Thursday, January 23, 2025

రేషన్ ’ప’రేషాన్

- Advertisement -
- Advertisement -

ముప్కాల్ : ప్రతినెల ఒకటో తారీకు నుంచి ఐదో తారీకు వరకు చౌక ధర దుకాణాల్లో బియ్యం వచ్చి పంపిణీ ప్రారంభమై నేటితో ముగుస్తుండే. కానీ నేటి వరకు దుకాణాల్లో బియ్యం రాకపోవడంతో ప్రజల ఇబ్బందులకు గురవుతున్నారు. ఎఫ్‌సిఐ గోదాములో పెద్దపల్లి నుండి నిజామాబాద్‌కు బియ్యం రాకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. స్టాక్ లేకపోవడం వల్ల కేవలం 35 దుకాణాలకు మాత్రమే బియ్యం పంపిణీ చేశారు. రేషన్‌షాప్‌ల్లో బియ్యం రాకపోవడం, సన్న బియ్యం ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడం పేదలకు కొనలేని పరిస్థితి ఏర్పడింది. నిత్యం వినియోగం పెరిగిన రేషన్ బియ్యం వినియోగిస్తూ రేషన్ బియ్యం కోసం దుకాణాల వద్ద కార్డుదారులు ఎదురుచూస్తున్నారు. జిల్లాలో ప్రతినెల 20లోపు రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నారు. కానీ ఈనెల సగం రోజులు గడిచిన ఇప్పటి వరకు కేవలం ముప్పై శాతం మాత్రమే పంపిణీ చేశారు. ముందస్తుగా రేషన్ బియ్యం కోసమే సకాలంలో చేరుకోకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైంది. జిల్లాకు 200 కిలో మీటర్ల దూరంలో ఉన్న పెద్దపల్లి నుండి బియ్యం సరఫరా చేయడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జిల్లాల మొత్తం 759 రేషన్ షాపులు ఉన్నాయి. పెద్ద మొత్తంలో షాపులకు బియ్యం రాకపోవడంతో ప్రజలు రోజు వచ్చి దుకాణాదారులను ప్రశ్నించిపోతున్నారు. పెద్దపల్లి నుండి నాన్ పోర్టబుల్ రైస్ సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ప్రతిసారి బియ్యం రావాలంటే దుకాణదారులు వేచి చూడాల్సిన దుస్థితి. గత కొన్ని నెలలుగా ఏర్పడింది. ప్రతిసారి జిల్లాకు 7 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పంపించేవారు ఈసారి 3 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే సరఫరా చేశారు.
ముప్కాల్‌కు ప్రతిసారి ఇదే పరిస్థితి : జిల్లాలో ఎఫ్‌సిఐ గోదాములో బియ్యం ఉన్న లేకున్నా ముప్కాల్ మండల పరిస్థితి రోజురోజుకు బియ్యం విషయంలో దిగజారిపోతుంది. గోదాముల్లో బియ్యాన్ని సరఫరా చేయాల్సిన అధికారులు పద్దతి ప్రకారం కాకుండా ఇష్టం వచ్చినట్లు సరఫరా చేయడం, వారిని ఏమీ అనలేని పరిస్థితుల్లో దుకాణాలలో ఉండడం దీనికి ప్రధాన కారణం. ముప్కాల్ మండల తహసీల్దార్ ఏనాడు ఈవిషయంపై శ్రద్ద వహించకపోవడం ఎఫ్‌సిఐ గోదాముల అధికారులను బెదిరించకపోవడం వల్ల ఈసమస్య తలెత్తుతుందని సామాన్య ప్రజలు అంటున్నారు. గోదాములో వచ్చిన సన్న బియ్యాన్ని ముప్కాల్ మండలంలో సరఫరా చేసి చాలా రోజులు అవుతుంది. ఎందుకు సరఫరా అవ్వట్లేదు అని ప్రజలు ప్రశ్నిస్తే గోదాముల అధికారులు ఎలా పంపితే అలా వస్తుంది మనకు అని దుకాణాలు చెప్తున్నారు. ఆర్మూర్‌లోని గోదాము నాలుగైదు మండలాలకు బియ్యం సరఫరా చేస్తుందని అందులో ఉమ్మడి బాల్కొండ మండలం కూడా ఉందని అందుకే ప్రతిసారి ఈవిధంగా ఆలస్యం జరుగుతుందన్నారు. పాత బాల్కొండ మండలంలో కిసాన్ గ్రామంలో ఉన్న ఎఫ్‌సిఐ గోదాంలో ఉమ్మడి బాల్కొండ మండలంలోని గ్రామాలకు బియ్యం సరఫరా చేస్తే బాగుంటుందని డీలర్లు అంటున్నారు. అధికారులు ఇప్పటికైనా పట్టించుకొని దుకాణాల్లో బియ్యం వచ్చేలా చూడాలని, పేద ప్రజల బియ్యం భారాన్ని తొలగించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News