- Advertisement -
కరోనా టీకా తీసుకోకపోతే రేషన్, పింఛన్లు బంద్ చేస్తారన్న వదంతులను నమ్మొద్దు
తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు
మూడో ముప్పు దగ్గరలోనే ఉంది : డిహెచ్
మనతెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్రంలో వ్యాక్సిన్ తీసుకోకుంటే రేషన్, పెన్షన్ నిలిపివేస్తారంటూ వస్తోన్న వార్తలను ప్రజారోగ్య సంచాలకులు(డీహెచ్) డాక్టర్ శ్రీనివాసరావు ఖండించారు. ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ప్రజలు అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. తప్పుడు వార్తను ప్రసారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మూడో ముప్పు దగ్గర్లోనే ఉందని.. అందరు మాస్కులు తప్పక ధరించి, భౌతిక దూరం పాటించాలని కోరారు.
- Advertisement -