Friday, January 24, 2025

రేషన్ బియ్యం పట్టివేత

- Advertisement -
- Advertisement -

పెబ్బేరు : మండల పరిధి లోని శివ సాయి రైస్ మిల్లులో 33. 45 క్విం టాళ్ల రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. దీం తో సివిల్ సప్లై అధికారు లు ఆ మిల్లును సీజ్ చేసి కే సు నమోదు చేశారు. సో మవారం అర్థరాత్రి కేటిదొడ్డి నుంచి పెబ్బేరు మండల పరిధిలోని సూగూర్ రోడ్‌లో ఉన్న శివసాయి రైస్ ఇండస్ట్రీ స్ మిల్లుకు బొలెరో వాహనంలో 32.45 క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిం చారు. గస్తీలో ఉన్న ఎస్‌బి పోలీసులు మిల్లులోని రేషన్ బియ్యాన్ని పట్టుకున్నా రు.

సమాచారం మేరకు సివిల్ సప్లై డిటిలు వేణుగోపాల్, నంద కిషోర్‌లు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. వాటిని రేషన్ బియ్యంగా గుర్తించారు. శివ సాయి రైస్ ఇండస్ట్రీస్ యజమాని వెంకట్రామి రెడ్డితోపాటు బొలెరో వాహన డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. మిల్లును సీజ్ చేసి స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని శ్రీరంగాపూర్‌లోని భువన రైస్ మిల్లుకు తరలించినట్లు సివిల్ సప్లై శాఖ డిటి వేణుగోపాల్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News