Monday, December 23, 2024

రేపు తిరుమలలో రథసప్తమి వేడుకలు

- Advertisement -
- Advertisement -

రేపు తిరుమలలో రథసప్థమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. మలయప్పస్వామి ఏడు వాహనాల పై దర్శనమివ్వనున్నారు. ఉదయం 5.30 నుంచి 8 గంటల వరకు(సూర్యోద‌యం ఉద‌యం 6.45 గంట‌ల‌కు) సూర్యప్రభ వాహనం , ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం, ఉదయం 11 నుంచి 12 గంటల వరకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం,

మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై దర్శనమినున్నారు. ఎస్ఎస్ డీ టోకెన్లు,వీఐపి బ్రేక్, అర్జితసేవలు రద్దు చేస్తున్నట్లు టిటిడి పేర్కొన్నారు. శుక్రవారం , శనివారం అడ్వాన్స్ వసతి గదులు కేటాయింపు రద్దు చేస్తున్నట్లు టిటిడి అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News