Thursday, November 21, 2024

టాటా హెలికాప్టర్ ప్రాజెక్టును గుజరాత్‌కు ఎత్తుకుపోయారు:శరద్ పవార్

- Advertisement -
- Advertisement -

ముందుగా నిర్ణయించిన ప్రకారం టాటా అడ్వాన్డ్ సిస్టమ్స్, ఎయిర్‌బస్‌కు చెందిన ఫైనల్ అసెంబ్లీ లైన్(ఎఫ్‌ఎఎల్) మహారాష్ట్రలో ఏర్పాటు కావలసి ఉండగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రోద్బలంతో ఆ యూనిట్ గుజరాత్‌కు తరలిపోయిందని ఎన్‌సిపి(ఎస్‌పి) అదినేత శరద్ పవార్ మంగళవారం వెల్లడించారు. ఆ ప్రాజెక్టు మహారాష్ట్రలో ఏర్పడాలని రతన్ టాటా భావించారని, అందుకోసం నాగపూర్‌లోని ఎంఐడిసి ప్రాంతంలో 500 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించడం జరిగిందని బారామతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ శరద్ పవార్ వివరించారు.

గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా తాను కేంద్ర మంత్రిగా ఉన్న ప్రభుత్వంలో ఇది జరిగిందని ఆయన తెలిపారు. తమ ప్రభుత్వం మారి ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రతన్ టాటాను పిలిపించి ఫ్యాక్టరీని గుజరాత్‌లో నెలకొల్పాలని కోరారని ఆయన చెప్పారు. ఆ ప్రాజెక్టు మహారాష్ట్రలో ఏర్పడి ఉంటే వేలాది మందికి ఉద్యోగాలు వచ్చి ఉండేవని ఆయన చెప్పారు. ఫాక్స్‌కాన్(సెమీకండక్టర్) ఫ్యాక్టరీని కూడా మహారాష్ట్ర కోల్పోయిందని, దీన్ని కూడా ప్రధాని మోడీ తన సొంత రాష్ట్రానికి తరలించుకుపోయారని ఆయన ఆరోపించారు. ప్రధాన మంత్రి ఒక రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాడని, ఆయన యావత్ దేశానికి చెందిన వ్యక్తని పవార్ వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News