Monday, December 23, 2024

రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారమవుతున్నాయి : మంత్రి గంగుల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం హామీనిచ్చిన విదంగా రేషన్ డీలర్ల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తున్నదని రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం నాయకులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం మంత్రి గంగుల కమలాకర్ కృషితో రాష్ట్రంలోని 17వేల కుటుంబాలకు పైగా ఆధారపడ్డ రేషన్ డీలర్ల ముఖ్య సమస్యలు పరిష్కారం దిశగా సాగుతుండడం పట్ల సంపూర్ణంగా సంతృప్తిని వ్యక్తం చేసారు, మంగళవారం సచివాలయంలో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను కలిసిన రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం ప్రతినిధులు తమ ధన్యవాదాలు తెలియజేసారు.

దాదాపు 90 లక్షలకు పైగా మందికి సొంతంగా రాష్ట్ర ప్రభుత్వమే రేషన్ అందిస్తుందని, దీనిద్వారా రేషన్ డీలర్లు సైతం లబ్దీ పొందుతున్నారన్నారని తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో రేషన్ డీలర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ నాయికోటి రాజు, నేతలు పుస్తే శ్రీకాంత్, శ్రీదర్ వల్లాల, చారీ తదితరులున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News