడ్రిడ్ బిజినెస్ స్కూల్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఇప్పుడు ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్‌సిఎల్) వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. మాయా టాటా తమ వ్యాపార జీవితాన్ని టాటా సొంతమైన రిటైల్ కంపెనీ ట్రెంట్‌లో చేరడంతో ఆరంభించారు. తండ్రి నోయల్ సహకారంతో ఈ గ్రూప్ ఏర్పాటు అయింది.

యువతరంతో టాటాకు సరికొత్త రూపం

టాటా కుటుంబ వ్యాపార వారసత్వం విలసిల్లడంలో ఈ వంశంలోని యువతరం ఆలోచనలు ఎంతగానో పనికి వచ్చాయి. ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వాణిజ్య విస్తరణ, ప్రజలతో అనుసంధానంగా ఉండే వ్యాపారాలలో నిమగ్నం అయ్యే ఆలోచనలు, వాటిని కార్యాచరణలో పెట్టడంలో ఈ యువతరం కీలక పాత్ర పోషించింది. దీనితోనే దేశ వ్యాపార వాణిజ్య పరిశ్రమ రంగంలో టాటా గ్రూప్ పేరు చెక్కుచెదరకుండా నిలిచింది. ఇప్పటికీ సాగుతోంది. నోయల్ టాటా , ఆయన పిల్లలు కుటుంబ వ్యాపార కార్యకలాపాలలో అలుపెరుగని పాత్ర పోషిస్తున్నారు. రతన్ టాటా కాలధర్మంతో ఇక టాటా గ్రూప్ అసలుసిసలు వారసులు ఎవరు? అనేది కీలక ప్రశ్న అవుతోంది. అయితే ఇప్పటివరకూ పోషించిన కీలక పాత్రతో నోయల్ టాటా ఆయన వారసులే ఈ టాటా గ్రూప్ మహా వృక్షం సంరక్షక కీలక బాధ్యతలు చేపట్టేందుకు వీలుందని స్పష్టం అవుతోంది. నోయల్ వయస్సు 67 సంవత్సరాలు, రతన్ టాటా లేని లోటును ఆయన మరికొంత కాలం వరకూ ఇదే విధంగా భర్తీ చేయడమే కాకుండా తన వారసులకు ఈ దిశలో అత్యుత్తమ శిక్షణను, మార్గదర్శకత్వాన్ని కూడా అందిస్తారని పారిశ్రామిక రంగాలలో ప్రచారం జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News