- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శనంలో పేదల ఆకలి తీర్చడంలో రేషన్ డీలర్లే కీలకపాత్ర పోషిస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం 2022నూనత సంవత్సరానికి గాను రూపొందించిన క్యాలెండర్ను మంత్రి గంగుల గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా రాష్ట్ర వినియోగదారులకు, రేషన్ డీలర్లకు మంత్రి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన క్యాలెండర్ రూపొందించిన డీలర్ల సంక్షేమ సంఘాన్ని మంత్రి కమాలకర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో డీలర్ల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు ఎం. దేవేందర్ రెడ్డి, అధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి ఆవుల సంజీవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -