Thursday, December 19, 2024

క్యాన్సర్ ఔషధాలపై జిఎస్‌టి తగ్గింపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: క్యాన్సర్ ఔషధాలపై జిఎస్‌టి కౌన్సిల్ ఊరటనిచ్చింది. క్యాన్సర్ డ్రగ్స్‌పై ప్రస్తుతం ఉన్న 12 శాతం జిఎస్‌టి రేటు ను 5 శాతానికి తగ్గిస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అలాగే ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియం చెల్లింపులపై జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను)ని తగ్గించడంపై జిఎస్‌టి కౌ న్సిల్ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీ సుకోలేదు. ప్రస్తుతం బీమా ప్రీమియంపై జిఎస్‌టి గరిష్ఠ స్థాయిలో 18 శాతం విధిస్తున్నారు. దీనికి తగ్గించాలని మంత్రుల తో పాటు పలువురు పార్లమెంట్ సభ్యులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై జిఎస్‌టి కౌన్సిల్ చర్చ జరిపింది. ఆరోగ్య, జీవితా బీమా ప్రీమియం పై జిఎస్‌టి తగ్గించేందుకు జిఎస్‌టి కౌ న్సిల్ ఏకగ్రీవంగా అంగీకారం తెలిపినప్పటికీ, వచ్చే సమావేశానికి నిర్ణయాన్ని వా యిదా వేశారు. ఈ విషయంలో ఊరట లభించే అవకాశముందని అధికార వర్గా లు పేర్కొంటున్నాయి. సోమవారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో 54వ జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియం చెల్లింపుపై జిఎస్‌టిని తగ్గించే అంశంపై మరింత అధ్యయనం చేయాల్సి ఉందని కౌన్సిల్ భావించింది. కేంద్ర రాష్ట్ర పన్ను అధికారులతో కూడిన ఫిట్‌మెంట్ కమిటీ బీమా ప్రీమియంపై జిఎస్‌టి తగ్గిం పు వచ్చే లాభనష్టాలను భేరీజు వేయనుం ది. ఈ అంశంపై విచారణ నిమిత్తం మం త్రుల బృందానికి పంపారు.ఆరోగ్య బీమాపై జిఎస్‌టి రేటు తగ్గింపుపై అధ్యయ నం చేసేందుకు బీహార్ ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రుల బృందం ఏర్పాటైంది. ఈ మంత్రివర్గం వచ్చే నెల చివరి నాటికి నివేదికను సిద్ధం చేయాల్సి ఉంటు ంది. 2024 నవంబర్‌లో జరిగే జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో దీనిపై మళ్లీ చర్చిం చి, ఒక నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.

తీర్థయాత్రలు చేపట్టే వారికి ఊరట
క్యాన్సర్ ఔషధాలపై ప్రస్తుతం ఉన్న 12 శాతం జిఎస్‌టి రేటును 5 శాతానికి తగ్గి స్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అలాగే స్నాక్స్‌పై జిఎస్‌టిని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గిస్తున్నట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో మతపరమైన యాత్రలు చేసే వారి కి శుభవార్త అందించారు. ఇకపై మతపరమైన తీర్థయాత్రలు చేపట్టే వారు హెలికాప్టర్ సేవలను వినియోగించుకోవడంపై 18 శాతానికి బదులుగా 5 శాతమే జిఎస్ టి చెల్లించాలని సమావేశంలో నిర్ణయించారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. జిఎస్‌టి పరిహార సెస్సు కొనసాగించాలా, లే దా అనే అంశంపై మంత్రివర్గానికి సిపార సు చేస్తున్నట్టు ఆర్థికమంత్రి తెలిపారు. ఆ న్‌లైన్ గేమింగ్‌పైనా కౌన్సిల్ చర్చించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News