Friday, November 22, 2024

రాష్ట్రంలో 87.54లక్షల కుటుంబాలకు రేషన్ పంపిణీ

- Advertisement -
- Advertisement -

గన్నీ సంచుల ధర రూ.21కి పెంపుదల
డీలర్లకు కమీషన్ కింద రూ.54కోట్లు
పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్

ration

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో 87.54లక్షల కుటుంబాలకు రేషన్ అందచేస్తున్నట్టు పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. సంస్థ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఛైర్మన్ మంగళవారం నాడు మీడియాకు వివరించారు. రేషన్ షాపుల ద్వారా ప్రతినెల 1.75లక్షల మెట్రిక్ టన్నుల రేషన్ పంపిణీ చేస్తున్నామని తెలిపారు.రేషన్ పంపిణీ అనంతరం డీలర్ల దగ్గర ప్రతినెల 30లక్షల గన్నీ సంచులు మిగిలిపోతున్నాయన్నారు. గతంలో డీలర్లు ఈ సంచులను ప్రైవేటు కాంట్రాక్టర్లుకు అమ్ముకునే వారని తెలిపారు ఈ గన్నీ సంచులను పౌరసరఫరాల సంస్థ సంచి రూ.18 ధరతో కొనుగోలు చేస్తూ వచ్చిందన్నారు . డీలర్ల వినతిని దృష్టిలో ఉంచుకుని బోర్డు సమావేశంలో చర్చించి గన్ని సంచి ధరను రూ.21రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నుట్లు తెలిపారు.

ఈనెల ఒకటి నుండి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని వెల్లడించారు. అదే విధంగా డీలర్లకు రేషన్ కమీషన్ కింద చెల్లించాల్సిన రూ.54కోట్లు కూడా విడుదల చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చేపట్టిన రైతు సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ధాన్యం దిగుబడులు పెరగాయన్నారు. అందుకు అనుగుణంగానే పౌరసరఫరాల సంతస్థ ధాన్యం కొనుగోళ్లు జరుపుతుండటంతో గన్నీ సంచుల వినియోగం భారీగా పెరిగిందన్నారు.

ఈ యాసంగి సీజన్‌లో దాదాపు 9కోట్ల పాత గన్నీ సంచులు అవసరం కానున్నాయన్నారు. పాత గన్నీసంచుల వినియోగం పెరడటంతో రేషన్ డీలర్లు ఖచ్చితంగా గన్నీసంచులను పౌరసరఫరాల సంస్థకే విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే గన్నీ సంచుల ధరలు పెంచటం జరిగిందన్నారు. ప్రతి గన్నీ సంచిని పౌరసరఫరాల సంస్థకే విక్రయించేలా క్షేత్రస్థాయిలో అదనపు కలెక్టర్లు , జిల్లా మేనేజర్లు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రేషన్ డీలర్ల న్యాయపరమైన సమస్యలను ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకుపోయి వాటి పరిస్కారానికి కృషి చేస్తామని ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News