Sunday, December 22, 2024

ప్రైవేట్లోనూ కొవిషీల్డ్, కొవాగ్జిన్ డోసు రేటు రూ.225

- Advertisement -
- Advertisement -

Rates of Covishield Covaxin slashed to Rs 225 per shot

టీకా ధరలు భారీగా తగ్గింపు

న్యూఢిల్లీ : దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఆదివారం నుంచి ప్రికాషన్ డోసు పంపిణీ ప్రారంభం కానున్న సమయంలో వ్యాక్సిన్ తయారీ సంస్థలు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకా ధరలను భారీగా తగ్గించాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈ టీకాల ధరలు రూ. 225 గా ఉండనున్నట్టు ప్రకటించాయి. 18 ఏళ్లు పైబడిన వారు ప్రికాషన్ డోసులను ప్రైవేట్ కేంద్రాల్లో మాత్రమే తీసుకోవాలని కేంద్రం తెలిపిన నేపథ్యంలో టీకా తయారీ సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రులకు కొవిషీల్డ్ టీకా డోసు ధరను రూ.600 నుంచి రూ.225 కు తగ్గిస్తున్నట్టు సీరమ్ సీఈఒ అదర్ పూనావాలా ట్విటర్ వేదికగా వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు పూనావాలా తెలిపారు. అటు భారత్ బయోటెక్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. ప్రైవేట్ ఆస్పత్రులకు కొవాగ్జిన్ టీకా డోసుల ధరను రూ. 1200 నుంచి రూ.225 కు తగ్గించాలని నిర్ణయించినట్టు భారత్ బయోటెక్ జాయింట్ ఎండీ సుచిత్ర ఎల్లా వెల్లడించారు.

సర్వీస్ ఛార్జీ గరిష్ఠంగా రూ.150
అయితే ఈ టీకా ధరలకు సర్వీస్ ఛార్జీ అదనం. ఈ ఛార్జీలు గరిష్ఠంగా రూ.150 మాత్రమే తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రైవేట్ కేంద్రాలకు సూచించింది. దీంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకా ధరలు గరిష్ఠంగా రూ. 375 ( సర్వీస్ ఛార్జీలు కలుపుకుని) ఉండనున్నాయి.

రిజిస్ట్రేషన్ అక్కర్లేదు
ప్రికాషన్ డోసు కోసం ప్రత్యేకంగా మళ్లీ కొత్తగా నమోదు చేయించుకోవాల్సిన అవసరం లేదు. కొవిడ్ యాప్‌లోకి వెళ్లి ప్రికాషన్ డోసు కోసం అపాయింట్‌మెంట్ బుక్ చేసుకుంటే సరిపోతుంది. లేదా నేరుగా ప్రైవేట్ కేంద్రాలకు వెళ్లి టీకా తీసుకోవచ్చు. తొలి రెండు డోసులు ఏ రకం టీకా అయితే తీసుకున్నారో ప్రికాషన్ డోసు కూడా అదే తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. అంటే తొలి రెండు డోసులు కొవాగ్జిన్ తీసుకున్నవారు.. మూడోడోసు కూడా అదే వేయించుకోవాలి. తొలి డోసులు కొవిషీల్ట్ తీసుకుంటే ప్రికాషన్ డోసు కూడా కొవిషీల్డే తీసుకోవాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News