మన తెలంగాణ/బంట్వారం: మండల పరిధిలోని నాగ్వారం తండాలో ఉన్న రేషన్ షాప్ నెం.4101010లో గత నాలుగు రోజుల క్రితం నాగ్వారం గ్రామస్థులకు 5కేజీల బియ్యం తక్కువగా ఇచ్చారని ఫ్రింట్ మీడియాలో వచ్చిన కథనానికి స్పందించిన అధికారులు సరైన విచారణ జరపకుండానే తనను తాత్కాలికంగా విధుల నుండి తొలగించడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు జరిగిన విషయం ఏమిటంటే.. గత సంవత్సరం డిసెంబరు నెలలో ఇంచార్జిగా ఉన్న డీలర్ ఈపాస్ మిషన్‌లో నమోదు చేయకుండా మ్యానువల్‌గా రిజిస్టర్‌లో రాసుకొని లబ్ధ్దిదారులకు బియ్యం ఇవ్వడం వలన అట్టి కోటా బియ్యం ఆన్‌లైన్‌లో తగ్గలేదు. అలా చేయడం వలన అప్పటి నుంచి ఇప్పటివరకు అనగా, ప్రస్తుత నెల వరకు రేషన్ కోటా ఎక్కువగా చూపిస్తూనే వచ్చింది. అలా చూపడంతో ఈ నెల రెవెన్యూ అధికారులు చెప్పిన విధంగానే.. అనగా రేషన్‌కార్డు ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారునికి తక్కువగా ఇవ్వడం జరిగిందని అన్నారు. ఇట్టి సమస్యను మరొకమారు విచారణ జరిపి నాకు తగున్యాయం చేయాలని రేషన్ డీలర్ గోవింద్ ఆవేదన వ్యక్తం చేస్తునారు.
Ration Dealer suspended in Bantwaram